నేలల పరిరక్షణ

Soil Health Action Plan 2021-22: నేల ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్రం యాక్షన్ ప్లాన్.!

1
Soil Health Action Plan 2021-22
Soil Health Action Plan 2021-22

Soil Health Action Plan 2021-22: Soil Health Management And Soil Health Card  పథకాలను నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ కింద INM డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ & కోఆపరేషన్, భారత ప్రభుత్వం సుస్థిర వ్యవసాయం కోసం అమలు చేయబడింది. ఈ రెండు కేంద్ర ప్రాయోజిత పథకాలు అన్నింటికీ సంక్షేమ పథకాలు ఉన్నట్లే, నేల సంరక్షణకు కూడా కొన్ని పథకాలు ఉన్నాయి. ఇవి అమలు చేయడానికి దిశా నిర్దేశాలనే ఆక్షన్ ప్లాన్ అంటారు. నెల బాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆక్షన్ ప్లాన్ చూద్దాం.

Soil Health Card

Soil Health Card

Also Read: Banned Pesticides 2021-22: దేశంలో ఈ పురుగు మందులు ఇక కనుమరుగు.!

ఈ రెండు పథకాల కోసం భారత ప్రభుత్వం ఆక్షన్ ప్లాన్ 2021-22
1. కొత్త సాయిల్ టెస్టింగ్ లేబొరేటరీస్ (STLs) మరియు మొబైల్ సాయిల్ టెస్టింగ్‌లను ఏర్పాటు చేయడం.
2. స్థూల పోషకాలు మరియు సూక్ష్మ పోషకాల విశ్లేషణ కోసం ప్రయోగశాలలు సాయిల్ టెస్టింగ్ లేబొరేటరీస్(MSTLలు) ఏర్పాటు చేయుట.
3. సూక్ష్మపోషక విశ్లేషణ కోసం ఇప్పటికే ఉన్న రాష్ట్ర సాయిల్ టెస్టింగ్ లేబొరేటరీస్ బలోపేతం చేయడం.
4. సాయిల్ టెస్టింగ్ లేబొరేటరీస్ లో సిబ్బంది/అధికారులు/రైతులకు క్షేత్ర ప్రదర్శన/వర్క్‌షాప్ మొదలైనవి చేసి శిక్షణ ద్వారా సామర్థ్యం పెంపుదల చేయడం.
5. గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ మరియు ICAR పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా నేల జిల్లా డిజిటల్ మట్టి పటాల తయారీకి శ్రీకారం చుట్టారు.
6. రాష్ట్ర ప్రభుత్వ క్షేత్ర స్థాయి అధికారులకు పోర్టబుల్ సాయిల్ టెస్టింగ్ కిట్‌లను అందించడం.
7. సూక్ష్మపోషకాలపై ప్రచారం మరియు పంపిణీ.
8. ఎరువుల నాణ్యత నియంత్రణ ప్రయోగశాలలను బలోపేతం చేయడం.
9. రాష్ట్రాల వారీగా కొత్త ఎరువుల నాణ్యత నియంత్రణ ప్రయోగశాలల ఏర్పాటు చేయుట.

2021-22 ఆక్షన్ ప్లాన్ ప్రధాన లక్ష్యాలు:
1. భూసార పరీక్ష సౌకర్యాలను బలోపేతం చేయడం మరియు భూసార పరీక్ష ఆధారంగా రైతులకు ఎరువుల సిఫార్సులు అందించడం. తద్వారా నెలలో వేసే ఎరువుల మోతాదును తగ్గించి, ఎరువుల మీద ఖర్చును తగ్గించుట.
2. చౌడు నేలల పునరుద్ధరణ కోసం మట్టి సవరణలను వినియోగాన్ని సులభతరం చేయడానికి మరియు ప్రోత్సహించి, పంట ఉత్పాదకతను మెరుగుపరచడం.
3. ఎరువుల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సూక్ష్మ పోషకాల వినియోగాన్ని ప్రోత్సహించడం.
4. ఎరువుల నాణ్యత నియంత్రణ సౌకర్యం కోసం ఇప్పటికే ఉన్న FCO ప్రయోగశాలలను బలోపేతం చేయడం ద్వారా ఎరువుల నాణ్యత నియంత్రణను సాధించడం.
5. రాష్ట్రంలోని జీవ సంబంధ పురుగుమందుల ప్రయోగశాలలు సమర్థవంతంగా అమలు చేయడం కోసం”ఎరువుల నియంత్రణ ఆర్డర్” అమలు చేయడం.

Also Read: Fungal Disease Management: విత్తన నిల్వలో బూజు వస్తుందా ? ఇలా చేయండి.!

Leave Your Comments

Banned Pesticides 2021-22: దేశంలో ఈ పురుగు మందులు ఇక కనుమరుగు.!

Previous article

National Honey Mission: నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్

Next article

You may also like