Sugarcane Juice Benefits: వేసవి ఎండలకు ఎన్ని మంచినీళ్లు తాగినా దాహం తీరిదు. అలాంటప్పుడు చక్కెర ఎక్కువగా ఉన్న శీతల పానీయాలనో, పండ్ల రసాలనో తాగే బదులుగా నిమ్మ, అల్లంతో చేసిన సహజసిద్ధమైన చెరుకు రసం ఒకటి లేదా రెండు గ్లాసులు తాగితే ఆ మజా వేరు! ఒకపుడు రోడ్లకు పక్కన కదిలే స్కూటరుతో చెరుకు రసం తీసే బండ్లను ఆపి జ్యూస్ తీసి అమ్మేవారు.ఇది ఎండాకాలంలో జరిగేది కానీ ఈ మధ్య సంవత్సరం నిత్యం ఈ చెరుకు రసం బండ్లు పని చేస్తూనే ఉన్నాయి. దీని గురించి వారిని అడగ్గా కస్టమర్లు ఈ చెరుకు రసం బండ్లను బాగా ఆదరిస్తున్నారని వారు అన్నారు. అపుడే వచ్చిన ఆలోచన అసలు చెరుకు రసంతో మనకు వచ్చే లాభాలు ఏంటి అని ? అవి ఇపుడు చూద్దాం.దాహార్తి తీరడంతో పాటు చాలా తెలికగా ఉంటుంది. కేవలం దాహం తీరడమే కాదండోయ్, ఆర్గానిక్ చెరుకురసం తాగడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఎంటో మనం తెలుసుకుందాం!
Also Read: Amla juice health benefits:ఉసిరి రసం తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
* చెక్కర రసం తాగడం వలన పచ్చకామేర్లను దరి చేరనివ్వదు.
* కిడ్ని లోని ఫిల్టరేషన్ లో, పి.సి.టీ వద్ద ఉదజనిని సరిదిద్దుతుంది, కిడ్నీ లోపాలను సరిచేస్తుంది.
* క్యాన్సర్ రాకుండా పోరాడుతుంది.
* శరీరం అధిక బరువును అరికడుతుంది.
* ఋతువుల ఆధారంగా వచ్చే జలుబు, దగ్గు, తుమ్ము లను నివారిస్తుంది.
* మూత్రంలో సంబంధిత రోగాలు రాకుండా ఆపుతుంది.
* రక్తంలోని ప్లేట్ లేట్స్ కౌంట్ ను పెంచుతుంది.
* మొటిమలు మరియు ఇతర చర్మ రోగాలను అరికడుతుంది. చర్మం నిగనిగలాడుతుంది.
* దీనిలోని సుక్రోస్ త్వరగా అరిగి, శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. ఎండాకాలంలో తక్షణ ఉపశమనం అందిస్తుంది.
* శరీరం కండరాలను ధృడపరుస్తుంది. కాబట్టి ఆరోగ్యం బాగా లేకపోయినా, యాక్సిడెంట్లు అయి కోలుకుంటున్న పేషెంట్లకు ఇవి అందించడం మంచిది.
* వీర్య ఉత్పత్తిని పెంచుతుంది. లింగిక శక్తిని పెంచడంలో తోడ్పడుతుంది.
* జుట్టు రాలకుండా నివారిస్తుంది.
* వడదెబ్బ తగలకుండా నివారిస్తుంది. ఎండాకాలంలో ఎండ దెబ్బ తగలకుండా చూస్తుంది.
* స్తీలకు మరియు గర్భణీ స్తీలకు చక్కటి ఆరోగ్యాన్నిస్తుంది.
* నోటి దుర్వాసనను తగ్గిస్తుంది మరియు పంటి నొప్పి రాకుండా చేస్తుంది. నోటి పిప్పళ్లు ఆయె అవకాశం తగ్గిస్తుంది.
Also Read: Grape juice health benefits: ద్రాక్ష రసం తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు