Chawki Rearing Practices: చాకీ పురుగుల పెంపకాన్ని పొందికైన, గాలిని నియంత్రించు చిన్న గదులలోనే చేయాలి. 2చాకీ సెంటర్ లో హీటర్స్ (కుంపట్లు) మరియు హ్యుమిడిఫైయర్ను ఉపయోగించి 27-28°C ఉష్ణోగ్రత మరియు 85-90 శాతం తేమ ఉండేలా మెళకువలు తీసుకోవాలి. కానీ స్వతహాగా చాకీని నిర్వహిస్తే వాతావరణం కల్పించుటకు తగిన పద్ధతులను అవలంభించాలి. మృధువైన రసపూరితమైన లేత మల్బరీ ఆకులను, కత్తిరించి మేతగా వాడాలి. ప్రతి రోజు రెండుసార్లు మేత వేయాలి. ప్రతి రోజు ఆకు మేత వేయడానికి ముందు ట్రేలలోని పడకను విడగొట్టి, పడక ఆరేలా జాగ్రత్త తీసుకోవాలి.
పురుగులు నాలుగో రోజు మొదటి జ్వరమునకు కూర్చుంటాయి. తట్టలలో స్థలావకాశమివ్వాలి. పురుగులు జ్వరమునకు కూర్చున్న వెంటనే కాల్చి విడగొట్టిన సున్నపు పొడిని పడకలపై చల్లాలి.పారఫిన్ కాగితమును కప్పకూడదు. గదిలో గాలి, వెలుతురు కల్పించాలి. & పురుగులు జ్వరం నుండి లేచిన తర్వాత “విజేత” పౌడర్ ను చల్లాలి. విజేతను చల్లిన అరగంట తర్వాత వలలు వేసి వాటిపై మేతను ఇవ్వాలి.
వలల పైన రెండు మేతలు ఇచ్చిన తరువాత పడకలను శుభ్రం చేయాలి. పడకలను విస్తరించాలి. మొదటి జ్వరo లేచిన తర్వాత మూడో రోజు పురుగులు 2 వ జ్వరానికి పోవును.పడకలపై కాల్చి విడగొట్టిన సున్నం చల్లాలి. జ్వరం నుండి లేచిన తర్వాత, విజేత లేదా అంకుశ్ పౌడరును చల్లాలి. 14. రెండవ జ్వరము సమయానికి 100 గ్రుడ్ల పురుగులు 12 తట్టలలోకి విస్తరించాలి.
Also Read: Silkworm Chawki Rearing: చాకీ ఆకు నాణ్యత ఎలా ఉండాలి.!
అనుకూలమైన వెలుతురు: చాకీ పురుగులకు 6 గంటల వెలుతురు మరియు 18 గంటల చీకటి అనుకూలం.పెద్ద పురుగులకు 18 గంటల వెలుతురు మరియు 6 గంటల చీకటి అనుకూలం. పట్టుపురుగులు సాధారణంగా తక్కువ కాంతిని ఇష్టపడతాయి. కావున ఎక్కువ వెలుతురు నిచ్చే హైవోల్టేజ్ బల్బులను పురుగులు పెంచు గదిలో ఉపయోగించరాదు.
మల్బరీ ఆకులోని తేమ శాతం పట్టుపురుగుల పెంపకంపె నేరుగా ప్రభావం చూపుతుంది. పట్టుపురుగులు మొదటిదశలో ఎక్కువ తేమను గ్రహించి, ఎక్కువ పెరుగుదలను కలిగి ఉంటాయి. అందువల్ల ఎక్కువ తేమాంశము గల లేత ఆకులను మేతగా ఇవ్వడం తప్పనిసరి.చాకీ మరియు పెద్ద పురుగులు అనుకూలమైన వెలుతురు.
పట్టుపురుగులలో తేమను గ్రహించి నిల్వచేసుకొనే సామర్థ్యం మొదటిదశలో చాలా ఎక్కువ. ఇది 2 వదశలో మరియు 3 వ దశలలో కూడా స్థిరంగా ఉంటుంది. పట్టుపురుగుల లార్వాలు మొదటి దశలో 15 రెట్లు, 2వ దశలో 5 రెట్లు, 3వ దశలో 3రెట్లు పెరుగుదలను కలిగి ఉంటాయి. అదే విధంగా మొదటి, రెండవ దశలో అధికంగా ఆహారాన్ని మరియు ప్రాణవాయువును గ్రహిస్తాయి. అంతేగాక చెమట రూపంలో ఎక్కువ నీరు వృధా అవుతుంది.
పైన వివరించిన విధంగా పురుగులు చాకీ దశలో ఎక్కువ పెరుగుదలను మరియు ఎక్కువ నీరును నిల్వ చేసుకొంటాయి. పురుగులు నీటిని ఆకుల నుండి మాత్రమే గ్రహిస్తాయి. కావున అధిక తేమ మరియు పోషకాంశాలు గల ఆకులను మేతగా వాడుట అతి ముఖ్యము.చాకీ దశలో పట్టుపురుగులు ఎక్కువ గాలిలో తేమను తట్టుకొను సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందువలన చాకీ పెంపకప్పు గదిలో 80 నుంచి 90 శాతం తేమ ఉండేలా జాగ్రత్త వహించాలి. దీని వలన ఆకులు తొందరగా వాడిపోకుండా తాజాగా కూడా ఉంటాయి.
పెంపకగదిలో 90 శాతం తేమఎందుకు అవసరం?
అప్పుడే గ్రుడ్ల నుండి బయటికి వచ్చిన లార్వాలపై సహజంగానే తేమ ఎక్కువగా ఉంటుంది. పురుగులపై గాలి ప్రసరించినప్పుడు అది నెమ్మదిగా ఆరిపోయి చర్మం పొడిగా తయారవుతుంది.తరువాత పురుగులు చురుకుగా కదలడం ప్రారంభిస్తాయి. కానీ పురుగుల చర్మంపై తేమ ఎక్కువ ఆరిపోయినచో చురుకుదనం లోపిస్తుంది.ఇది చాలా అపాయము కాబట్టి తప్పక తగినంత తేమ వాతావరణం ఉండేలా చూసుకోవాలి. గదిలో తేమశాతం అధికంగా ఉంటే తట్టలలో ఆకు చాలాసేపు తాజాగా వుండి మేత తినుటకు అనువుగా కూడా ఉంటుంది.
Also Read: Silk Production: ఆముదం ఆకుల పట్టుకు మార్కెట్లో మంచి డిమాండ్