చీడపీడల యాజమాన్యంమన వ్యవసాయం

Management of American Bollworm- పత్తిలో శనగ పచ్చ పురుగు ఇలా చేస్తే రాదు.

1
Management of American Bollworm
Management of American Bollworm

Management of American Bollworm: మొదట లార్వా ఆకులను తింటుంది తరువాత బోల్స్ మరియు గింజల్లోకి దాని తలను నెట్టి, మిగిలిన శరీరాన్ని బయట వదిలేసి రంధ్రాలు చేస్తుంది.ఈ రంధ్రాలు బోల్ యొక్క అడుగు భాగంలో పెద్దగా గుండ్రంగా ఉంటాయి.ఒక లార్వా 30-40 బోల్స్‌కు నష్టచేయగలదు. కాయ తొలుచు పురుగును పత్తి పంటలో నాలుగు విధాలుగా నియంత్రించవచ్చు.

Management of American Bollworm

Management of American Bollworm

Also Read: Banned Plant Protection Products Till2022: భారతదేశంలో నిషేధించబడిన పురుగుమందులు.!

1)సాంస్కృతిక పద్ధతి లో నియంత్రణ:

  • లోతుగా దున్నుకోవాలి కావున దాగిఉన్న ప్యూప లేదా గుడ్డు దశలు నాశనమవుతాయి.
  • పంట మార్పిడి చేయాలి మరియు రాటూనింగ్‌ను నివారించడం వలన చీడపీడల బెడద తగ్గుతుంది.
  •  తట్టుకునే రకాలను ఉపయోగించాలి.
  • టమాటా వంటి పంటలను ఎర పంటగా నాటుకోవాలి మరియు పురుగుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని నాశనం చేయాలి.
  • మొక్కజొన్న, కవ్ పీ వంటి పంటలను సరిహద్దులలో మరియు అడవి వంకాయ మరియు సెటారియా వంటి పంటలను అంతర పంటగా ఉపయోగించడం వల్ల తెగుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది.

2)యాంత్రిక పధ్ధతిలో నియంత్రణ:

  • బోల్ పక్వానికి రాగానే చేతితో 3 నుండి 4 పత్తిని ఏరుతారు.
  • ఎన్ని సార్లు ఏరాలి అనేది వివిధ రకాల మెచ్యూరిటీ అలవాటును బట్టి దాని సంఖ్య ఆధారపడి ఉంటుంది.
  •  దెబ్బతిన్న కాయ నుండి వచ్చిన పత్తిని నాణ్యమైన పత్తితో ఉంచకూడదు. తడి పత్తిని ఎప్పుడూ తీయకూడదు.
  • మంచు కురిసే రోజులలో పత్తిలో తేమను నివారించడానికి ఉదయం ఆలస్యంగా పత్తిని తీయాలి.

3)బయాలజికల్ పద్ధతిలో నియంత్రణ:

  • 45 రోజులు ఉన్న పంటలో 10-15 రోజుల వ్యవధిలో (6 విడుదలలు) వంటి ట్రైకోగ్రామా చిలోనిస్ లేదా ట్రైకోగ్రామా బ్రాసిలెనిస్ వంటి ఎగ్ పారాసటాయిడ్ ఒక హెక్టార్కు150,000 మరియు చిలోనస్ బ్లాక్‌బర్ని లేదా బ్రాకాన్ బ్రేవికోర్నిస్ లేదా కాంపోలేటిస్ క్లోరిడే వంటి లార్వా పారాసటాయిడ్లను పహెక్టారుకు 2000 పెద్ద లార్వాలను 15 రోజుల వ్యవధిలో విడుదల చేయాలి.
  • ప్యూపా పారాసిటోయిడ్స్ అయిన బ్రాకిమెరియా., రకాలను మరియు ప్రిడేటర్స్ అయిన క్రిసోపెర్లా జాస్ట్రోవియారాబికా లేదా స్కిమ్నస్ sp. లేదా యూలోఫిడ్స్ లార్వాల విడుదల చేయడం వలన ఇవి బోల్ వార్మ్ సంఖ్యను అణిచివేస్తాయి.
  •  35 నుండి 60 రోజుల దశలో HaNPV ను 250 LE/ha పిచికారీ చేయాలి. 5% వేప గింజల సారం (NSKE) ఉపయోగించవచ్చు.

4)రసాయన పద్ధతిలో నియంత్రణా విధానం:

  • కొన్ని పురుగుమందులు తెగులకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అవి కొన్ని తెలుసుకుందాం. క్వినాల్ఫాస్ 25 EC 2.0 lit/ha; లేదా క్లోర్‌పైరిఫాస్ 20 EC @ 2 లీటర్లు/హె; లేదా సైపర్‌మెత్రిన్ 10 EC 600-800 ml/ha లేదా ట్రైజోఫోస్ 40 EC @ 1.5 లీటర్/హెక్టార్ కు పిచికారి చేయాలి.

Also Read: National Honey Mission: నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్

Leave Your Comments

Cotton American Bollworm: పత్తి పంటలో శనగ పచ్చ పురుగును ఇలా గుర్తించండి.!

Previous article

Types of Castor Oil: ఆముదం నూనె రకాలు

Next article

You may also like