Kommukonam Fish: చేప దాడి చేయడంతో మత్స్యకారుడు మృతి చెందాడు. వినడానికి కొంత ఆశ్చర్యంగానూ, వింతగానూ ఉన్నప్పటికీ.. సముద్రం సాక్షిగా ఇది నిజం. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన ఓ మత్స్యకారుడు భారీ చేప చేసిన దాడిలో మృత్యువాత పడ్డాడు. చేప కొమ్ముకు ఉన్న విషం శరీరంలోకి ప్రవేశించడంతో మత్స్యకారుడు జోగన్న మృతి చెందాడు. అతని వయసు 45 సంవత్సరాలు. మత్స్యకారుడి జోగన్న మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వివరాలలోకి వెళితే..
విశాఖ జిల్లా ముత్యాలమ్మ పాలెంకు చెందిన ఐదుగురు మత్స్యకారులు సంప్రదాయ పడవలపై వేటకు వెళ్లారు. తీరం నుంచి సుమారు 8 కిలోమీటర్ల వరకు వెళ్లి అక్కడ చేపల కోసం వలలు వేశారు. మరుసటి రోజు వలలో చేపలు పడ్డాయి. బరువుగా ఉండటంతో పడవులో నుంచి వలని పైకి లాగలేకపోయారు మత్స్యకారులు. దీంతో వల చిక్కుకుందేమోనని జోగన్న అనే మత్స్యకారుడు పడవ నుంచి కిందకు దిగే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఒక భారీ చేప జోగన్నపై బలంగా దాడి చేసింది. ఛాతీపై బలమైన గాయం కావడంతో జోగన్న అక్కడికక్కడే మృతి చెందాడు.
Also Read: చేపల చెరువు కలుపు మొక్కల యజమాన్యము
పదునైన కత్తులు లాంటి కొమ్ములు కలిగి ఉండే కొమ్ము కోనాం చేపలకు సాధారణంగా దాడి చేసే గుణం ఉంటుందని వేటకు వెళ్లిన మరో మత్స్యకారుడు గంగన్న తెలిపాడు. అయితే ఈ రకం చేప వలకు దొరకడం చాలా కష్టమని, ఒకవేళ దొరికినా వలను చీల్చుకునే సామర్ధ్యం ఆ చేపకు ఉందని గంగన్న చెప్తున్నాడు.
కొమ్ము కోనాం చేపలు ఒక్కొక్కటి దాదాపుగా 200 కిలోలు ఉంటాయి. ఇవి నీళ్లలో గుంపులుగా తిరుగుతాయి. ఒక్కో సమయంలో ఒకేసారి ఎక్కువ చేపలు వలకు చిక్కుతాయని ఆంధ్ర యూనివర్సిటీ జువాలజీ విభాగం ప్రొఫెసర్ మంజులత తెలిపారు. తమకు ప్రమాదం ఉందని చేపలు భావిస్తే మనుషులపైన దాడి చేస్తాయని ఆమె అన్నారు. టూనా చేప తర్వాత అంతే డిమాండ్ ఉన్న చేప కొమ్ము కోనాం చేప మాత్రమే. దీన్ని విదేశాలకు ఎక్కువగా ఎగుమతి చేస్తుంటారు. అయితే ఈ చేపకు ఎంత డిమాండ్ ఉందో అంతే ప్రమాదం కూడా ఉందంటున్నారు ప్రొఫెసర్ మంజులత.
Also Read: కోరమేను చేపల పెంపకం
ఫిబ్రవరి మాస పత్రికను మీరు చదవాలని అనుకునేవారు ఈ క్రింది లింక్ పై క్లిక్ చెయ్యండి.