వార్తలు

మొక్కకు ఈ బాక్స్ పెడితే చాలు.. నీళ్లు పొసే అవసరం లేదు

0

పనుల బిజీలో పట్టించుకోకపోతే నీళ్లు మొక్కలు ఎండిపోతాయి. ఇష్టపడే ముఖాల్లో ఆనందము ఉండదు. ఇట్లాంటి బాధలు ఇంకెప్పుడూ ఉండవు. మొక్కకో ప్లాంట్ బాక్స్ పెట్టారంటే నెలకు రెండు సార్లు నీళ్లు పోస్ట్ చాలు. పచ్చగా ఉంటూ ఏపుగా పెరిగి చక్కగా పూలు పూస్తాయి.
విత్తు నాటితే మొలక వచ్చే దాకా ఒక కష్టం. మొక్క పెరిగి మానయ్యేదాకా కష్టం. మొక్కలు పెంచడం పిల్లల్ని పెంచడం లాంటిదే వాటికి ఏ పూటకాపూట నీళ్లు పోయాలి. నీళ్లు ఎక్కువైనా ఇబ్బందే తక్కువైనా ఇబ్బందే. మొక్కకు రకంగా నీళ్లు పోయాలి. పెరటి మొక్కైనా, పంట చేలోనైనా .. చెట్టుకో నీళ్ల లెక్క ఉంటది.
మొక్కల నీటి అవసరాలు తీర్చాలంటే రోజూ అదో పని. ఎక్కువ మొక్కలు పెంచాలంటే ఓ మనిషిని కేటాయించాల్సిందే కష్టం అయినా పర్వాలేదని మొక్కలు నాటేవాళ్ళున్నారు. కానీ ఎప్పుడో ఒకప్పుడు ఊరికి పోవాల్సి వస్తుంది. ఎంతోకాలం పెంచిన మొక్కలకు నాలుగు రోజులు నీళ్లు లేవంటే అంతే సంగతులు.. వాడిపోయి, ఎండిపోతాయి. మొక్కలకు నీటి అవసరాలు తీర్చడం ఈ రోజుల్లో కొంచెం కష్టమే ఈ పనిని ఈజీగా మార్చాడు మాచర్ల రాహుల్. ఆస్ట్రేలియాలో ఎంస్ చదివి, సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసాడు. తనకు మొక్కలంటే చాలా ఇష్టం. ఉద్యోగంలో బిజీగా ఉన్నా ఇంటి చుట్టూ మొక్కలు ఎండిపోయేవి. మొక్కల మీద ప్రేమ ఉన్నోడు కాబట్టి బాధపడ్డాడు. మొక్కలకు నీటి ఇబ్బంది లేకుండా ఎట్లా చేయాలని ఆలోచనలో పడ్డాడు.
నెదర్లాండ్ సెల్ఫ్ ఇరిగేషన్కి ఉపయోగపడే ప్రోడక్ట్స్ తయారు చేసే కంపెనీ ఒకటి ఉందని తెలుసుకున్నాడు. ఆ కంపెనీ తయారు చేసిన ప్లాంట్ బాక్స్ లు కొన్నాడు. ప్రతి పాదుకి ఒక ప్లాంట్ బాక్స్ పెట్టాడు. ఆ బాక్స్ నిండా నీళ్లు పోస్తే చాలు అందులో దీపంలో తాకేలా వేలాడేస్తే చాలు. మొక్కకు కావాల్సిన తేమని ఇస్తూ ఉంటది. నీళ్లు ఎక్కువై మొక్క పాడుకాదు. తేమలేక మొక్క చచ్చిపోదు. పదిహేను రోజులు పాడులో తేమ ఉంటుంది. ఉద్యోగం, ట్రావెల్, ఇంకేపనిలో బిజీగా ఉన్నా మొక్కలకు ఏ ఇబ్బంది ఉండదు ఈ సెల్ఫ్ ఇరిగేషన్ టెక్నీక్ తో
ఎండ ఎక్కువగా వుండే ఇండియాలో ప్లాంట్ బాక్స్ ల అవసరం ఎక్కువగా ఉందని రాహుల్ అనుకున్నాడు, ఈ ఐడియాతో ఇండియాలో సెల్ఫ్ ఇరిగేషన్ ప్రోడక్ట్స్ ని మార్కెట్ చేయాలని 2019 లో ఇండియా వచ్చాడు. మన దేశంలో టెంపరేచర్, ఎండని బట్టి మెటీరియల్ సెలెక్ట్ చేసుకుని ప్లాంట్ బాక్స్ మాడ్యూల్స్ కోసం నవంబర్ లో ప్రయోగాలు మొదలుపెడితే 2020 మార్చినాటికి సక్సెస్ అయింది. వీటిని మార్కెట్ చేద్దామనుకునే సరికి కరోనా దెబ్బతో లాక్ డౌన్ వచ్చింది. 2021 ఫిబ్రవరి నెలలో ఈ బాక్స్ లు కావాలని గవర్నమెంట్ ఆర్డర్ పెట్టింది. ఇట్ల ఒడిదుడుకులతో రాహుల్ ప్రయోగం సక్సెస్ అయింది. గ్రీన్ నౌ పేరుతో కంపెనీ స్టార్ట్ చేసి ఎంట్రప్రెనూర్ గా నిలదొక్కుకున్నాడు.
ప్లాంట్ బాక్స్ మొక్క చుట్టూ కుదురుపైన ఉంటుంది. ఇందులోని వత్తి కుదురుని తేమగా ఉంచుతుంది. కొద్దీ కొద్దిగా ఇచ్చే తేమ ఎండకు ఆరిపోదు. ఎందుకంటే కుదురుపైన ఎండ పడకుండా ప్లాంట్ బాక్స్ కవర్ చేస్తూ ఉంటుంది. అలాగే ప్లాంట్ బాక్స్ లో వున్న నీళ్లు ఆవిరికాకుండా ఒక మూత ఉంటుంది. ఇలా తక్కువ నీళ్లతో ఎక్కువ రోజులు మొక్కను కాపాడుకునే ఉపాయం బాగుందని రియల్ ఎస్టేట్ కంపెనీల వాళ్ళు ముందుకొచ్చారు. గేటెడ్ కమ్యూనిటీలు, డెవలప్ చేసే వెంచర్స్ లో వీటిని ఇన్ స్టాల్ చేసి గ్రీన్ బెల్ట్ ని డెవలప్ చేస్తున్నారు.
ప్లాంట్ బాక్స్ లు పూల మొక్కలు, కూరగాయ మొక్కల కంటే పండ్ల మొక్కలు, కలపనిచ్చే మొక్కలకు వాడొచ్చు. ఒక బాక్స్ 99 రూపాయలు. ఒక మామిడి చెట్టుకు ఒక బాక్స్ ఆ వంద రూపాయలకు పది రేట్ల ఆదాయం ఉంటుంది కాబట్టి రైతుకు లాభమే కానీ నష్టం లేదు. అదే ఒక టొమాటో మొక్కకు వంద రూపాయల బాక్స్ పెడితే అంత దిగుబడి ఉండదు. ఆదాయం రాదు. కాబట్టి లాభం లేదు. మామిడి, జామ, సపోటా, నిమ్మ, బొప్పాయి లాంటి పండ్ల మొక్కలు, రోజ్ వుడ్, టెక్ వుడ్, శాండల్ వుడ్, రావి, వేప లాంటి కలపనిచ్చే మొక్కల పెంపకానికి కూడా ఏవి అనుకూలమైనవి. కొన్ని మొక్కలకు ఏర్పాటు చేసిన ప్లాంట్ బాక్స్ ని అవి పెద్దయ్యాక ఉంచాల్సిన అవసరం లేదు. అప్పుడు వాటిని వేరొక మొక్కకు ఉపయోగించేందుకు రౌండ్ షేప్ లో ఉన్నవేకాకుండా అర్ధచంద్రాకారంలో ఉన్న ప్లాంట్ బాక్స్ లను కూడా తయారు చేశారు. ఇవి ఒకమొక్క నుంచి ఇంకో మొక్కకు అమర్చడానికి ఈజీగా ఉంటాయి. రౌండ్ షేప్ బాక్స్ లో 15 లీటర్ల నీళ్లు పడతాయి. 25 రోజులు నీళ్లు పోయాల్సిన అవసరం ఉండదు. అర్ధచంద్రాకారంలో ఉన్న ప్లాంట్ బాక్స్ లో 10 లీటర్ల నీళ్లు పడతాయి. రెండు వారాల వరకు నీళ్లు పోయాల్సిన అవసరం రాదు..

Leave Your Comments

Sapota Health Benefits: సపోటా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..!

Previous article

కరివేపాకు ఆరోగ్య ప్రయోజనాలు ..

Next article

You may also like