Mixed Fertilizers: నారు తయారీకి వివిధ పద్ధతుల్లో మొక్కలు పెంచడానికి మట్టి తో పాటుగా వివిధ రకాల పదార్ధాలను వినియోగిస్తారు. మరి మొక్కల పెంపకానికి ఉపయోగించే మట్టి మిశ్రమంకు ఉండాల్సిన లక్షణాలు తెలుసుకుందామా.
మిశ్రమం మరీ గుల్లగా తేలికగాను అలా అని మరీ గట్టిదనం తో కాకుండా మధ్యస్థంగా ఉండి మొక్కకు తగినంత సత్తువ కలిగి ఉండాలి.
నీరును పీల్చుకొని ఎక్కువ సేపు ఉండే గుణం కావాలి.
తడిగా లేదా పొడిగా ఉన్నపుడు దాని పరిమాణంలో మార్పు ఉండదు. మురుగు నీరు సులభంగా పోయే విధంగా ఉండి. బాగా గాలి ప్రసరణకు అనువుగా ఉండాలి. మిశ్రమం లో కలుపు విత్తనాలు తెగుళ్ళు కలిగించే నూలి పురుగులు, శిలీంద్రాలు లేకుండా జాగ్రత్త పడాలి.
మట్టి
మట్టిలో సుమారు 75% ఇసుక ఉంటే మొక్క పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది.బంక మట్టిలో ఇసుక పాలు తక్కువగాను, చాల్క నెలల్లో ఎక్కువగాను ఉంటుంది.దీనికి ఇసుక కలిపి లేదా సేంద్రియ ఎరువుతో కలిపి వేయాలి.చెరువు మట్టిలో సేంద్రియపు ఎరువు ఎక్కువగా ఉంటుంది.కనుక దీనిని కూడా వినియోగించవచ్చు.
Also Read: Bio Fertilizers Importance in Agriculture: వ్యవసాయంలో జీవన ఎరువుల వాటి ప్రాముఖ్యత.!
ఇసుక
ఇసుకను కొన్ని ఫల వృక్ష విత్తనాలు మొలకెత్తించడానికి ఎక్కువగా వాడుతారు.అయితే వాడే ముందు ఇసుకను వేడి ఆవిరి తో శుద్ధి చేసి వాడాలి.
పిట్
బురద నెలల్లో ఆకులు అలుము పడి కొంత వరకు కుళ్ళి తయారైన పదార్ధమే పిట్ అంటారు.ఇది సాధారణంగా కొంచెం నల్లగా ఉండి అధిక నీటిని నిల్వ ఉంచుతుంది.ఒక శాతం నత్రజని కలిగి ఉంటుంది.
వర్మీక్యూలెట్
ఇది ఒక మైకా పదార్ధం వేడి చేస్తే ఉబ్బుతుంది. చాలా తేలికగా ఉంటుంది.రాసాయనిక మెగ్నిషియం , ఉదజని సూచిక తక్కువగా ఉంటుంది.
పర్లైట్
ఇది అగ్ని పర్వతాల నుండి వెలువడిన లావా నుండి తయారు అయ్యే బూడిద రంగులో తేలికగా ఉండే పదార్ధం.దీని బరువు కంటే 3-4 రేట్లు అధికంగా నీరు తీసుకుంటుంది.1/16 నుండి 1/8 పరిమాణం గల రేణువులను ఉద్యనా పంటలలో ఉపయోగిస్తారు.
ఫ్యూమైన్
ఇది కూడా లావా నుండి లభిస్తుంది.తెల్లగా లేదా బూడిద రంగులో గుల్లగా తేలికగా ఉంటుంది.నీటిని బాగా పీల్చుకుంటుంది.
కుళ్ళిన ఆకులు
ఎండిన పచ్చి ఆకులు పొరలు పొరలుగా ఒక గోతిలో వేసి రెండు ఆకుల పొరల మధ్య అమోనియం సల్ఫేట్ తరచు చల్లుతుంటే 3-4 నెలల్లో దొరుకుతుంది.
రంపపు పొట్టు
దీనిని మట్టి మిశ్రమం తయారీలో వినియోగించవచ్చు. గాలి అంట్లు కట్టడానికి ఒక సంవత్సరం క్రితం తయారు అయినా రంపపు పొట్టును వాడాలి.
Also Read: Nitrogen Fixing Biofertilizers: నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులతో ఎన్నో లాభాలు.!