ఆరోగ్యం / జీవన విధానం

Benefits of Eating Mustard Seeds: ఆవాలు తినడం వల్ల ప్రయోజనాలు.!

1
Benefits of Eating Mustard Seeds
Benefits of Eating Mustard Seeds

Benefits of eating mustard seeds: ఆవాలను ఆయుర్వేదంలో ఔష‌ధంగా కూడా ఉప‌యోగిస్తున్నారు.ఇవి మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో శరీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్లు, పీచు ప‌దార్థాలు కూడా ఉంటాయి. శ‌రీరంలో కొవ్వు పేరుకోకుండా చేయ‌డంలో ఇవి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఆవాల‌లో ఉండే సెలీనియం శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శక్తిని పెంచడంలో స‌హాయ‌ప‌డుతుంది. ఊపిరితిత్తుల స‌మ‌స్య‌ల‌ను, వాపుల‌ను త‌గ్గిస్తుంది. వీటిని వంటల్లో వాడ‌డం వ‌ల్ల తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వ్వ‌డ‌మే కాకుండా ఆక‌లి కూడా పెరుగుతుంది.

ఆవాల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్త ప్ర‌స‌ర‌ణ వ్యవస్థ చురుకుగా సాగుతుంది. ఆవాల‌ను దంచి వాపులు, నొప్పులు ఉన్న చోట ప‌ట్టు వేస్తే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.మ‌నం అనేక వ్యాధులను న‌యం చేసుకోవ‌చ్చు. ఇక ఆవాల‌లో మెగ్నిషియం, మాంగనీస్‌, కాల్షియం, జింక్ వంటి మిన‌ర‌ల్స్ తోపాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఉంటాయి. వీటిలో శరీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ప్రోటీన్లు, పీచు ప‌దార్థాలు కూడా ఉంటాయి.

 

Benefits of Eating Mustard Seeds

Benefits of Eating Mustard Seeds

గొంతు నొప్పి, ద‌గ్గు, జ‌లుబు వంటి వాటితో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు మరుగుతున్నా నీటిలో ఆవాల పొడిని వేసి గోరు వెచ్చ‌గా చేసి తాగ‌డం వ‌ల్ల ఆయా స‌మ‌స్యల నుండి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఆవాల‌లో ఉండే సెలీనియం శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శక్తిని పెంచడంలో స‌హాయ‌ప‌డుతుంది.ఆవాల పిండిని తేనెతో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల శ్వాస‌కోస సంబంధ‌మైన స‌మ‌స్య‌లు త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.అదే విధంగా కొబ్బ‌రి నూనెలో ఆవ‌నూనెను క‌లిపి జుట్టుకు రాసుకోవ‌డం వ‌ల్ల మంచిఫ‌లితం ఉంటుంది. దంతాల‌ నొప్పి క‌లిగిన‌ప్పుడు వేడి నీటిలో ఆవాల‌ను వేసి కొద్ది సేపు ఉంచి ఆ నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించ‌డం వ‌ల్ల దంతాల‌ నొప్పి త‌గ్గుతుంది. ఉబ్బ‌సం వ్యాధి ఉన్న వారు ఆవాల‌ను చ‌క్కెర‌తో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

ఆవాల నూనెను జుట్టుకు రాసుకోవ‌డం వ‌ల్ల పేలు త‌గ్గుతాయి. ఆవాల నూనెను వాడ‌డం వ‌ల్ల మాడు మీద కురు పులు త‌గ్గుతాయిమందంగా ఉన్న పులిపిర్ల మీద ఆవాల‌ను నూరి రాస్తూ ఉండ‌డం వ‌ల్ల పులిపిర్లు రాలి పోతాయి. ఆవాల‌ను నూరి ఆ మిశ్రమానికి క‌ర్పూరాన్ని క‌లిపి పై పూత‌గా రాయ‌డం వ‌ల్ల కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. ఇన్ని ఉప‌యోగాలు ఉన్న‌ప్ప‌టికీ వీటిని అల్స‌ర్లు, మూత్ర పిండాల స‌మ‌స్య‌లునివారణ చేయవచ్చు. తెల్ల ఆవ నూనెను చ‌ర్మానికి ప‌ట్టించి న‌లుగు పెట్టి స్నానం చేస్తే చ‌ర్మం కాంతివంతంగా త‌యార‌వుతుంది.వీటిని అధిక మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల పైత్యాన్ని క‌లుగ‌జేస్తాయి. క‌డుపులో మంట, చ‌ర్మ సంబంధమైన స‌మ‌స్య‌లు ఉన్న వారు వీటిని తాళింపులో వాడ‌క‌పోవ‌డ‌మే మంచిది. ముఖ్యంగా వేడి శ‌రీరం ఉన్న వారు వీటిని ప‌రిమిత మోతాదులోనే తీసుకోవాలి.

  

Nutrients of Mustard seeds

Nutrients of Mustard seeds

Also Read:Mustard Oil Health Benefits: ఆవనూనె యొక్క ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే.!

Must Watch:

Leave Your Comments

Banana Panama Disease: అరటి పనామా తెగులు – నివారణ పద్ధతులు.!

Previous article

Fiber Plants: ఎత్తు నారు మళ్ళపై యాజమాన్య పద్ధతులు.!

Next article

You may also like