ఖిల్లాఘణపురం మండలంలో సోళిపూర్,మానాజిపేట,కమాలోద్దిన్ పూర్,ఘణపురం,మామిడి మాడ,అప్పారెడ్డిపల్లిలలో రైతువేదికలను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు.
- రైతులందరిదీ ఒకే కులం రైతు కులం.
- అద్భుతాలు సృష్టించ గల ఏకైక రంగం వ్యవసాయం
- కరోనా తో అన్ని రంగాలు మూలనపడ్డా వ్యవసాయం ఆగలేదు.
- ఒకప్పుడు ఏం పాపం చేసిండో సేద్యం చేస్తున్నడు అనేవారు
- ఇప్పుడు ఆ పరిస్దితులు పోయాయి..వ్యవసాయం లో రైతులు అద్భుతాలు సృష్టిస్తున్నారు.
- గత యాసంగిలో 39లక్షల ఎకరాలలో వరి సాగాయితే ఈ యాసంగిలో దాదాపు 50 లక్షల ఎకరాలలో సాగయింది.
- సాంప్రదాయ పంటలు వీడి రైతులు పండ్లు,కూరగాయల వంటి ఉద్యాన పంటలపై దృష్టి సారించాలి.
- త్వరలోనే రైతులను ఇతర రాష్ట్రాలకు పంటల పరిశీలనకు అధ్యయనానికి పంపుదాం.
- 2,3 ఎకరాలలో మల్బరీ సాగుతో కర్ణాటక రైతులు భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు.
- రైతాంగానికి వ్యవసాయంలో మెళుకువలు తెలిపి వారిని ప్రోత్సహించెందుకే రైతు వేదికలు
- రైతులను ఐక్యమత్యం చేసి వారిని ఒకే గొడుగు కిందకు తెచ్చి వారు సాగులో లాభాలు ఆర్జించే దిశగా నడిపించాలన్నదే ముఖ్యమంత్రి కే.సి.ఆర్ ఉద్దేశం
- మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని డిమాండ్ వున్నా పంటలను రైతులు పండించాలి.
- ప్రభుత్వం తన వంతు బాధ్యతగా రైతుబంధు,రైతుభీమా,24 గంటల ఉచిత కరెంటు తో పాటు విత్తనాలు,ఎరువులు అందుబాటులో ఉంచుతుంది
- రైతులు చేయవలసిందల్లా సాంప్రదాయ పంటలను పక్కన పెట్టి డిమాండ్ వున్నా పంటలను సాగు చేయడమే
- వానాకాలం,యాసంగిలో వ్యవసాయ శాఖ ఇచ్చిన ప్రణాళిక ప్రకారం పంటలు సాగు చేయించేందుకు వ్యవసాయ అధికారులు రైతులను ప్రోత్సహించాలి…రైతులు అధికారుల సూచనల ప్రకారం పంటలు సాగు చేయాలి.
- తెలంగాణ భూములతో పోలిస్తే పక్క రాష్ట్రాలలో దిగుబడులు తక్కువ వస్తాయి..రైతులు చేయాల్సిందల్లా అధికారుల సూచనలు పాటించడమే
- రైతు వేదికలను సద్వినియోగం చేసి రైతులకు సలహాలు,సూచనలు ఇవ్వడం అధికారుల బాధ్యత… పాటించడం రైతుల బాధ్యత
- ఖిల్లాఘణపురం మండలంలో సోళిపూర్,మానాజిపేట,కమాలోద్దిన్ పూర్,ఘణపురం,మామిడి మాడ,అప్పారెడ్డిపల్లిలలో రైతువేదికలను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు.
Leave Your Comments