ఉద్యానశోభ

Rose Plant Protection: గులాబీలో కత్తిరింపులు మరియు సస్య రక్షణ.!

0
Rose Plant Pruning
Rose Plant Pruning

Rose Plant Protection – కత్తిరింపులు: గులాబీ పూలు కొత్త చిగుర్ల పై వస్తాయి. కావున కొమ్మ కత్తిరింపులు తప్పనిసరిగా చేయాలి. మొక్క సైజును అదుపులో ఉంచి మంచి ఆకారం సంతరించుకొని మొక్కకు అవసరమైన గాలి వెలుతురు ప్రసరించడానికి కత్తిరింపులు చేయాలి. సంవత్సరానికి ఒకసారి అనగా వర్ష కాలం అయిపోయిన తర్వాత అక్టోబర్ – నవంబర్ మాసలలో కొమ్మ కత్తిరింపులు అనుకూలం.హైబ్రిడ్ టి రకాలు మనం కోరుకునే పూత సమయానికి 45 రోజుల ముందుగానే పోర్లిబండ రకాలను 42 రోజుల ముందు కత్తిరించాలి.

చనిపోయిన, ఎండిపోయిన కొమ్మలు అన్నిటిని కత్తిరించాలి.

తెగులు లేదా పురుగులు ఆశించిన కొమ్మలను కత్తిరించాలి.

బలహీనంగా ఉన్న కొమ్మలను,రెమ్మలన్నిటినీ కత్తిరించాలి.

రూట్ స్టాక్ మీద వచ్చే జిగురును,కొమ్మలను కనిపించిన వెంటనే కత్తిరించాలి.

ఆరోగ్యంగా, బలంగా ఉన్న కొమ్మలపై తగినంత వెలుపల ఉన్న మొగ్గకు సుమారు 5 మీ. మీ పైన పదునైనా కత్తెరతో కత్తిరించాలి.

గులాబీ పొద మధ్య భాగం ఖాళీగా ఉండేలా కత్తిరింపులు చేస్తే అన్ని కొమ్మలకు గాలి, వెలుతురు,ప్రసరించి పెద్ద సైజు పూలు ఏర్పడతాయి.

హైబ్రిడ్ రకాలలో పసుపు పచ్చని మిశ్రమ రంగు గల రకాలను సగము లేదా భాగాల కొమ్మలను కత్తిరించాలి.

పోర్లి బండ మొక్కలను ¼ వంతు మొక్కను మాత్రమే కత్తిరించాలి.

కత్తిరించిన అన్ని భాగాలకు విధిగా బోర్డు పేస్ట్ రాయాలి.దీని వలన శీలింద్ర బీజలకు ప్రవేశం ఉండదు.

Also Read: Rose Harvesting: రైతులు గులాబీ కోత సమయం లో తీస్కోవాల్సిన జాగ్రత్తలు

Rose Plant Protection

Rose Plant Protection

సస్య రక్షణ

పెంకు పురుగులు: రాత్రి పూట ఆకులను వంకర టింకరగా కొరికి తినివేస్తాయి.నివారణకు మలాథియాన్ 5% పోడిని 15 కిలోలు సాయంత్రం సమయంలో వేయాలి.

పేను: ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నచో ఆకుల కొనలు మరియు మొగ్గ నల్లగా మారుతాయి. నివారణకు డైమీథోయేట్ 2మీ. లి లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మీ. లీ లీటర్ నీటికి పిచికారీ చేయాలి.

ఎర్రనల్లి: వాతావరణం వేడిగా ఉన్న రోజుల్లో ఉధృతి ఎక్కువగా ఉంటుంది..దీనివలన మొత్తం ఆకులు రాలిపోతాయి.నివారణకు 3 గ్రా. నీటిలో గంధకం లేదా డైకోఫాల్ 5 మీ. లీ.లీటర్ నీటికి పిచికారీ చేయాలి.

బూడిద తెగులు: ఆకులపై బూడిద వంటి తెల్లటి పదార్ధం ఏర్పడి ఆకులు ముడుచుకు పోతాయి.లేత కొమ్మల నిండా బూడిద సోకి ఎండిపోతాయి.పూల రేకులు రంగు మరి వాడాలి ఎండిపోతాయి.నివారణకు డైనోకాప్1 మీ. లీ లేదా కార్బడిజం0.1 మీ. లీ. లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.

నల్ల మచ్చలు: గుండ్రటి నల్లని మచ్చలు ఆకు రెండు వైపులా వ్యాపించడం వల్ల ఆకులు రాలిపోతాయి.వర్ష కాలంలో ఈ తెగులు ఎక్కువగా వస్తుంది. నివారణకు కెప్టెన్ 3 గ్రా లేదా మాంకొజెబ్ 2 గ్రా.లేదా కార్బడిజం 1 గ్రా. లీటర్ నీటికి కలిపి ఈ తెగులును అరికట్టవచ్చు.

ఎండు రోగం: మొక్క పై భాగం నుండి కింది వరకు ఎండి పోతుంది.ఈ తెగులు ముందుగా కత్తిరించిన కొమ్మ నుండి మొదలవుతుంది. తెగులు సోకిన కొమ్మలు నలుపు రంగుకు మారతాయి.కాండం వేర్లు గోధుమ రంగుకు మారిపోతాయి. నివారణకు ప్రూనింగ్ కొమ్మలకు వెంటనే రాగు ధాతు సంబంధమైన మందును పేస్ట్ ల చేసి కత్తిరించిన ప్రదేశాల్లో పూయాలి. లేదా పచ్చి పేడ మరియు మట్టి కలిపిన పేస్ట్ పూసి కూడా ఈ తెగులును నివారించవచ్చు.

Also Read: Rose Farming: మీ ఇంటి తోటలో గులాబీలను పెంచడానికి ఉత్తమ మార్గం

Leave Your Comments

Citrus Canker Disease: నిమ్మలో గజ్జి తెగులు.!

Previous article

Pests of Mulberry Plants: మల్బరీని ఆశించే పురుగులు – నివారణ

Next article

You may also like