భారతీయ వంటిళ్లలో నువ్వుల్ని అధికంగా వాడుతుంటాం. వంటల్లో కాకుండా.. మాములుగా నువ్వుల ఉండలు, నువ్వుల పొడి చాలా రకాలుగా వీటికి ఉపయోగిస్తుంటాం. నువ్వులు రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి.
రోజూవారీ ఆహారంలో నువ్వులను తీసుకోవడం వలన కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ తగ్గుతాయట. అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలోనూ తోడ్పడుతాయి. ఇందులో ఎక్కువగా పీచు పదార్థం ఉండడం వలన అరుగుదల బాగుంటుంది. డయాబెటీస్, ఒబేసిటి వంటి వ్యాధులను నివారించడానికి ఇవి ఉపయోగపడుతాయి. నువ్వుల్లో ఉండే ఐరన్, కాపర్, విటమిన్ బి6, సెల్ ఫార్మేషన్ కి సెల్ ఫంక్షన్ కి అవసరమవుతాయి.
ఇందులో ఉండే హెల్తీ ఫ్యాట్స్, హై క్యాలిటీ ప్రోటీన్ కంటెంట్ వలన బ్లడ్ షుగర్ ను కూడా కంట్రోల్ చేస్తాయి. అలాగే ఇందులో ఉండే విటమిన్ ఈ, ప్లాంట్ కాంపౌడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేసి, బాడీలో ఉండే ఆక్సిడేటివ్ స్టెస్ ని తగ్గిస్తాయి. నువ్వుల్లో థయామిన్, నియాసిస్, విటమిన్ బీ6 మెటబాలిజంకు సహాయపడుతుంటాయి.
నువ్వులను ప్లాంట్ ప్రోటీన్ సోర్సెస్ లో ఒకటిగా చెబుతుంటారు. ఇందులో ఉండే ప్రోటీన్ ఆరోగ్యానికి చాలా అవసరం. కీళ్ళ నొప్పుల నుంచి హార్మోన్ సమస్యల వరకు నువ్వుల్లో ఉండే ప్రోటీన్ సహాయపడుతుంది. వీటితో పాటు రాజ్మా, శనగలు తీసుకోవడం వలన కూడా కీళ్ళ నొప్పులు నుంచి ఉపశమనం కలుగుతుంది. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ నువ్వులను తీసుకోవడం వలన బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి సహాయపడుతుంది.