వార్తలు

సెరికల్చర్,మల్బరీ సాగుపై సీ.ఎస్.ఐ.టీ డైరెక్టర్ తో సమావేశమైన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు

0

కర్ణాటక రాష్ట్రం రాంనగర్ సెరికల్చర్ మార్కెట్,మద్దూరు తాలుకా కెస్తూర్ లో మల్బరీ సాగు,మైసూర్ సీ.ఎస్.ఐ.టి లో సంస్ద డైరెక్టర్ తో సమావేశమయిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి గారు

  • రైతుల తలరాత మారాలన్నదే కే.సి.ఆర్ ఆలోచన
  • సాంప్రదాయ పంటల నుండి రైతులను ఇతర పంటలవైపు మళ్ళించేందుకువివిధ రాష్ట్రాలలో పంటలసాగు,ఫుడ్ ప్రాసెసింగ్ విధానాలపై అధ్యయనం
  • వ్యవసాయంలోనే భవిష్యత్ ఉంది
  • వ్యవసాయం,దాని అనుబంధ రంగాల్లోనే ఉపాధి అవకాశాలు… మరే రంగమూ ప్రజలకు ఇంత భరోసా ఇవ్వదు
  • అందుకే ముఖ్య మంత్రి కే.సి.ఆర్ స్పష్టమయిన ప్రణాళిక తో ముందుకు తీసుకెళ్తున్నారు.
  • ప్రాజెక్టుల నిర్మాణం,సాగునీటి రాకతో మారిన తెలంగాణ వ్యవసాయ స్వరూపం
  • రైతుబంధు,రైతుభీమా,ఉచిత కరెంట్ పధకాలతో రైతాంగానికి అండగా నిలుస్తున్నారు.
  • శాస్త్ర,సాంకేతిక రంగాలలో ఎంత అభివృద్ధి సాధించినా ఆహారానికి ప్రత్యామ్నాయం లేదు.
  • తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలతో తెలంగాణ రైతాంగంలో ఆత్మవిశ్వాసం పెరిగింది.
  • ఉన్నత విద్యావంతులు ఉద్యోగాలు వదిలి వ్యవసాయం చేస్తున్నారు
  • గత ఏడాది ఎఫ్.సి.ఐ ధాన్యం కొనుగోళ్ళు నిలిపేస్తే రైతాంగం చిక్కుల్లో పడుతుంది
  • అందుకే రైతులకు లాభాలు అందించే వ్యవసాయ,ఉద్యాన పంటల సాగుపై అధ్యయనం చేయాలని కే.సి.ఆర్ ఆదేశించారు.
  • రైతులను పంటల మార్పిడి వైపు మళ్లించాల్సిన భాధ్యత ప్రభుత్వాలదే
  • అందుకే కర్ణాటక లో సెరికల్చర్ ,హార్టికల్చర్ రంగాలలో అనుసరిస్తున్న విధానాలు,రైతు సహకార సంఘాల పరిస్దితి,శ్రీ గంధం సాగు,హైడ్రో ఫోనిక్ పద్దతిలో ఆకుకూరల సాగు,పాళీ హౌస్ లో తీగ జాతి టమాటా,క్యాప్సికమ్ ,బీర సాగు పద్దతులు,తమిళనాడు హాసూరులో వెదురు సాగు,మాండ్య జిల్లా రాంనగర్ లో దేశంలోనే అతిపెద్ద సెరికల్చర్ మార్కెట్,మద్దూరు తాలుకా కెస్తూరులో యువ రైతులు రాజు,కుమార్,శశి,వినోద్ లు సాగు చేస్తున్న మల్బరీ సాగు,పట్టుపురుగుల సాగు అంశాలను పరిశీలించడం జరిగింది.
  • మైసూరు సీ.ఎస్.ఐ.ఆర్-సీ.ఎఫ్.టీ.ఆర్.ఐ(Central Food Technological Research Institute) లో జరిగిన సమావేశంలో మంత్రి సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి గారు,పాల్గొన్న CSIR-CFTRI డైరెక్టర్ డాక్టర్ శ్రీదేవి ఎ సింగ్ గారు,కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వ విద్యాలయ వీ సీ నీరజా ప్రభాకర్ గారు,ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి గారు,అంతకు ముందు మాండ్య జిల్లా రాంనగర్ లో దేశంలోనే అతిపెద్ద సెరికల్చర్ మార్కెట్,మద్దూరు తాలూకా కెస్తూరులో యువ రైతులు రాజు,కుమార్ ,శశి,వినోద్ లు సాగు చేస్తున్న మల్బరీ సాగు పరిశీలన
  • కర్ణాటక ఉద్యాన వుదానాలు,ప్రపంచవ్యాప్త డిమాండ్,దానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించిన CSIR-CFTRIసంస్ద పండ్లు,కూరగాయల ప్రాసెసింగ్ హెడ్ డాక్టర్ విజయానంద్,తెలంగాణ లో ముఖ్యమంత్రి కే.సి.ఆర్ వ్యవసాయ అనుకూల విధానాలపై ప్రశంసలు
  • రైతుబంధు,రైతుభీమా,24 గంటల కరెంటు ఇవ్వడమే కాకుండా పంట కాలనీల ఆలోచన బాగుందని, ఉద్యాన రంగంలో రైతులను ప్రోత్సహించాలన్న విధానం ప్రశంసనీయం
  • ఉద్యాన సాగులో పాలీ హౌస్,గ్రీన్ హౌస్ సాగులను ప్రోత్సహించండి… రెడ్,ఎల్లో క్యాప్సికం ,బ్రోకోలి,టమాటా పంటలు పండించవచ్చు
  • ఉద్యాన ఉత్పత్తులు,మార్కెట్ డిమాండ్ల ను వివరించిన CSIR-CFTRI టెక్నాలజీ హెడ్ డాక్టర్ రాజేష్,ఫుడ్ సేఫ్టి,క్వాలిటీ కంట్రోల్ హెడ్ డాక్టర్ అలోక్ శ్రీవాత్సవ
  • తెలంగాణ లోని వివిధ జిల్లాలలో వివిధ పంటల సాగు,వాటి అనుబంధ ఉత్పతుల అవకాశాలపై వివరణ
Leave Your Comments

నిత్యం ఆరోగ్యం గా ఉండాలంటే మనము పాటించవలసిన ఆహారపు అలవాట్లు

Previous article

‘ఏరువాక’ మాసపత్రిక ఆవిష్కరణ..

Next article

You may also like