ఆరోగ్యం / జీవన విధానం

Jeera Health Benefits: శరీరానికి జీలకర్ర మేలు.!

1
Jeera Health Benefits
Jeera Health Benefits

Jeera Health Benefits: ఈ ఆధునిక జీవన శైలి వలన చాలా మంది సరైన ఆహారం తీసుకోకపోవడం వలన, పనిలో ఒత్తిడి వలన, సరిగ్గా విశ్రాంతి లేకపోవడం వలన అనారోగ్యానికి గురవుతున్నారు. ఇలాంటి సమయాల్లో కొన్ని జాగ్రత్తలు మరియు చిట్కాలు పాటిస్తే ఆరోగ్యవంతంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కేవలం మన వంటింట్లో రోజు వాడే వస్తువులలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. అలాంటి వాటిలో మన పోపుల డబ్బాలో దొరికే జీలకర్ర ఒకటి. దీనినే జీరా అని, ఆంగ్లంలో Cuminum Cyminum అని అంటారు. సాధారణంగా మనం చేసే అన్నీ వంటకాల్లో దీని వాడుతారు. ఆహారానికి ప్రత్యేకమైన రుచిని, సువాసనని ఇస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హిందు వివాహాలలో జీలకర్ర బెల్లం పెట్టుకోవడం అనేది ముఖ్యమైన తంతు. ఇప్పుడు దీని వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం!

Jeera Health Benefits

Jeera Health Benefits

Also Read: Homeopathy Treatment For Neem Trees: వేపకు హోమియో ట్రీట్మెంట్.!

1.జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది: మెదడుకు జీరా అనేది సరైన ఆహారం అని అంటారు. 3 గ్రాముల నల్ల జీలకర్ర పొడిని తేనెలో కలిపి ప్రతిరోజు ఉదయం తరుచుగా కొన్ని వారాలపాటు తీసుకోవడం వలన జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

2. మధుమేహాన్ని తగ్గిస్తుంది: ఒక టీస్పూన్ జీలకర పొడిని ఒక గ్లాసు నీటిలో కలిపి రోజుకు రెండుసార్లు చొప్పున తాగడం వలన శరీరంలో ని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

3. పైల్స్ సమస్యకు చెక్: ఒక టీస్పూన్ వేయించిన జీలకర్ర (జీరా) పొడిని ఒక గ్లాసు మజ్జిగలో కలిపి కొన్ని వారాలపాటు రోజుకు రెండుసార్లు తీసుకోవడం వలన ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

4. విరేచనాలను తగ్గిస్తుంది: ఒక టీస్పూన్ జీలకర్ర వేయించి పొడిగా చేసుకోవాలి. దీనిలో చిటికెడు అల్లం పొడి (శొంఠి), దాల్చిన చెక్క పొడి, నల్ల మిరియాల పొడి మరియు ఒక కప్పు పాలు వేసుకోవాలి. దీనిని రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకోవాలి.

5. కడుపు ఉబ్బరం: జీలకర్రపొడి, నల్ల మిరియాల పొడి మరియు అల్లం పొడి కలిపి కషాయాన్ని తయారు చేసి తరుచుగా రోజుకు రెండు సార్ల పాటు తీసుకోవడం వలన ప్రయోజనం ఉంటుంది.

6. జ్వరానికి చెక్ : 3గ్రా. జీరా, 1 గ్రా మారికా (నల్ల మిరియాలు) సరైన వంతు బెల్లంలో కలిసి రోజుకు రెండుసార్లు తినడం వలన విష జ్వరాల నుండి దూరంగా ఉండొచ్చు.

7. క్యాన్సర్ నివారిణిగా పనిచేస్తుంది: జీలకర్రను మన డైట్ లో తప్పకుండా చేర్చడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లను నివారించవచ్చు . రెగ్యులర్ గా జీరా వాటర్ త్రాగడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, స్టొమక్ క్యాన్సర్ మరియు లివర్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు. ఎందుకనగా దీనిలో ఉండే యాంటీ కార్సినోజిక్ లక్షణాలు చాలా గొప్పగా సహాయపడతాయి.

Also Read: Sulphur Deficiency in Plants: మొక్కల ఎదుగుదలలో సల్ఫర్ ప్రాముఖ్యత.!

Leave Your Comments

Zinc Deficiency in Crops: వివిధ పంటలలో జింక్ లోపం సవరణ.!

Previous article

Sulphur Deficiency in Plants: మొక్కల ఎదుగుదలలో సల్ఫర్ ప్రాముఖ్యత.!

Next article

You may also like