వార్తలు

Importance of Gypsum Bed: సమస్యాత్మక సాగునీటి యాజమాన్యంలో జిప్సం బెడ్‌ ప్రాముఖ్యత

1
Importance of gypsum bed in problematic irrigation Practices
Importance of gypsum bed in problematic irrigation Practices

Importance of Gypsum Bed: వర్షాధార వ్యవసాయంలో శుష్క మరియు అర్థ శుష్క ప్రాంతాలలో భూగర్భజలాలకి ఎంతో ప్రాధాన్యత ఉంది. మనరాష్ట్రంలో చాలా జిల్లాలలో వ్యవసాయానికి భూగర్భ జలాల వినియోగం రోజు రోజుకీ పెరుగుతూ ఉంది. పైర్ల దిగుబడి నేల సారంతో పాటుగా నాన్యత కలిగిన సాగునీటి పై ఎంతగానో ఆధార పడుతుంది, నేల ఆరోగ్యంగా ఉండటానికి, నేలలో జీవరాశుల మనుగడకు, పైరు పోషకాలను సరిగా వినియోగించుకోవడానికి, పెరుగుదలకు, దిగుబడికి సాగు నీటి నాన్యత ఎంతో ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా భూగర్భ జలాల నాన్యత ఖచ్చితంగా తెలుసుకుని వినియోగించటం ఎంతో అవసరం.

Importance of gypsum bed in problematic irrigation Practices

Importance of gypsum bed in problematic irrigation Practices

భూగర్భ జలాల నాణ్యత ఎక్కువగా క్షారత్వం వలన తగ్గుతూ ఉంటుంది. అలాంటి నీరు వ్యవసాయానికి వాడినపుడు అందులోని ఎక్కువ శాతంలోని సోడియం నేల ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా పైరు పెరుగుదలకు, దిగుబడికి అవరోధంగా తయారౌతుంది కావున, క్షార తీవ్రతను బట్టి ఆ నీటిని వ్యవసాయానికి వినియోగించాలంటే ముందుగా జిప్సం బెడ్‌ లను ఏర్పాటు చేసుకుని దాని ఈ ద్వారా ఈ క్షార జలాన్ని పారించి పైరుకు వినియూగించినపుడు సాగు నీటిలోని వివిధ హాని కార లవనాలను జిప్సం లోని కాల్షియం సల్పెట్‌ తొలగించి నీటి నాణ్యతను ఈ క్రింద సూచించిన పట్టికలో మాదిరిగా పెంచుతుంది.

పట్టిక: క్షార జల నాణ్యత జిప్సం బెడ్‌ల పైన పారించినప్పుడు మరియు పారించనప్పుడు

క్షార జల ధర్మాలు           జిప్సం బెడ్‌లో              జిప్సం బెడ్‌లో
                                   పారించినప్పుడు            పారించనప్పుడు
కరెంట్‌ ప్రవాహం              1.17                           1.29
Ca+2                           3.75                           8.97
Mg+2                          0.72                           0.81
Na+                            21.81                         21.85
CO3-2 +HCO3-            12.94                         13.35
Cl-                              2.63                            2.71
RSC                            8.47                            3.57
SAR                            14.59                          9.88

Also Read: కుసుమ పంటలో నీటి యాజమాన్య పద్ధతులు

జిప్సం బెడ్‌ను ఏర్పాటుచేసుకునే విధానం:
జిప్సం బెడ్‌ అనునది ఒక కాంక్రీట్‌ తొట్టి , ఇది 1 మీ. పొడవు %శ% 1మీ. వెడల్పు %శ% 1.2 మీ ఎత్తు కొలతలు కలిగి ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. తొట్టి క్రింది భాగం నుంచి 10 సెం.మీ. ఎత్తులో ఇనుప కడ్డీలు (10మి.మీ.సైజు) 20 సెం.మీ. ఎడమతో జల్లెడలాగా ఉండి 2 మి.మీ. రంద్రాలు కలిగిన వైర్‌ మెష్‌ కు అధారంగా ఏర్పాటు చేసుకోవాలి ఇవి జిప్సం ముక్కలను పట్టి ఉంచుతాయి. గొట్టపు పైపులో నుంచి నీరు దూకటానికి 0.3 మీ. పొడవు, 1 మీ. వెడల్పు 1.5 మీ.ఎత్తుగా ఉండే ద్వారం ఏర్పాటు చేసుకోవాలి. ఇది 2.5 అంగుళాల నీరును గొట్టపు పైపునుంచి దూకే వీలుగా ఉంటుంది. (పటంలో చూపిన లాగా).

అలాగే తోత్తికి ఒక వైపున నీరు బయటకు పోవుటకు మార్గం ఏర్పాటు చేసుకుని దానిని పొలంలోని కాలువకు కలుపుకోవాలి. ఏర్పాటు చేసుకున్నా ఇనుపకడ్డీల వైర్‌ మెష్‌ పైన, తొట్టి పై బాగానికి 60 సెం.మీ. లోతు వరకూ జిప్సం ముక్కలను నింపుకోవాలి. గొట్టపు పైపునుంచి క్షార జాలం తొట్టి ద్వారంలో దూకి జిప్సం ముక్కల ద్వారా ప్రయాణించి సారి సమానంగా బ్యాటకు ఏర్పాటుచేసుకున్న అమరిక ద్వారా పొలంలోని కాలువలోనికి వస్తుంది. ఈ విధంగా ప్రయాణించే టపుడు క్షార జలం జిప్సంతో రసాయినిక చర్యద్వారా లవన సాంద్రతను, క్షార తీవ్రతను తగ్గించుకుని నాణ్యతను పెంచుకుని (పట్టికలో గమనించగలరు) పైరుకు వినియోగ పడుతుంది. జిప్సం బెడ్‌ ద్వారా పారించినపుడు సుమారు 5-6 మి.మోల్‌ క్షారత తగ్గే అవకాశం ఉంది.

జిప్సం బెడ్‌ వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

1. జిప్సంను నింపే విధానం: జిప్సంను ఎంత ఎత్తు వరకు నింపాలి అనేది నీటిలో జిప్సం కరిగిన తరువాత ఆ నీటిని పరీక్షించి ఆ నీటిలో లవణ సాంద్రత మరియు క్షారత పైరుకు సురక్షిత పరిమితి కన్నా ఎక్కువగా ఉంటే జిప్సంను ఇంకా ఎక్కువ ఎత్తు వరకు నింపుకోవాలి.

2. గొట్టపు పైపు నుంచి దూకే నీటి వేగం: గొట్టపు పైపు నుంచి నీరు దూకే వేగం జిప్సం కరిగే వేగం పైన ప్రభావాన్ని చూపిస్తుంది. వేగం తక్కువగా ఉంటే జిప్సం బాగా ఎక్కువగా కరిగి రసాయనిక చర్య ఎక్కువగా ఉంటుంది, వేగం ఎక్కువగా ఉన్నప్పుడు జిప్సం తక్కువగా కరిగి రసాయనిక చర్య తక్కువగా ఉంటుంది.
3. జిప్సం ముక్కల సైజు : సుమారు 6 సెం.మీ. సైజు ఉన్న జిప్సం ముక్కలను జిప్సం బెడ్‌లో నింపుకోవటానికి ఎక్కువగా వాడుకోవచ్చు. జిప్సం ముక్కల సైజు పెరిగితే జిప్సం తక్కువగా కరిగి తక్కువ రసాయన చర్య జరుగుతుంది.

డా.పి.వెంకట సుబ్బయ్య, శాస్త్రవేత్త (మృత్తిక శాస్త్రం) మరియు డా. కె.అనీమృదుల, సీనియర్‌ శాస్త్రవేత్త
ఉప్పునీటి పరిశోధనా స్థానం, బాపట్ల.

Also Read:  పొడి పద్ధతిలో వరి సాగు

Leave Your Comments

Fertilizer Application in Flax: అవిసె సాగులో ఎరువుల యాజమాన్యం

Previous article

Pest Control Techniques: యాసంగి ఆరుతడి పంటలలో లద్దె పురుగులు యాజమాన్యం

Next article

You may also like