సాధారణంగా మిడతల పేరు ఎత్తితే చాలు రైతులందరూ బెంబేలెత్తి పోతుంటారు అన్న విషయం తెలిసింది. ఎందుకంటే ఇక ఒక్కసారి పంటపై మిడతలు దాడి చేశాయి అంటే చాలు నామ రూపాల్లేకుండా పంటను నాశనం చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అందుకే మిడతల నుంచి పంటను రక్షించుకోవడం కోసం రైతులు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వుంటారు. అయితే రైతులు ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ మిడతలు మాత్రం ఏదో ఒక విధంగా దాడిచేసి పంటను నాశనం చేస్తూ ఉంటాయి. ఇక కొన్ని కొన్నిసార్లు అయితే విదేశాల నుంచి మరి మిడతల దండు దూసుకువచ్చి పంటపై దాడి చేసి గంటల వ్యవధిలోనే పంట మొత్తం నాశనము చేసి లక్షల రూపాయల నష్టం కలిగిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఇలా మిడతల ద్వారా రైతులు తీవ్ర స్థాయిలో పంట నష్ట పోతారు అన్న విషయం మాత్రమే అందరికీ తెలుసు కానీ మిడతల ద్వారా లక్షల రూపాయలు సంపాదించవచ్చు.
సాధారణంగా అయితే సీజనల్ గా మిడతలు పంటలపై దాడి చేస్తూ పూర్తిగా పంటను నాశనం చేస్తూ ఉంటాయి. అయితే ఇదే తరహా సమస్యతో బాధ పడిన రైతులు ప్రస్తుతం మిడతల సహాయంతోనే లాభం పొందుతున్నారు. మిడతలలో ప్రోటీన్, జింక్, ఐరన్ లాంటివి ఎక్కువగా ఉంటాయి. అందుకే మిడతలను పొడిగా చేసి పశువులకు దాణాగా పెట్టవచ్చు అంటూ ఓ స్టార్టప్ రైతులందరికీ అవగాహన కల్పించింది. అంతేకాదు మిడతలు పెంచితే దాన్ని కొనుగోలు చేస్తాము అంటూ చెప్పడంతో ఇక కొందరు రైతులు మిడతల పెంపకాన్ని చేపట్టి భారీగా ఆదాయాన్ని పొందుతున్నారు. ఇలా ఒకప్పుడు లక్షల నష్టం కలిగించిన మిడతలు ప్రస్తుతం రైతులకు కాసుల వర్షం కురిపిస్తుంది.
మిడతల పెంపకం .. రైతులకు లక్షల్లో ఆదాయం..
Leave Your Comments