వార్తలు

లవంగము వల్ల ఆరోగ్య ప్రయోజనాలు..

0

లవంగం అనేది ఒక చెట్టు మొగ్గ. లవంగం చెట్టు నుండి పూసిన పువ్వును ఎండబెట్టి దీనిని తయారు చేస్తారు. దీనిలో యాంటీ ఇన్ఫ్లమెట్రి గుణాలూ, యాంటి బయోటిక్ గుణాలూ ఉన్నాయి.అంతేకాదు లవంగం చెట్టు మీద ఎండిపోయి రాలిన పూలే మన దగ్గరకి లవంగాలుగా వస్తాయి. లవంగంలో ఉండే పోషకాలు శరీరంలోని అన్ని రకాల వ్యవస్దకు మేలు చేస్తాయి.

లవంగం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు:

గొంతు నొప్పిని నయం చేయడం, సాధారణ జలుబుతో పోరాడుతూ, ఇంకా అనేక ఇతర వైద్యపరమైన ఔషధ గుణాలను ఈ లవంగములు కలుగివున్నది. ఇందులోఉండే మాంగనీస్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. బలమైన ఎముకల నిర్మాణానికి సాయం చేస్తుంది.

ఇందులో ఉండే విటమిన్-సి ఇమ్యూనిటీ సిస్టమ్ ను  యాక్టివ్ గా ఉంచుతుంది. ఏక లవంగాల్లో మాత్రమే ఉండే ఎజినాల్ అనే కెమికల్ శరీరంలో ప్రి-రాడికల్స్ ను అడ్డుకుంటుంది. లవంగాల్లో ఉండే “నైలిసిసిస్” అనే కెమికల్ షుగర్ ను కంట్రోల్ చేస్తుందని వాషింగ్టన్ యూనివర్సిటి స్టడీ తేలింది.

ఇన్సులిన్ ఉత్పత్తి పెంచేలా చేసి షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుతుందని పరిశోధకులు తేల్చారు. లవంగాలను నానబెట్టి, పేస్టులా చేసి గాయాలకు రాస్తే యాంటీసెప్టిక్ క్రీమ్ గా పనిచేస్తుంది. దీంట్లో ఉండే యాంటి ఫంగల్, యాంటి గ్రిమిసిడల్ గాయం దగ్గర వున్నా బ్యాక్టీరియాను చంపి ఇన్ఫెక్షన్ కాకుండా అడ్డుకుంటుంది.

ప్రయాణ సమయంలో గానీ, తిన్న ఆహారం జీర్ణ సమస్య ఉన్నప్పుడు వికారం, వాంతులు ఉంటుంది. అప్పుడు లవంగాలు వేసుకుంటే సరి ఇట్టే తగ్గుతుంది. జీర్ణశక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గును అరికడుతాయి. బీపీని కంట్రోల్ చేస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. తలనొప్పిని తగ్గిస్తాయి. కాలేయ మరియు చర్మ సమస్యలను నివారిస్తాయి.

 

Leave Your Comments

పూల మొక్కల్లో తెగుళ్ళు – నివారణ

Previous article

టమోట, వంగ, పచ్చి మిరప మరియు బెండ పంటలలో సమగ్ర సస్యరక్షణ

Next article

You may also like