Hydrophonics System: పంట తర్వాత రైతును ఆదుకునేది పాడి. పేద కుటుంబా లకు పాడిపై వచ్చే రాబడే కొండంత అండ. అయితే గ్రాసం కొరత, పెరిగిన దాణా ఖర్చులతో పాడి ఏమంత లాభదాయకంగా లేదు. ముఖ్యంగా గ్రామాల్లో పశుగ్రాసం కొరత తీవ్రమై పోషకులు ఇబ్బంది పడుతు న్నారు. కాగా ఈ గడ్డి కొరతకి పరిష్కారం చూపే సరికొత్త విధానం ఇటీవల అందుబాటులోకి వచ్చింది. అదే హైడ్రోఫోనిక్స్ దీనినే మొలకల గడ్డి పెంపకం అని కూడా అంటారు. మట్టి, నీరు, ఎరువులు, కరెంట్, కూలీలు, పురుగుమందులతో పనిలేకుండా ఇళ్ల వద్దే కొద్దిపాటి ఖాళీ స్థలంలో పెంచే ఈ పద్ధతి పాడి రైతులను ఆకట్టుకుంటోంది. సొంతంగాను, పశుసంవర్ధకశాఖ సహకారంతో యూనిట్లు ఏర్పాటు చేసుకుంటున్న రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు.
హైడ్రోఫోనిక్స్ : రెండో ప్రపంచ యుద్ధకాలంలో గుర్రాలు, సైనికులకు ఆహారం అందించడం కోసం చేసిన హైడ్రోఫోనిక్స్ ప్రయోగం అనంతరం నగరాల్లో ఇంటి సేద్యంగా మారింది. విదేశాల్లో దశాబ్దాలుగా కూరగాయలు, ఆకుకూరల సాగులో ఈ విధానం అమలులో ఉంది. 1982లో మన దేశానికి పరిచయమైంది. దీనికోసం అప్పట్లో పొమేటా డివైజ్ అనే పరికరాన్ని దిగుమతి చేసుకున్నారు. అయితే మన వాతావరణానికి అది సరిపోక విఫలమైంది. ప్రస్తుతం దీని రూపు నిర్మాం ఇతీరు మారింది. విదేశాల్లో ఏసీతో పనిచేసే విధంగా రూపకల్పన చేయగా భారత్లో మాత్రం ఏసితో సంబంధం లేకుండా తయారుచేస్తున్నారు. కూరగాయలకంటే పశువులకు ఉపయోగించే గడ్డికో సమే దీనిని ఎక్కువగా మన వద్ద వాడుతున్నారు. ఇందులో పెంచిన మొలకల గడ్డిని పచ్చగడ్డికి ప్రత్యామ్నాయంగా విని యోగిస్తున్నారు.
కొరతకు పరిష్కారం: పశు పోషణకు పచ్చిమేతే కీలకం. పచ్చగడ్డి వేయనిదే కనీస పాల దిగు బడి రాదు. పశుగ్రాసం పెంపకానికి విత్తనాలు, భూమి, నీరు, కూలీలు… ప్రధాన వనరులు. అయితే చిన్న, సన్నకారు రైతులు మొదలు కౌలు రైతుల వరకు అందరికీ భూమి అందుబాటులో ఉండదు. ఒకవేళ భూమి ఉన్నా ఉన్న కొద్ది పొలాన్ని గ్రాసానికే కేటాయించలేని పరిస్థితి. కరవు, వర్షాభావ పరిస్థితులు, అడుగంటిన భూగర్భ జలాల కారణంగా నీటి సమస్య తీవ్ర మైంది. ఫలితంగా పచ్చగడ్డికోసం రైతులు నానా తిప్పలు పడాల్సి వస్తోంది. ఒక్కోసారి ఎండుగడ్డికి కూడా కష్టాలు తప్పడంలేదు. గ్రాసం కొరతతోనే పశువులను మేపలేక. సంతల్లో విక్రయించాల్సిన పరిస్థితులు నిత్యకృత్యమయ్యాయి. భూమి, నీరు ఒక ఎత్తైతే… కూలీల లభ్యత మరో ఎత్తు. గ్రాసం సాగు నుంచి పెరిగిన గడ్డిని కోయడం వరకు… ప్రతిదశలోనూ కూలీల అవ సురం ఉంటుంది. సమయానికి కూలీలు దొరకకపోవడమే కాకుండా, కూలీల ధర అధికంగా ఉండటం వల్ల గ్రాసం పెంపకం భారమవుతోంది. పైగా అదుపులేకుండా పెరిగిపోతున్న దాణా ఖర్చులతో పశుపోషణ గిట్టుబాటుకావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ ఖర్చులో, తేలికగా, నాణ్యమైన గడ్డి పెంచే మార్గంగా మొలకలగడ్డ ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read: Soil Organic Matter: నేలలో సేంద్రియ పదార్ధం పెరగాలంటే అపరాల సాగు తప్పనిసరి.!
షెడ్ల నిర్మాణం: మొలకల గడ్డి పెంచడానికి కావాల్సిన షెడ్లను శాశ్వత లేదా తాత్కాలిక ప్రాతిపదికన నిర్మించుకోవచ్చు. నిర్మాణం ఏదైనా గ్రీన్నెట్ మాత్రం తప్పని పరి నాణ్యమైన అధిక మొత్తంలో గ్రాసం ఉత్పత్తి కావాలంటే నియంత్రిత వాతావరణం ఎంతో అవసరం. ఇందుకోసం పూర్తిగా మూసివేసి ఉంచే షెడ్లు నిర్మించుకోవాలి. తుప్పుపట్టని ఇనుప కమ్మలతో తయారు చేసుకోవడం ఉత్తమం. గది లోపల ట్రేలని పెట్టడానికి వీలుగా ఇనుప రాకులు ఏర్పాటు చేసుకుంటే ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది. ఖర్చు తగ్గించుకోవడానికి గది నిర్మాణం, లోపలి అరల కోసం వెదురు బొంగులు లేదా కర్రలు ఉపయోగించుకోవచ్చు. అయితే కథల ఆధారంగా నిర్మించిన షెడ్లలో పెంచే గడ్డికి తెగుళ్ళు, బాక్టీరియా సమస్యలు తలెత్తి పశు వులు మృత్యువాత పడిన ఘటనలు వెలుగు చూశాయి. ఈ సమస్య లేకుండా ఇనుప కమ్మెలు, ర్యాకులు వాడటమే మంచిది.
ఇక ట్రేలలో విత్తనాలు వేసిన తర్వాత క్రమబద్ధ ఉష్ణోగ్రత, తేమకోసం విడతలవారీగా నీరు చిలకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం చిన్నపాటి షవర్లు, వినియోగించవచ్చు. ఇలా కాకుండా సమయం నిర్దేశిస్తే… వాటంతటవే నిర్ణీత వేళల్లో నీరు చిలకరించే స్వయంచాలిత నియంత్రణ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. దీని ఏర్పాటుకు మోటారు, ట్యాంకు, టైమర్, డ్రిప్ కోసం వాడే లేటరల్ పైపులు, మైక్రో స్ప్రింక్లర్లు అవసరమవుతాయి. గది వాతావరణం క్రమబద్ధం చేసే విధంగా సమయం నిర్దేశిస్తే దానంతటదే మోటార్ ఆన్ బుల్లి తుంపరల ద్వారా నీరు జల్లులుగా కురిపిస్తుంది. ఇలా ఏడు రోజులు చేసిన తర్వాత ట్రేలలో గడ్డి చేతికి వస్తుంది. రెండు పశువులకు సాధారణంగా ఐదు అడుగుల పొడవు, ఐదు అడుగుల వెడల్పు, ఆరున్నర అడుగుల ఎత్తు కలిగిన షెడ్ సరిపోతుంది. ఎన్ని పశువులకు మేత అందించాలో దానికి అనుగుణంగా షెడ్ నిర్మించుకోవాల్సి ఉంటుంది. పశువుల సంఖ్యను బట్టి ట్రేలు, ప్యానెళ్లను ఏర్పాటు చేసుకో చాలి. ఈ పనంతా చూసుకోవడానికి ప్రత్యేకంగా కూలీలు అవసరం లేదు. ఒక వ్యక్తి రోజుకు పావుగంట పనిచేస్తే సరిపోతుంది. రెండు పశువులకు సరిపోయే గడ్డి పెంచడానికి అవసర మయ్యే ఆటోమేటెడ్ నిర్మాణానికి 30 వేలు ఖర్చు అవుతుంది.
Also Read: Status of Indian Organic agriculture 2021-22: సేంద్రియం వైపు భారత్ మొగ్గు
Also Watch: