Fish Health: ప్రతిరైతు చేపల పెంపకంలో మంచి దిగుబడిని సాధించి అధిక లాభాలను పొందాలని ఆశిస్తాడు. కాని కొన్ని కారణాల వల్ల ఒక్కోసారి సాధ్యంకాకపోవచ్చు. చేపల పెంపకంలో అధిక దిగుబడి పొందాలంటే చేపలు సక్రమంగా, ఆరోగ్య వంతంగా పెరగడం ఎంతైనా అవసరం. లేకుంటే పెరుగుదల మందగించి ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. కావున రైతులు దీనిని తగిన శ్రద్ధతో, జాగ్ర త్తగా గమనిస్తూ ఉండాలి.
చేపల్లో పెరుగుదల మందగించడానికి మూడు కారణాలున్నాయి
1. ఆహారపు కొరత:
చేపల పెరుగుదల చెరువు లేదా కుంటలో లభించే ఆహార పరిమాణంపై ప్రత్యక్షంగా ఆధారపడి ఉంటుంది. చెరువులో ఎల్లప్పుడూ చేపలకు అవసర మైన ఆహారం, పోషకాలు లభిస్తూ ఉండాలి. లేకుంటే పెరుగుదల మంద ంచి దిగుబడి తగ్గుతుంది. కావున రైతులు చేపల పెంపకంలో ఆహారపు కొరత లేకుండా చూసుకోవాలి.
కారణాలు: చెరువు లేదా కుంట సారవంతంగా లేకపోవడం, ఆహారం సక్ర మంగా అందకపోవడం, చేపల సాంద్రత అధికంగా ఉండటం వంటివి ఆహార కొరతకు ప్రధాన కారణాలు.
గుర్తించడం: ఆహారపు కొరత ఉన్న చేపలను తేలికగా గుర్తించవచ్చు. వీటిలో పెరుగుదల సక్రమంగా ఉండదు. అంటే ఇవి అసాధారణంగా కనిపి స్తాయి. వీటి తలభాగం లావుగా తోకభాగం అతి సన్నగా తయారవుతుంది. నివారణ: చెరువులో సహజసిద్ధంగా లభ్యమయ్యే వృక్ష ప్లవకాలు, జంతుప్లవ కాలు, నీటి పురుగులు, కీటకాలు, కీటక లార్వాలు, శైవలాలు, చిన్న చిన్న నీటి మొక్కలు, గడ్డి వగైరా చేపలకు ఆహారంగా ఉపయోగపడుతాయి. ఈ సహజ ఆహారం చేపలకు అన్ని విధాల మంచిది. కావున రైతులు చెరువులో తగిన సేంద్రియ, రసాయనిక ఎరువులను వాడుతూ, సక్రమమైన యాజమాన్య పద్ధ తులను పాటిస్తూ ఈ సహజ ఆహారాన్ని ఎల్లప్పుడూ సమృద్ధిగా లభించేలా చూడాలి.
చెరువులో సహజ ఆహారం సమృద్ధిగా లభించనప్పుడు అనుబంధ లేదా – కృత్రిమ ఆహారాన్ని అందజేయాల్సి ఉంటుంది. కాబట్టి రైతులు తమకు అందుబాటులో ఉన్న పరితవుడు, వేరుసెనగ చెక్క ఆవగింజల చెక్క ఫిష్ మీల్, కార్న్ మీల్, సోయాబీన్ చెక్క పత్తి గింజల చెక్క పట్టుపురుగు ప్యూపాలు, ఖనిజలవణాల మిశ్రమాన్ని తగిన పాళ్ళలో కలిపి చేపలకు అను బంధ ఆహారంగా ఇవ్వవచ్చు. ఈ అనుబంధ ఆహారాన్ని చేపల శరీరబరు వులో 2 నుంచి 6 శాతం వరకు ఇవ్వాలి..
2. ఆక్సిజన్ లేమి
ఆక్సిజన్ సమస్త జీవులకు జీవనాధారం. చేపల జీవన చర్యలకు కూడా ఆక్సీ పు జన్ ఆహారంను చురుకుగా తీసుకుంటాయి. ఎంతో ముఖ్యం చెరువులో ఆక్సి జన్ సమృద్ధిగా ఉన్నప్పుడు చేపలు చలాకిగా తిరుగుతూ చెరువులో ఆక్సీ జన్ లభ్యత తగ్గితే చేపల్లో చురుకుతనం సన్నగిల్లుతుంది. ఇలాంటి పరిస్థి తిలో చేపలు ఆహారాన్ని కూడా సరిగా తీసుకోవు. ఈ పరిస్థితి ఇలాగే కొన సాగితే పెరుగుదల మందగిస్తుంది. ఆక్సిజన్ లభ్యత తగ్గితే చేపలు అధిమొ తంలో మరణించే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి రైతులు దీనిని కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.
Also Read: Techniques in Fishing: చేపలు పట్టడం లో మెళుకువలు..!
కారణాలు: అధిక చేపల సాంద్రత, ఆక్సిజన్ వినియోగం అధికంగా ఉండటం. ఉత్పత్తి తగ్గటం, నీటి మట్టం తగ్గటం ఆల్గల్ బ్లూమ్స్ అభివృద్ధి చెందడం, వ్యర్థపదార్థాల స్థాయి పెరగటం, వాతావరణం మబ్బుగా ఉండటం వంటివి. ఆక్సిజన్ కొరతకు ప్రధాన కారణాలు.
గుర్తించడం: చెరువులో ఆక్సిజన్ లేమినికూడా రైతులు తేలికగా గుర్తించ వచ్చు. నీటిలో ఆక్సిజన్ స్థాయి బాగా తగ్గినప్పుడు చేపలు ఆక్సిజన్ కోసం నీటి ఉపరితలంపై ఎక్కువగా తిరుగాడుతూ నోటిని తెరచి ఉంచుతాయి ఈ స్థితిని సూర్యోదయానికి ముందు స్పష్టంగా చూడవచ్చు. ఒక్కోసారి చేపలు నీటిపై ఎగిరి ఎగిరి పడతాయి. చివరకు గుంపులు, గుంపులుగా తిరుగుతూ చలాకితనం కోల్పోతాయి. మెల్లగా, నీరసంగా చెరువు గట్ల అంచుల వద్ద తిరు గుతూ వెల్లకిలా పడిపోతుంటాయి.
నివారణ: చేపల సక్రమ పెరుగుదలకు నీటిలో ఆక్సిజన్ స్థాయి 5 పిపియం కంటే ఎక్కువగా ఉండటం ఎంతో మంచిది. 4 పిపియం కంటే తగ్గితే ఒత్తి డికి లోనవుతాయి. కాబట్టి రైతులు ఆక్సిజన్ లేమిని జాగ్రత్తగా గమనించి తగిన నివారణ చర్యలను తీసుకోవటం ఎంతైనా అవసరం.
చెరువులో ఆక్సిజన్ లేమి ఏర్పడినప్పుడు నీటిలో అధికంగా ఉన్న నీటి మొక్కలను నాచు మొక్కలను మనుషుల సహాయంతో తొలగించాలి. అలాగే పొడవాటి కర్రలను తీసుకొని చెరువులోని నీటిని కలపడంగాని, నీటిని కొట్ట డంగాని చేస్తే వాతావరణంలోని ఆక్సిజన్ నీటిలో కరుగుతుంది. వీలుంటే నీటి మార్పిడి చేయడం చాలా ఉత్తమమైన పద్ధతి. ఏరేటర్లను చెరువులో అక్కడక్కడ అమర్చి నీటిలో ఆక్సిజన్ లేమిని సకాలంలో గుర్తించి తగిన నివా రణ చర్యలను చేపడితే చేపల పెరుగుదలను కాపాడుకోవచ్చు.
Also Read: Fish Health Benefits: చేపల తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
Also Watch:
Must Watch: