వార్తలు

కేంద్రం రైతుల కోసం విడుదల చేసిన 2021 – 22 బడ్జెట్

0

రైతుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది.

పంట రుణాల్లో 10% వృద్ధి పొందుతారు

అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల వ్యయానికి కనీసం 15 రెట్లు అధికంగా మద్దతు ధర వచ్చేలా చేస్తామని చెప్పారు.

మరో వెయ్యి మార్కెట్ల ను ప్రభుత్వ డిజిటల్ వ్యవసాయ ట్రెడింగ్ ప్లాట్ ఫాం “ఈ – నామ్” తో జోడిస్తామని బడ్జెట్ లో కేంద్రం పేర్కొంది.

వ్యవసాయ సదుపాయాల నిధి ని రూ.40 వేల కోట్లకు,మైక్రో ఇరిగేషన్ కార్బస్ ఫండ్ ను రూ.10 వేల కోట్లను పెంచునున్నట్లు తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండే వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటి (ఏపీఎంసీ) కి కట్టుబడి ఉన్నామని కేంద్రం స్పష్టతనిచ్చింది.

ఏపీఎంసీ లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన రూ.లక్ష కోట్ల నిధిని ఉపయోగించుకునేందుకు రాష్ట్రాలకు అవకాశం కల్పించనున్నట్లు బడ్జెట్ లో పేర్కొంది.

ఎరువులు,ఆహరం పై చెరో 40 శాతం కోత

కొత్త బడ్జెట్ లో ఎరువుల సబ్సీడీని రూ.79,530 కోట్లకు,ఆహార సబ్సీడీ ని రూ.2,42,836 కోట్లకు తగ్గించింది.

అదే విధంగా పేదలకు ఎంతో ముఖ్యమైన ఆహార సబ్సీడీ ని కూడా ప్రభుత్వం బాగా తగ్గించింది.

ఆహార భద్రతా చట్టంలో భాగంగా దేశ జనాభా లో 67శాతం మంది ప్రజలకు సర్కారు చౌక ధరలకే నిత్యావసరాలు అందిస్తుంది.

Leave Your Comments

శనగలతో ఆరోగ్య ప్రయోజనాలు…

Previous article

వరల్డ్ పల్సెస్ డే గోడపత్రికను విడుదల చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

Next article

You may also like