వార్తలు

భూసార పరీక్ష సంచార వాహనాన్ని ప్రారంభించిన రాయగడ జిల్లాపరిషత్ అధ్యక్షుడు గంగాధర్..

0

నేల తల్లిని నమ్ముకొని, వ్యవసాయమే జీవనాధారంగా శ్రమిస్తున్న రైతులు భూసారాన్ని తెలుసుకోవాలని రాయగడ జిల్లా పరిషత్ అధ్యక్షుడు గంగాధర్ పువ్వల అన్నారు. ఏ మట్టిలో ఎలాంటి పోషకాలుంటాయి, ఏ పంటలు వేస్తె లాభాలు వస్తాయో గ్రహించి ఫలవంతమైన దిగుబడి సాధించాలని రైతులకు సూచించారు. గురువారం జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం భూసార పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ మారుమూల ప్రాంత రైతన్నలు అవగాహన లోపంతో భూసార పరీక్ష చేసుకోవడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో రాష్ట్రంలో పరాదీప్ పాస్పాట్ స్ లిమిటెడ్ పరిశ్రమ సంచార వాహనాలు అధునాతన యంత్రాలను సమకూర్చడం అభినందనీయమన్నారు. జిల్లా వ్యవసాయా శాఖ ముఖ్య వ్యవసాయ అధికారి డి.ప్రవరాజ్ మాట్లాడుతూ జిల్లాలో 11 సమితుల్లోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ వాహనం పర్యటిస్తుందని, గ్రామ సేవకులు, రైతు సాధీలు సహకారంతో మట్టి నమూనాలను పరిశీలించి సాయిల్ హెల్త్ కార్డులు అందిస్తామన్నారు. రైతులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా భూసార పరీక్షా కేంద్రం అధికారి ఎస్.కె.ఘోష్ మార్కెటింగ్ మేనేజర్ దుశ్శాసన మహారాణ మాట్లాడుతూ ఏడాదిలో 5000 మట్టి నమూనాలు గ్రామాల్లో సేకరించి పరిశీలిస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలకు వాహనాలు సమకూర్చామన్నారు. ఇప్పుడు కొత్తగా రాయగడ, గజపతి, ఫుల్బాణీ , గంజాం జిల్లాలకు అందించామన్నారు. అనంతరం వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. తొలుత మీరాబెల్లి పంచాయతీ కి వాహనం బయల్దేరింది.

Leave Your Comments

చెరకు నర్సరీ సాగులో విజయం సాధించిన స్నేహితులు..

Previous article

గంపెడాశలు పెట్టుకున్న రెండో పంట వరి..

Next article

You may also like