Pests in Vegetables: వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రతలు, నీటిఎద్దడి, పురుగులు, తెగుళ్ల సమ స్యలు కూరగాయల సాగుకు అవరోధంగా ఉంటాయి. కాని వీటిని అధిగ మించి సాగు చేయగలిగితే మంచి లాభాలు పొందవచ్చు. సాధారణంగా ఖరీ ఫ్ లో సాగుచేసే కూరగాయ పంటలన్నీ వేసవిలో కూడా సాగు చేసుకోవచ్చు. వేసవిలో బెట్ట వాతావరణంలో రసంపీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉండి వైరస్ తెగుళ్లు అత్యధికంగా వ్యాప్తిచెంది పంటను నష్టపరుస్తాయి. సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించటం ద్వారా వైరస్ తెగుళ్ల వల్ల కలిగే కూర గాయ పంటల్లో మిరప, బెండ, టొమాటో, వంగ, పొట్ల, బీర, కాకర, దోస, అనప వంటి పందిరి కూరగాయలు ముఖ్యమైనవి.
బెండలో పల్లాకు తెగులు: శంఖు తెగులుగా పిలిచే తెగులు ఎల్లోవీన్ మొజాయిక్ వైరస్ ద్వారా ఆశించి, తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. తెగులు సోకిన మొక్కల ఆకుల ఈనెలు పసుపు రంగులోకిమారి, ఈనెల మధ్యభాగం ఆకుపచ్చగా ఉంటుంది. ఆకులు పసుపు, ఆకుపచ్చరంగులో కన్పిస్తాయి. తెగులు సోకిన మొక్కలు ఎదగక గిడసబార తాయి. కాయలు ఏర్పడవు. ఏర్పడినా తెల్లగా లేదా లేత పసుపురంగులోకి మారతాయి. వీటిని పాలబెండ అంటారు. ఇవి మార్కెట్కు పనికిరావు.
తెగులు పంటను తొలిదశలో అంటే పూతదశకు ముందు ఆశిస్తే నష్టం. అధికంగా ఉంటుంది. తెగులు తట్టుకోలేని రకాలు సాగుచేస్తే పోలిస్తే వేసవిలో సాగుచేసే పంటకు పల్లాకు తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది.
టొమాటోలో వైరస్ తెగుళ్ళు: టొమాటోను ఆశించు వైరస్ తెగుళ్ళలో టొమాటో మొజాయిక్ తెగులు, టొమాటో స్పాటెడ్విల్ట్ వైరస్ తెగులు, టొమాటో ఆకుముడత తెగులు ప్రధా నమైనవి.
టొమాటో మొజాయిక్ తెగులు: ఇది టొబాకో మొజాయిక్ వైరస్ ద్వారా ఆశి స్తుంది. పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. తెగులు సోకిన మొక్కల ఆకులమీద ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగు కలిసిన మొజాయిక్ లక్షణాలు కనిపిస్తాయి. ఆకులమీద బొబ్బలు ఏర్పడి ముడుచుకొని, చిన్నగామారి మొక్కలు గిడసబారి, పూత, కాత ఉండదు.
Also Read: Vegetables Weed Management: కూరగాయల పంటలలో కలుపు యాజమాన్యం.!
టొమాటో స్పాటెడ్విల్ట్ వైరస్: ఈ వైరస్ తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. తెగులు సోకిన మొక్కల చిగురు భాగం లేత ఆకుల మీద గోధుమరంగు మచ్చలు ఏర్పడి క్రమేణా ఎండిపోతాయి. కాండం, కాడలు, కొమ్మలమీద చారలు ఏర్పడతాయి. పండుకాయల మీద ఒక సెం.మీ. పరిమాణంలో పసుపుచ్చని వలయాలు ఏర్పడతాయి. మొక్కలు గిడసబారి. పూత, పిందె ఏర్పడవు.
టొమాటో ఆకుముడత వైరస్: ఇది తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. తెగులు సోకిన మొక్కల ఆకులు పైకి ముడుచుకొని, చిన్నగా మందంగా మారతాయి. ఆకుల అంచులు ఈనెల మధ్యభాగం పసుపురంగులోకి మార తాయి. కణుపుల మధ్యదూరం తగ్గి మొక్కలు గిడసబారుతాయి. పూత, కాత ఉండదు. పూత రాలిపోతుంది. కాయలు ఏర్పడినా గిడసబారతాయి.
వంగలో చిట్టి ఆకు/ వెర్రి తెగులు: పచ్చదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆకులు చిన్నగామారి కుచ్చులు కుచ్చులుగా ఏర్పడతాయి. వంగలో మొజాయిక్ తెగులు: పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. తెగులు సోకిన మొక్కల ఆకులపై మొజాయిక్ లక్షణాలు కనిపిస్తాయి.
పందిరి కూరగాయల్లో మొజాయిక్ వైరస్ తెగులు: పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. తెగులు సోకిన మొక్కల లేత ఆకులమీద ఆకుపచ్చ, లేత పసుపుపచ్చ రంగుతో మొజాయిక్ లక్షణాలు కనిపిస్తాయి. చిన్న మొక్కలైతే మొక్కలు తొలిదశలో చనిపోతాయి. మిరపలో ఆకుముడత వైరస్: బొబ్బర తెగులుగా పిలిచే ఇది తెల్లదోమద్వారా వ్యాప్తి చెందుతుంది. ఆకులమీద బొబ్బలుగా ఏర్పడి పైకి ముడుచుకొని డొప్పలుగా మారతాయి. మొక్కల ఎదుగుదల తగ్గి గిడసబారతాయి. మొక్కలు సూక్ష్మపోషక లోపలక్షణాల్లాగా కన్పిస్తాయి.
మిరపలో కుకుంబర్ మొజాయిక్ వైరస్ తెగులు: బంతి ఆకు తెగులుగా పిలిచే ఇది పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. తెగులు సోకిన ఆకులు ఆకారం కోల్పోయి కొనలు పొడవుగా సాగుతాయి. పచ్చదనం కోల్పోయి మొజాయిక్ లక్షణాలు కనిపిస్తాయి. మొక్కలు గిడసబారతాయి.
మిరపలో మొవ్వుకుళ్ళు తెగులు: తామరపురుగుల ద్వారా వ్యాప్తి చెందు తుంది. వైరస్ సోకిన మొవ్వు లేదా చిగురుభాగం ఎండిపోతుంది. కాండం మీద నల్లటి మచ్చలు, చారలు ఏర్పడతాయి. ఆకులు పండుబారి రాలిపో తాయి. వేరువ్యవస్థ సరిగా వృద్ధిచెందడు.
Also Read: Broccoli Cultivation: బ్రకోలి సాగు లో మెళుకువలు.!
Also Watch: