Brown Rice Health Benefits: బ్రౌన్ రైస్ ఉండే పోషకాలు ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. . మార్కెట్‌లో దొరికే వివిధ రకాల తెల్ల బియ్యం ఇప్పుడు బాగా పాలిష్ చేసిన తర్వాతే మార్కెట్లోకి వస్తున్నాయి. దాని వల్ల పోషకాలు మొత్తం లేకుండా నిస్సారమైన పిండి పదార్థం ఉన్న బియ్యం మాత్రమే మార్కెట్లోకి వస్తుంది .భారతీయుల్లో దాదాపుగా 50 శాతం మందికి పైగా నిత్యం భోజనంలో అన్నమే తింటారు. కానీ నిజానికి ముడి బియ్యాన్ని బాగా పాలిష్ చేయడం వల్ల తెల్ల బియ్యంగా మారిపోతాయి.
అయితే అన్నం తెల్లగా ముత్యాల్లా ఉంటే గాని చాలా మంది తినరు. అయితే ముడి బియ్యాన్ని పాలిష్ చేస్తే దానిపై ఉండే పొర పోతుంది. అందులో ఉండే ముఖ్యమైన పోషకాలు కూడా ఎగిరిపోతాయి. ముడి బియ్యం నుంచి మనకు లభించే ఏవీ మనకు అందవు. అందుకే పాలిష్ చేయని బియ్యాన్ని తినాలీ.క్యాన్సర్ లాగా, స్థూలకాయాన్ని తగ్గించడం, ఇది శరీరంలోని తీవ్రమైన నొప్పిని, మధుమేహాన్ని కూడా తొలగించడంలో సహాయపడును.
Also Read: Onion Juice Health Benefits: ఉల్లి రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు.!
అలాగే పాలిష్ చేసేటప్పుడు ఉపయోగించే రసాయనాలు మన ఆరోగ్యానికి హాని చేస్తాయి.రోజూ బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల అనేక రకాల తీవ్రమైన వ్యాధులు తొలగిపోతాయి. బ్రౌన్ రైస్ కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.బ్రౌన్ రైస్‌లో ఉండే పాలిఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల కణాలు దెబ్బ తినకుండా కాపాడుతాయి. ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది.
జీర్ణం కూడా చాలా సులభంగా అవుతుంది. బ్రౌన్ రైస్ తినడం వల్ల గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ వంటి తీవ్రమైన వ్యాధులు దూరంగా ఉంటాయి.పాలిష్ చేసిన బియ్యం గ్లైసీమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. అంటే దాంతో వండిన అన్నాన్ని తింటే మన శరీరంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయి వెంటనే పెరుగుతుంది .ఈ బియ్యం వినియోగం వల్ల మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది.
అలాగే దీని వినియోగం మొత్తం శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తుంది.బ్రౌన్ రైస్‌లో ఐనాసిటాల్ హెగ్జాఫాస్ఫేట్ (IC6) అనబడే సహజసిద్ధమైన సమ్మేళనం ఇందులో ఉంటుంది. కానీ బ్రౌన్ రైస్‌లో గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీంతో వండిన అన్నాన్ని తినడం వల్ల షుగర్ స్థాయిలు వెంటనే పెరగదు.డైటరీ ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల వక్షోజ, పేగుల క్యాన్సర్లు రాకుండా ఉంటుంది. అలాగే డయాబెటిస్ లేని వారు కూడా బ్రౌన్ రైస్‌ను నిత్యం తినడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
Also Read: Chukka Koora Health Benefits: చుక్క కూరను తినడం వల్ల కలిగే లాభాలు.!