Wood Apple Cultivation: భారత దేశంలో పండ్లకు మంచి ఆదరణ ఎపుడు ఉంటుంది. మన దేశంలో వైవిధ్యమైన పండ్ల సాగు జరుగుతుంది. అందులో మామిడి, నిమ్మ, అరటి వంటివే కాకుండా వెలగ పండు సాగు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తుంది. ఈ పండును వినాయక చవితిలో నైవేద్యంగా మాత్రమే చాలా మందికి తెలుసు కానీ దీని పోషక విలువలు మానవాళికి చాలా ఉపయోగపడుతాయి.ఈ చెట్టు దాదాపు భారతదేశంలో ఏ వాతావరణ పరిస్థితులలో అయినా పెరుగుతుంది. ఎలాంటి భూములలో అయినా పెరుగుతుంది.దీనికి ప్రత్యేకమైన యాజమాన్య పద్ధతులు కూడా ఉండవు. మన దేశంలో ఈ పండును వాణిజ్య అవసరాలకు పండియడం లేదు, కానీ దీని ఆకులలో, పండ్లలో గల ఔషధ గుణాల వలన సాగు విస్తీర్ణం పెంచడం కొరకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఎంతగానో ప్రయత్నిస్తుంది.
వెలగ పండును శాస్త్రీయంగా లిమోనియా అసిడిసిమ అంటారు. ఆంగ్లంలో దీనిని వుడ్ ఆపిల్ అంటారు. ఇది మొండి మొక్క.నీరు తక్కువ ఉన్న ప్రాంతాలలో కూడా ఆశాజనక దిగుబడులు ఇవ్వగలదు. దాదాపు అన్ని ప్రాంతాలలో, అన్ని నెలల్లో పెరిగే స్వభావం ఉంటుంది. చల్క నెల, వెచ్చటి ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో అధిక దిగుబడిని ఇస్తుంది.దీనిని విత్తనం ద్వారా పెంచిన, 15 సంవత్సరాల వరకు దిగుబడిని ఇవ్వదు. వేరు కత్తెరింపులు, గ్రాఫ్టింగ్ చేసిన యెడల త్వరగా 6 సంవత్సరాల వయస్సులో పుష్పిస్తుంది. విత్తనాల ద్వారా ప్రవర్తనం చేస్తే 10*10 మీటర్లు,వేరు కత్తెరింపులు ఐతే 8*8 మీటర్ల దూరం పాటించి జులై నుండి ఆగష్టు చివరి వరకు గుంతలలో నాటుకోవాలి. నాటిన వెంటనే ఒక తేలికపాటి నీటి తడి అందించడం వలన త్వరగా ఏనుకుంటుంది.
Also Read: టమాట నాటేటప్పుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వివిధ ఉద్యాన పంటలలో మంచి ఎదుగుదలకు కొమ్మ కత్తిరింపులు చేయడం అవసరం, కానీ దీనికి అవసరం లేదు. కాకపోతే వ్యాధులు సోకిన కొమ్మలను, ఎండిపోయిన కొమ్మలను తీసివేయడం వలన చెట్టుకు మంచి ఆకృతి రావడమే గాకా ఆరోగ్యంగా ఉంటుంది. చెదలు నివారణకు మాత్రం క్లోరిపైరిఫోస్ 50 ఈ .సి నెలలో చెట్టుమొదట తడపాలి. నీటి యాజమాన్యం డ్రిప్ ద్వారా చేసుకోవడం వలన మంచి ఉత్పర్దకత సాధించినట్టు పరిశోధనలు చెప్తున్నాయి. వీలుపడని రైతులు గుండ్రని పాదులు తీసుకున్న సరిపోతుంది. వర్షాకాలం లో మురుగు నీరు పోయే వసతి తప్పని సరిగా కల్పించాలి. నాటే ముందు బాగా చివికిన పశువుల పేద వేసుకోవాలి. మట్టి పరీక్షను బట్టి దుక్కిలో భాస్వరం మరియు నత్రజని, తరువాత పై పాటుగా నత్రజనిని, పోటాష్ పుష్పించే దశలో వేసుకోవాలి. వేప, కరివేప, మునగ చెట్లను దూరం ఉంచాలి. రెండు దగ్గర ఉన్న యెడల ఆకు తిను పురుగు ఉదృతి అధికమవును.
ఈ చెట్లు దాదాపు 5-8 సంవత్సరాలు దిగుబడిని మొదలు పెట్టవు కావున ఆ కాలంలో అంతరపంటగా పప్పు జాతి పంటలు, ఆకు కూరలు సాగు చేసిన లాభాలు పొందవచ్చు. పండు పైభాగం ముదురు ఆకుపచ్చ రంగుకు, లోపలి గుజ్జు పసుపు రంగుకు మారినపుడు కొత్త ప్రారంభించాలి.మొక్కలు నాటిది 12 సంవత్సరాల తరువాత 300-350 పండ్లు ఒక చెట్టుకి లేదా (30-35 టన్నులు ) హెక్టార్ నుండి పొందవచ్చు. అదే వేరు కత్తెరింపుల ద్వారా 10 సంవత్సరాల తరువాత ఒక చెట్టుకి 160-180 పండ్లు లేదా హెక్టారుకు 22-25 టన్నుల దిగుబడి సాధించవచ్చు.
Also Read: తక్కువ సమయంలో అధిక దిగుబడి సాధిస్తున్న రైతు