పట్టుసాగుమన వ్యవసాయం

Chawki rearing: చాకీ పురుగుల పెంపకము ప్రాముఖ్యత

0

sericulture ఈ వాతావరణము రోగక్రిముల వృద్ధికి కూడా అనువైనది కావున ప్రతి రోజు ఒక సారి పడకను విడదీసి ఆరేలా తప్పక చేయాలి.

  • పై వాటితో పాటు, పడకలపై కాల్చిన సున్నము మరియు పడకలపై చల్లు ఔషదాలను క్రమం తప్పకుండా వాడినచో పురుగుల శరీరంపై మరియు పడకలలో గల క్రిములు తొలగింపబడుతాయి.
  • నాణ్యమైన, మేత ని, అధిక తేమగల ఆకును మేతగా వేసినచో పురుగులు ఆరోగ్యంగా, ధృడంగా పెరుగుతాయి. చెట్ల నీడలో పెరిగిన ఆకును చాకీకి వాడరాదు.
  • ఆకులలో ఎక్కువ తేమ ఉండుటకోసం, చాకీ కట్టడానికి ఒక రోజు ముందుగాను మరియు మొదటి జ్వరం నాడు తోటకు నీరు కట్టాలి.
  • చాకీతోటకు ప్రతి 3-4 రోజులకొకసారి నీరు పెట్టాలి. గదిలో కావాల్సిన ఉష్ణోగ్రత మరియు తేమాంశములను ఏర్పరిచినప్పుడు రోజుకు రెండు మేతలు సరిపోతాయి.

  • ఆకు నాణ్యత తక్కువగా ఉండినచో లేదా వాతావరణనియంత్రణలో తేడా ఉన్నచో రోజుకు మూడు మేతలు వేయవచ్చును. చాకీ తోటలోని ఆకును, రసాయన ఎరువులు వేసిన 15 రోజుల తర్వాతనే మేతగా వాడాలి.
  • రసాయనిక ఎరువులు వేసిన వెంటనే ఆకులలో రసాయనిక పదార్థాలు సమతుల్య నిష్పత్తిలో వుండవు. కాబట్టి పురుగులపై దుష్ప్రభావమును కల్గిస్తాయి.
  • పడకలలో పురుగులు ఒత్తుగా క్రిక్కిరిసి ఉన్నచో, పురుగుల పెరుగుదల తగ్గడంతో పాటు రోగాల బారిన పడే ప్రమాదముంది. కావున సిఫారస్సు చేసిన సమయంలో పడకలను విస్తరిస్తూ, తగిన స్థలావకాశమును కలిగించాలి.
  • పురుగులు జ్వరంలో ఉన్నప్పుడు తగినంత వాతావరణం అవసరమౌతుంది.

చాకీ కేంద్రముల వలన అనుకూలములు:

  • పట్టుపురుగులు పెంపకం ద్వార అధిక గూళ్ళ దిగుబడి, మంచి ఆదాయం పొందాలంటే, చాకీ దశలో పట్టు పురుగులను అత్యంత పరిశుభ్రమైన రోగరహిత పరిస్థితులలో చేపట్టుట తప్పనిసరి.
  • :అంతేగాక, ఉష్ణోగ్రతను గాలిలో తేమాంశమును నియంత్రి,చు పరికరములు, ప్రత్యేకమైన చాకీగదులు అవసరముంటుంది.
  • ఇటువంటి సౌకర్యములను ప్రతి రైతు స్వతహాగ సమకూర్చుకొనుట కష్టసాధ్యము. ఈ సమస్యను అధిగమించుటకై “చాకీ కేంద్రము”ల వినియోగం అమలులోనికి వచ్చినది.
  • వివిధప్రాంతములలో చాకీ కేంద్రముల స్థాపించబడి నుంచి ఫలితాలను అందిస్తున్నాము.
  • “చాకీ కేంద్రముల ద్వారా నాణ్యమైన చాకీ పురుగులు పొందటేయేగాక పట్టు రైతులకు శ్రమ, సమయం ఆదా అవుతాయి. అంతేగాక ప్రతిఏడాది ఎక్కువ పంటలను తీసుకొను ఆవకాశం కూలు చేకూరుతుంది.
  • చాకీ కేంద్రములు అందుబాటులో లేని ప్రాంతములలో అత్యంత జాగ్రత్తగా, శాస్త్రీయ విషయములను అవగాహన చేసుకొని మంచి నాణ్యతా ప్రమాణములతో చాకే పెంపకమును నిర్వహించుకొనుట చాలా అవసరము.
Leave Your Comments

Tobacco climate: పొగాకు సాగు కు అనుకూలమైన వాతావరణం

Previous article

Poultry farming: కోడి పిల్లల పెంపకం లో మెళుకువలు

Next article

You may also like