Prohibited Bt3 Cotton Seeds: హైదరాబాద్ లో నిషేదిత బీటీ 3 పత్తి విత్తనాలతో సంచరిస్తున్న కార్ మరియు డీసీఎంతో పాటు ముగ్గురు నిందితులను శంషాబాద్ ఎస్.ఓ.టీ బృందం అదుపులోకి తీసుకుంది. కార్ మరియు డీసీఎంను చెక్ చేయగా 3 వేల కిలోల నిషేదిత బీటీ 3 లేదా హెఛ్ టీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 80 లక్షలు ఉండవచ్చని అంచనా.
Also Read: Agriculture in British Era: బ్రిటిష్ వ్యవస్థలో వ్యవసాయం ఇలా ఉండేది.!
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ, గుంటూరు జిల్లా పాలపాడుకు చెందిన పి . వెంకటేశ్వర రావు ప్రస్తుతం మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థిర నివాసం ఉంటున్నారు. ఇతను 2020 నుండి ప్రభుత్వం ఆమోదించని, సాగుకు అనుమతించని బీటీ 3 పత్తి విత్తనాలను సాగు చేసి కర్ణాటకలోని సిద్దంపల్లి గ్రామ నివాసి సి.గంగారెడ్డికి ఉన్న జిన్నింగ్ మిల్లులో భద్రపరిచారు. అవి మల్లి సాగు కోసం చెన్నూరుకు తరలిస్తుండగా మెకాగూడ క్రాస్ రోడ్ వద్ద పట్టుబడ్డారు. ఈ విత్తనాలను కర్ణాటకకు చెందిన మాక్స్ యిల్డ్ అగ్రి బయో జెన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో పనిచేస్తున్న పాపిరెడ్డి గారి రమేష్ సప్లై చేసినట్లు విచారణలో వెల్లడైనది.
చాకిచక్యంతో వ్యవహరించి నకిలీ విత్తనాల గుట్టు రట్టు చేసిన శంషాబాద్ ఎస్.ఓ.టీ ఇన్స్పెక్టర్ కే.వెంకటరెడ్డి మరియు బృందం, వ్యవసాయాధికారి శ్వేతా గారిని పలువురు రైతులు అభినందించారు.
Also Read: Black Tea Unknown Facts: బ్లాక్ టీ గురించి మనకు తెలియని విషయాలు.!