ఆరోగ్యం / జీవన విధానం

Medicinal Plant: సుగంధ తైల మొక్కల ప్రాముఖ్యత.!

2
Medicinal Plant Importance
Medicinal Plant Importance

Medicinal Plant: ప్రపంచంలో పుట్టే ప్రతి మొక్క ఔషధపు మొక్కే అన్ని మొక్కల ఉపయోగాలకు సంబంధించిన పరిజ్ఞానం ప్రస్తుతము మనకు లేదు. ఇంతకాలంగా అరణ్యాలలోను, పంట పొలాలలోను, బీడు లేదా బంజరు భూములలోను, ప్రకృతి సిద్ధంగా పెరిగే మొక్కలనే సేకరించి ఔషద మొక్కలు అంతరించి పోయినాయి. దీనికి తోడు, వీనిని గురించిన ఔషద పరిజ్ఞానం, ప్రాధాన్యతలు పాశ్చాతులకు కూడా కలిగినందువలన ఎగుమతి ప్రాధాన్యత కూడా ఏర్పడింది. అందుచలన దేశ విదేశాలలో[మార్కెట్టు కలిగిన యీ మందు మొక్కలను నాటి, సేద్యము చేసి పండించడము మినహా గత్యంతరము లేదు.

ఈ మందు మొక్కలలో కొన్నింటి వేళ్ళు, దుంపలు, మైరికొన్నింటి కాండము, కాండముపై బెరడు, పుష్పాలు, పత్రాలు, కాయలు, గింజలు ఇంకా కొన్నింటిని సమూలంగా అంటే అన్ని భాగాలు ఔషధాలలో ఉపయోగించబడతాయి. ఈ మొక్కల భాగాలలో ఒక ప్రత్యేకకాలంలో, తగిన వయసు వచ్చిన తరువాతనే వీర్యవంతమైన, గుణకారియైన ఔషధ గుణాలు సిద్ధిస్తాయి. అప్పుడు మాత్రమే యీ మొక్కలను సేకరించవలసి ఉంటుంది.

ఔషధ మొక్కల సేద్యo ను చేపట్టడానికి ముందు సరియైన మొక్కలను గుర్తించాలి. నాణ్యమైన విత్తనాన్ని సేకరించుకోవాలి. భూమికి అనువైన వాతావరణానికి సరిపడు మొక్కలను ఎంచుకోవాలి. సంపూర్ణ సేద్యపద్ధతులను, అవసరమైన పంటలోని మొలకువలను తెలుసుకోవాలి. పంట కరణ పరిస్థితులను తదనంతర పరిస్థితులను అవగాహన చేసుకోవడమే కాక మార్కెట్ సమాచారమంతటినీ తెలుసుకొని ఉండాలి.

Medicinal Plant

Medicinal Plant

Also Read: Citrus Leaf Miner: నిమ్మ తోటలలో ఆకు తొలుచు మరియు బెరడు తొలుచు పురుగుల నివారణ.!

ఔషధ మొక్కల సేద్యములో మరొక ప్రత్యేక అంశము ఎరువులు, పురుగు మందులకు సంబంధించినది. ఔషధ మొక్కల సేద్యములో వీలైనంత వరకు సేంద్రియ ఎరువులను వాడడము మంచిది. పశువుల ఎరువు, కంపోస్టు, వర్మి కంపోస్టు, గొర్రెల ఎరువు,, కోడి ఎరువులను ఉపయోగించిన అవి చిరకాలము వరకు పనిచేయగలవు. అవసరమైన చోట్ల కొద్ది మోతాదులో రసాయనిక కాంప్లెక్సు ఎరువులను అదనంగా ఉపయోగించవచ్చు.

మన రాష్ట్రంలో సుగంధ తైలాన్నిచ్చే మొక్కలను వాణిజ్య పరంగా సాగుచేస్తున్నారు. ఈ మొక్కలను మైదాన మరియు ఎత్తైన ప్రదేశాలలో పెంచటానికి వీలున్నది. ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తా జిల్లాలోని ఎత్తైన ప్రాంతాల్లో వర్మాధారంగా సాగుచే యటానికి ఎంతో అవకాశమున్నది. ఈ మొక్కలు – పరిశ్రమలకు కావల్సిన ముడిపదార్థాలను అందించగలవు. అంతేకాక అత్తరుల తయారి, పరిమళాలు, సబ్బుల మరియు స్-ందర్యనికి ఉపయొగించే వస్తువుల తయారీ కర్మాగారాల్లో ఈ మొక్కలు నుండి తీసిన తైలాన్ని విరివిగా వాడున్నారు.

ఈ సుగంధ తైలాన్నిచ్చే మొక్కలను కనీసం 10 – 15 ఎకరాల్లో సాగు చేస్తేనే లాభదాయకం. అంతేగాక అరటన్ను నుండి టన్ను సామర్థ్యం గల తైలంతినే (డిస్టిలేశన్) యంత్రాన్ని కూడ కల్గియుండాలి. కనీసం 15-20 రోజులకోకసారి నీరు ఇచ్చే సదుపాయమున్నట్లయితేనే ఈ పంటల సాగు ఆర్థికంగా లాభదాయకం. సుగంధ తైలాల ధరలలో తరుచుగా హెచ్చు తగ్గులు వస్తుంటాయి. మొదటి సంవత్సరములోనే లాభాల నాశించలేము. మార్కెట్ పై పూర్తి అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే వాటి సాగు చేపట్టాలి.

Also Read: Seed Treatment with Rhizobium: రైజోబియంతో విత్తన శుద్ధి.!

Leave Your Comments

Seed Treatment with Rhizobium: రైజోబియంతో విత్తన శుద్ధి.!

Previous article

Citrus Leaf Miner: నిమ్మ తోటలలో ఆకు తొలుచు మరియు బెరడు తొలుచు పురుగుల నివారణ.!

Next article

You may also like