Winged Termite Roast: మనం ప్రతినిత్యం తీసుకునే ఆహాంలో చాలా వరకు సాగు చేసిన ఆహార ధాన్యాలు లేదా కూరగాయలు ఉంటాయి. మాంసాహార ప్రియులు కొంత వ్యత్యాసం తో చికెన్, మటన్, చాపలు తింటుంటారు. కానీ ఎంత మంది పురుగులను తమ ప్లేట్లలో చూడాలని అనుకుంటారు ? కానీ తెలంగాణాలోని కొన్ని చోట్ల ప్రజలు రెగ్యులర్ ఆహారానికి భిన్నంగా ఉసుర్లను (రెక్కల చెదలు) తింటుంటారు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న తినడానికి బాగుంటుంది అంటున్నారు ఉసుర్లను తినే ప్రజలు.

Winged Termite Roast
సాధారణంగా తొలకరి సమయంలో చేద పురుగు యొక్క రెక్కల పురుగులు సంయోగం కోసం భూమి నుండి బయటకు వచ్చి ఎగురుతాయి. ఆ సమయంలో అవి కుప్పలుగా కనిపించడం ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న కూడా వాటి సంతతి పెరుగుదలకు ఈ “నపోటియల్ ఫ్లయిట్ “ తప్పని సరి. ఇలా ఎగరకపోతే అవి సంపర్కం చేసుకోలేవు. సంయోగం జరిగిన తరువాత రెక్కల పురుగుల రెక్కలు శరీరం నుండి వెరవుతాయి. శరీరం మాత్రం మళ్ళీ భూమి లోపలకు పోయి అక్కడ గుడ్లను పెట్టుతుంది.
Also Read: 9 ఏళ్ల పిల్లాడు తోటపని ద్వారా నెలకు వేల రూపాయలు సంపాదిస్తున్నాడు

Termities
ఇవి గాలిలొ ఎగిరినపుడు పెద్ద పరదాలు లేదా చీరలలో పట్టి ఒక దగ్గర కుప్ప వేస్తారు. ఈ కుప్పలో ఉన్న ఉసుర్లు చనిపోయాక వీటిని ఒక పెద్ద గంజులో వేసి వాటి మీద నూనె పోస్తారు. ఆ వేడికి ఉసూర్లు వేగుతాయి. పూర్తిగా వేగిన ఉసుర్లు రసభరితంగా ఉండటమే గాక ఒక రకమైన రుచిని కలిగి ఉంటాయి. ఇలా వేయించిన ఉసూర్లను చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ ఇష్టంతో తింటారు. ఇవి బంజారా తండాలలో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంటాయి.
ఇవి తినడం వలన మనిషి శరీరానికి మాంసకృత్తులతో పాటు పిండి పదార్థాలు అందుతాయని ఆహార శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సంపర్కానికి ముందు తినడం కన్నా సంపర్కం అయిన తరువాత తల్లి పురుగును తినడం ఉత్తమం అని ప్రపంచ ఆహార సంస్థ చెపుతుంది. ఇది భారత దేశం లో కన్నా థాయిలాండ్ లో ఎక్కువ ప్రసిద్ది.
Also Read: DSR యంత్రం అంటే ఏమిటి