Seed Law: 1.విత్తన చట్టంలో విత్తన చట్టం:1966, విత్తన నిబంధనలు`1968, విత్తన నియంత్రణ ఉత్తర్వులు – 1983 వంట చట్టాలు పొందుపరచబడి విత్తన చట్ట పరమైన, అతిక్రమణలు, ఉల్లంఘనలు, వాటికి వర్తింప చేయు -చట్టపరమైన చర్యలు వివరించడం జరిగింది.
2. అనధికారంగా లేదా లైసెన్సు లేకుండా విత్తన వ్యాపారం నిర్వహించుట: ఎవరైతే పైన పేర్కొన్న విధంగా లైసెన్సు లేకుండా విత్తన వ్యాపారం నిర్వహిస్తారో అట్ట్టి వారికి విత్తన నియంత్రణ ఉత్తర్వులు `1983 క్లాజు 3 ను అతిక్రమించినందుకుగాను, అటువంటి విత్తనాలను జప్తుచేయడంతో పాటు తదుపరి చట్ట పరమైన చర్యలు తీసుకోబడతాయి. వీరు విత్తన నియంత్రణ ఉతర్వుల ప్రకారం అత్యవసర సరుకుల చట్టం – 1955 సెక్షన్ 7 ప్రకారం జరిమానా విధింపుటకు అర్హులవుతారు.
షాపు నందు డీలరు విత్తన లైసెన్సు ప్రదర్శించక పోవడం:
విత్తన లైసెన్సు యొక్క ఈ నిబంధనల ప్రకారం షాపు నందు డీలరు ఒక వేళ విత్తన లైసెన్సు ప్రదర్శించలేని ఎడల అది ఉల్లంఘన చర్యగా పరిగణింపబడే కారణంగా విత్తన అమ్మకపు నిలుపు చేయడం జరిగుతుంది. అంతేగాక నోటీసు ఇస్తూ, తరువాత అట్టిలోటును సవరించని యెడల విత్తన నియంత్రణ ఉత్తర్వులు – 1983 క్లాజు 5 ప్రకారం ఆ సదరు డీలరు లైసెన్సు సస్పెండు లేక రద్దు చేయబడును.
Also Read: Seed Cleaning in Chili Crop: మిరపలో విత్తనశుద్ధి – నారుమడిలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు
3. ధరల సూచిక బోర్డు /స్టాకు బోర్డును విత్తన డీలరు ఏర్పాటు చేయక పోవుట:
విత్తన డీలరు స్టాకు బోర్డును ఏర్పాటు చేయని పక్షాన, విత్తన నియంత్రణ ఉత్తర్వులు – 1983 క్లౌజు ‘8’ ని అతిక్రమించుట కారణంగా విత్తన అమ్మకం నిలుపుదల చేయడంతోపాటు నోటీసులు ఇచ్చి సవరించుటకు కోరడం జరుగుతుంది. తదుపరి అట్ట లోటును సవరించని యెడల ఆ సదరు డీలరు లైసెన్సును సస్పెండు రద్దు చేయబడును.
4. డీలరు విత్తన కొనుగోలు దారుకు అమ్మకపు రశీదు ఇవ్వక పోవడం:
విత్తన కొనుగోలు దారుకు డీలరు అమ్మకపు రశీదు ఇవ్వక పోవడం అనే చర్య విత్తన నియంత్రణ ఉత్తర్వులు – 1983 క్లాజు ‘9’ ని అతిక్రమించినట్లుగా
భావిస్తూ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. తదుపరి అట్టి లోటును సదరు డీలరు సవరించని పక్షాన విత్తనపు డీలరు లైసెన్సును సస్పెండు/రద్దు చేయబడును.
5. లేబుల్ సక్రమంగా లేని/ లేబుల్ లేని విత్తనాలు అమ్మడం:
ఇట్టి చర్యను, విత్తన చట్టం 1966 సెక్షను ‘7’ మరియు విత్తన నియంత్రణ ఉత్తర్వులు `1983 క్ల్లాజు ‘8’ ప్రకారం ఉల్లంఘనగా పరిగణిస్తూ అట్టి విత్తనాలను జప్తు చేయడంతో పాటు సదరు డీలరు యొక్క లైసెన్సు సస్పెండ్ లేదా రద్దు చేయడంతో పాటు అత్యవసర సరుకుల చట్టం – 1955 సెక్షన్ ‘7’ ప్రకారం వారు జరిమానాకు అర్హులు అవుతారు.
6. కాలం చెల్లిన విత్తనం సరిగా మొలకెత్తక పోవడం వల్ల రైతులు నష్టపోయెదరు. అట్ట్టి విత్తనం అమ్మకం, విత్తన చట్టం 1966 సెక్షన్ ‘7’ మరియు విత్తన నియంత్రణ ఉత్తర్వులు `1983 క్లాజు ‘8’ ప్రకారం ఉల్లంఘనగా పరిగణిస్తూ అట్టి విత్తనాలను జప్తు చేస్తూ సదరు డీలరు యొక్క లైసెన్సు స స్పెండ్ లేదా రద్దు చేయడంతో పాటు అత్యవసర సరుకుల చట్టం`1955 సెక్షన్ ‘7’ ప్రకారం జరిమానాకు కూడా వీరు అర్హులు అవుదురు.
కావున రైతు సోదరులు పైన చెప్పిన చట్టాల పై అవగాహన కలిగి ఉంటూ పలు మోసాల నుండి జాగరూకులై ఉండాలని కోరడం జరుగుతుంది. అలాగే తప్పని సరిగా విత్తన డీలరు లైసెస్సు, స్టాకు బోర్డు, అమ్మకం రశీదు తీసుకోవడం, విత్తన లేబుల్ సరిచూసుకోవడం వల్ల విషయములపై దృష్టి సారించ వలసినదిగా కోరుతున్నాము.
డా.ఎ. శ్రీజన్, డా. కె. రాజేంద్రప్రసాద్, డా. బి. విద్యాధర్, డా. ఎమ్. బలరాం
వ్యవసాయ కళాశాల (పిజెటిఎస్ఎయు), వరంగల్, ఫోన్ : 9030517236
Also Read: Neem seed decoction :వేప గింజల కషాయం తయారు చేసే పద్ధతి