హైదరాబాద్ లోని బోయినపల్లి కూరగాయల మార్కెట్ వారు చేస్తోన్న పని గురించి తెలిసి సంతోషం కలిగిందని ప్రధాని మోదీ గారు “మన్ కి బాత్” రేడియో కార్యక్రమంలో ఈ ప్లాంట్ గురించి ప్రస్తావించారు. ఇది ఇన్నోవేషన్ పవర్ వారు వేస్టు నుంచి వచ్చే వెల్త్ ను తయారు చేస్తున్నారు. ఇది నిజంగా అద్భుతమే అని ప్రశంసించారు.
మోదీ గారు ఈ ప్లాంట్ గురించి ప్రస్తావించిన తరువాత దీని ప్రాముఖ్యం పెరిగింది. తెలంగాణ గవర్నర్ తమిళసై సహా పలువురు ప్రముఖులు దీన్ని సందర్శించారు. 2019లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్ద వారు యార్డును చూశారు. తరువాత వారి నివేదిక ప్రకారం అహుజా సంస్ద వారు ప్లాంట్ నిర్మించారు. అధికారికంగా ఇంకా ప్రారంభోత్సవం కాలేదు. కానీ కరెంట్ ఉత్పత్తి జరుగుతోంది. ఇప్పటికే 45రోజుల్లో 32 వేల యూనిట్లు ఉత్పత్తి చేశాం. దీనివల్ల మాకు నెలకు మూడున్నర లక్షల రూపాయలు వచ్చే కరెంటు బిల్లు, ఇప్పుడు లక్షన్నరకు తగ్గింది. ఇక లారీల్లో వ్యర్దాలను జవహర్ నగర్ యార్డుకు తరలించడాని%E