Utthareni Medicinal Plant: సాధారణంగా మనం మన పంట పొలాల్లో గడ్డి మొక్కలుగా పరిగణించే వాటిలో చాలా వరకు ఔషధ గుణాలున్న మొక్కలే ఉంటాయి, అందులో ఒకటే ఈ ఉత్తరేణి. గ్రామాల్లో ఎక్కడ చూసినా ఈ మొక్క మనకు కనిపిస్తూ ఉంటుంది, కానీ దీనిలో ఉండే ఔషధ గుణాలు మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఉత్తరేణి యొక్క శాస్త్రీయ నామం అకిరాంథెన్స్ ఆస్పెరా. ఆయుర్వేదంలో ఈ ఉత్తరేణి మొక్కను చాలా విరివిగా ఉపయోగిస్తారు. ఉత్తరేణి యొక్క ఆకులను వినాయకుని పూజకు కూడా ఉపయోగిస్తారు. ఉత్తరేణి నుండి తీసిన కషాయం, దాని యొక్క సారం అనేక రకాల రోగాలను నయం చేయడంలో తోడ్పడుతుంది. దాదాపుగా ఈ మొక్క యొక్క అన్ని భాగాలు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.
ఉత్తరేణి మొక్క యొక్క ఆకులు, వేర్లు మరియు విత్తనాలలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫ్లేవనాయిడ్స్, టానిన్లు మరియు సపోనిన్లు వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు పుష్కలంగా లభిస్తాయి. తాజా ఉత్తరేణి ఆకుల గుజ్జును తేలు కాటుకు సమర్థవంతమైన ఇంటి నివారణగా వాడుతారు. అలాగే వీటి విత్తనాలను పాము, సరీసృపాల కాటుకు మరియు కంటి వ్యాధులు, ఇతర కార్నియల్ ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి ఉపయోగిస్తారు. ఈ మొక్క యొక్క పుష్పించే స్పైక్‌లను కొద్దిగా చక్కెరతో కలిపి, హైడ్రోఫోబియా చికిత్సకు ఉపయోగిస్తారు. ఉత్తరేణి ఆకులను మెత్తగా నూరి ఆ ముద్దను నడుం నొప్పి, కీళ్ల నొప్పి ఉన్న చోట పెట్టి కట్టు కడితే మంచి ఉపశమనం లభిస్తుంది. దీని ఆకులు పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వుని కరిగించడంలో కూడా తోడ్పడతాయి.
పూర్వం నుండి ఈ ఉత్తరేణి యొక్క ఆకుల రసాన్ని పంటి నొప్పి, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారడాన్ని నివారించడానికి అద్భుతమైన ఔషధంగా ఉపయోగిస్తున్నారు. దీని ఆకుల రసాన్ని దూది సహాయంతో నొప్పి పుడుతున్న పన్నుపై రోజుకి రెండు సార్లు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చర్మంపై ఏర్పడే దద్దుర్లు, మంట మరియు నొప్పి నుండి బయటపడడానికి ఉత్తరేణి ఆకుల రసం అద్భుతంగా సహాయపడుతుంది. ఉత్తరేణి నుండి తీసిన కషాయాన్ని కిడ్నీలను శుభ్రపరచాడినికి ఉపయోగించవచ్చు, తద్వారా మూత్రం కూడా సాఫీగా ఉంటుంది. వృద్దాప్యాన్ని నివారించే మెడిసిన్స్ లో ఉత్తరేణిని ఉపయోగిస్తారు. ఉత్తరేణి యొక్క విత్తనాలను పాలతో వండుకొని తింటే అజీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. ఉత్తరేణి వేర్ల యొక్క పౌడర్ ని ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలను నివారించడానికి ఉపయోగించవచ్చు. మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పిని తగ్గించడంలో కూడా ఈ ఉత్తరేణి ఆకుల రసం ప్రభావవంతంగా పనిచేస్తుంది.
Also Read: Micro Nutrient Management in Mango: మామిడిలో సూక్ష్మపోషకాలు – సవరణ