కాసిపేట మండలం, ధర్మారావుపేట రైతువేదిక సమావేశ హాల్ లో రైతులకు వ్యవసాయ పద్ధతుల పై ఏఈఓ తిరుపతి అవగాహన కల్పించారు. మోతాదుకు మించి ఎరువులను వాడరాదని, సేంద్రియ వ్యవసాయం మేలు అని పేర్కొన్నారు. అటవీ జంతువుల వల్ల పంట నష్టం జరిగితే సంబంధిత సర్పంచులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. నకిలీ గ్లైసిల్ పత్తి విత్తన్నాలను రైతులు వాడవద్దని, దాని ద్వారా ఆర్థిక నష్టం,పంటనష్టం, భూసార నష్టం వాటివల్లుతుందని, ఈ విత్తనాలు ఎవరు వాడినా చట్టపరమైన చర్యలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజులరెడ్డి, రైతులు పాల్గొన్నారు.
Leave Your Comments