Grapes Hormonal Control – వేసవి కత్తిరింపుల తరువాత: ద్రాక్ష కొమ్మల పెరుగుదల అవడానికి సహాయపడే సైకోసిల్’ (సిసిసి) అనే హార్మోనును వేసవి కత్తిరింపుల తరువాత 5 ఆకుల దశలో 5000 పిపియమ్, 12 ఆకుల దశలో 500-700 పిపియమ్ మరియు 15 ఆకుల దశలో 500-1000 పిపియమ్ పిచికారీ చేయాలి.మట్టుతో కూడిన వాతావరణం ఉన్నట్లయితే పూమొగ్గల అంకురార్పణ జరగడానికి వేసవి కత్తిరింపులు అయిన 40వ రోజున, అలాగే 50వ రోజున ‘6 బిఎ’ అనే హార్మోనును 10 పిపియమ్, 45 రోజున యురాసిల్ 50 పిపియమ్ పిచికారీ చేయాలి.
శీతాకాలం కత్తిరింపుల తరువాత: ఈ కత్తిరింపులు అయిన రెండు రోజులలోపు మొగ్గ చిగురించడానికి హైడ్రోజన్ సైనమెటు 30-40 మి.లీ. /లీ. కలిపి చివరి 2, 3 కణుపులపై రాయాలి.ద్రాక్ష గుత్తులు పొడవుగా సాగడానికి ‘జిబ్బర్లిక్ యాసిడ్’ (జిఎ) పూ మొగ్గలు చిలకపచ్చ రంగులో ఉన్నప్పుడు 10 పిపియమ్, ఆ తరువాత 5 రోజులకు 15 పిపియమ్ పిచికారి చేయాలి. 50% పూ మొగ్గలు విచ్చుకొన్న దశలో 40 పీపీయం జివి ముంచినట్లయితే గుత్తులు వదులుగా వస్తాయి.
Also Read: Powdery Mildew in Mango and Grapes: మామిడి మరియు ద్రాక్ష తోటలో వచ్చే బూడిద తెగులు యాజమాన్యం.!
ఇక గుత్తిలో పిందె 3-4 మి.మీ. పరిమాణంలో ఉన్నప్పుడు 40 విపియమ్, 6-7 మి.మీ. పరిమాణంలో ఉన్నప్పుడు 30 ఏపియమ్ ‘జిఎ’లో గుత్తులను ముంచాలి. ఇదే దశలో ‘జిఎ’ హార్మోనుతో పాటు 1 పిపియమ్ సిపిపియు’ కూడా కలిపి గుత్తులను ముంచినట్లయితే ద్రాక్ష కాయ పరిమాణం పెరుగుతుంది.
కోత మరియు ప్యాకింగ్: ద్రాక్ష పండ్లు పక్వానికి వచ్చినపుడు కోస్తారు. ఎందుకంటే పండ్లు కోసిన తర్వాత దాని పక్వదశలో ఏమి మార్పురాదు. పిందె పడినప్పటి నుండి పర్వానికి వచ్చే కాల వ్యవధి సాగుచేయబడిన రకం, పంట దిగుబడి మరియు వాతావరణంపై ఆధారపడి ఉంటుంది.సామాన్యంగా ద్రాక్ష గుత్తిలోని చివరి పండు మెత్తగా, తీయగా ఉంటే గుత్తి కోతకు వచ్చినట్లు సూచన. తెల్ల ద్రాక్ష బాగా తయారైనప్పుడు అంబర్ రగులోకి మారుతుంది. అలాగే రంగు ద్రాక్ష బాగా రంగు వచ్చి పైన వచ్చినట్లు సూచన. బూడిద వంటి పొడితో సమానంగా కప్పబడినట్లు కనబడుతుంది. పండ్లలో మొత్తం కరిగే ఘన పదార్థాలు కూడా పండు పరికరాన్ని సూచిస్తాయి. థాంప్సన్ సీడ్స్ 21-220 బ్రిక్స్ రాగానే కోయవచ్చు.
Also Read: Grapes Disease: ద్రాక్ష పంటలో వచ్చే వ్యాధులకు నివారణ చర్యలు