ఆరోగ్యం / జీవన విధానం

Gongura Leaves Health Benefits: వారంలో గోంగూరను ఒకసారి అయినా ఆహారంలో తినాలి.. ఎందుకో తెలుసా.!

0
Gongura Leaves Benefits
Gongura Leaves Benefits

Gongura Leaves Health Benefits: గోంగూర అంటే తెలియని వాలంటూ ఉండరేమో..! గోంగూర ఆహారంగానే కాకుండా ఔషధంల కూడా పనిచేస్తుంది. గోంగూరలో విటమిన్ ఏ,బి 1, బి 2, బి 9,విటమిన్ సి తో పాటు పోటాషియం, క్యాల్షియం, ఫాస్పరస్, సోడియం మరియు ఐరన్ వంటి ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు మరియు మరెన్నో పోషక పదార్ధాలు ఉన్నాయి.గోంగూర నుండి విటమిన్ ఎ సమృద్ధిగా లభిస్తుంది.

గోంగూర ను తరచుగా ఆహారంలో తీసుకోవడం వల్ల కంటికి సంబంధించిన సమస్యలను దూరం చేసుకోవచ్చు.ఇది మన కంటి చూపును మెరుగు పరచడమే కాక రేచీకటి కూడా తగ్గిస్తుంది.గోంగూర లో పోటాషియం అధికంగా ఉంటుంది.ఇది శరీరంలో రక్త సఫరా వ్యవస్థను క్రమ బద్ధం చేస్తుంది.గుండె లాంటి అవయువాలు రక్త సరఫరా బాగా జరిగేలా చేసి, గుండె పోటు మరియు అధిక రక్త పోటు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

గోంగూర మధుమేహ వ్యాధిగ్రాస్తుల పాలిట సంజీవని అని చెప్పవచు.ఇది రక్తంలో చక్కెర నిల్వల స్థాయిని తగ్గిస్తుంది.అంతే కాకుండా శరీరంలో ఇన్సులెన్ స్థాయిలను పెంచుతుంది.అందువల్ల మధుమేహం తో బాధ పడే వారు తరచుగా గోంగూర ను ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది.

Also Read: Health Benefits of Roselle: గోంగూరలో ఆరోగ్య ప్రయోజనాలెన్నో

Gongura Leaves Health Benefits

Gongura Leaves Health Benefits

గోంగూర శరీరంలో చెడు కోలేస్ట్రాల్ ను తగ్గిస్తుంది.అధిక బరువు సమస్యలను నివారిస్తుంది.ఇందులో ఉండే పీచు పదార్ధం తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం అయ్యేలా చేసి మాలబద్దకం మరియు ఊబకాయ సమస్యలను తగ్గిస్తుంది.గోంగూర శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది.

గోంగూర ఆకులను మెత్తగా పేస్ట్ ల చేసి తలకు పట్టించడం ద్వారా జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చు.అలాగే గోంగూర లో ఉండే సుగుణాలు బట్ట తలను తగ్గిస్తాయి.గోంగూర లో క్యాల్షియం సమృద్ధి గా ఉంటుంది.ఇందులో ఉండే విటమిన్ సి మరియు బి దంతాలను ఆరోగ్యంగా ఉంటాయి. అంతే కాకుండా శరీరం పై గడ్డలు తగ్గడానికి నూరి కట్టుగా కడితే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు దగ్గు, ఆయాసం,తుమ్ములు వంటి సమస్యలు తగ్గిస్తాయి.అలాగే నిద్ర లేమి సమస్య కూడా తగ్గిస్తుంది.

Also Read: Carrot Juice Health Benefits: రోజుకి ఒక గ్లాస్ ఈ జ్యూస్ తాగితే మంచి ఆరోగ్యం మీ సొంతం.!

Leave Your Comments

Irrigation Water Management: సాగు నీటి యాజమాన్యము.!

Previous article

Sorghum Disease Management: జొన్న పంటలో ఎర్గాట్ తెగులును మరియు కుంకుమ తెగులును ఎలా గుర్తించాలి?

Next article

You may also like