ఆరోగ్యం / జీవన విధానం

FSSAI : కల్తీ కూరగాయలను ఇలా గుర్తించడం- ఎఫ్ఎస్ఎస్ఏఐ

2
Vegetables Are Adulterated

FSSAI: కాసుల కక్కుర్తితో కొందరు వ్యాపారులు నిత్యావసర సరుకులను కూడా కల్తీ చేస్తున్నారు. తాగే నీరు కల్తీ, తినే తిండి కల్తీ, పీల్చే గాలి కల్తీ ఇలా మనిషి వినియోగించే అన్నిట్లోనూ కల్తీ అనే మహమ్మారి సగభాగమైపోయింది. ఇది వినియోగదారుల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. అయితే అన్ని ఆహార పదార్థాలు కల్తీ బారిన పడుతున్న నేపథ్యంలో వాటిని కొనే ముందు జాగ్రత్తగా పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Vegetables

కరోనా నేపథ్యంలో అందరిలోనూ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. దీంతో ఆరోగ్యానికి మేలు చేసే ఆకు కూరలు ఆహారంలో తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే నిత్యం మనం తీసుకునే ఆకుపచ్చ కూరగాయలను కూడా కొందరు వ్యాపారాలు కల్తీ చేస్తున్నారు. మీరు తీసుకొనే కూరగాయలు నిజమైనవా, కల్తీవా అనేది తెలుసుకోవాలంటే భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ(ఎఫ్ఎస్ఎస్ఏఐ) కొన్ని టిప్స్ షేర్ చేసింది. తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో కల్తీ ఆహార పదార్ధాలను ఎలా గుర్తించాలో వివరంగా తెలిపింది.

 Adulterated And Un Adulterated Green Peas

Adulterated And Un Adulterated Green Peas

Also Read: కూరగాయల పంటలలో ఖచ్చితమైన వ్యవసాయ సాంకేతికతలు

కూరగాయల్లో మలకైట్ గ్రీన్:

మలకైట్ గ్రీన్ అనేది ఒక టెక్స్‌టైల్ డై. దీన్ని వస్త్ర పరిశ్రమలో రంగులు అద్దేందుకు ఉపగిస్తారు. అయితే మలకైట్ ఆనవాళ్లు కూరగాయల్లో కనిపిస్తున్నాయి. మిరపకాయలు, బఠానీలు, బచ్చలి కూర వంటివి ఆకుపచ్చగా, ఆకర్షణనీయంగా కనిపించేలా దీన్ని వాడతారు. ఈ మలకైట్ గ్రీన్ అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

fssai

fssai

నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్​ఫర్మేషన్ ప్రకారం.. సమయం, ఉష్ణోగ్రత తదితర కారణాలను బట్టి ఈ మలకైట్గ్రీన్.. ప్రమాదకరంగా మారుతుంది. ఇది శరీరంలోకి వెళ్తే శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. పిండం సరిగా పెరగకపోవడం, క్రోమోజోములు దెబ్బతినడం వంటివి జరుగుతాయి. ఈ నేపథ్యంలో కల్తీపై అవగాహన కల్పించడానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ FSSAI ట్విట్టర్​ వేదికగా పలు సూచనలు చేసింది.

Vegetables Are Adulterated

Vegetables Are Adulterated

కూరగాయలు కల్తీగా ఉన్నాయో లేదో తనిఖీ చేయడం ఎలా?

1. నానబెట్టిన ద్రవ పారాఫిన్‌లో ముంచిన కాటన్ బాల్ తీసుకోండి

2. ఆకుపచ్చ కూరగాయలపై రుద్దండి

3. కాటన్ రంగు మారకపోతే కూరగాయలో కల్తీ లేదని నిర్ధారణ అవుతుంది.

4. కాటన్ ఆకుపచ్చగా మారితే కూరగాయలు కల్తీ అయ్యాయని తెలుసుకోండి.

Also Read: పండ్లు, కూరగాయలు తాజాగా ఉండాలంటే..తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Leave Your Comments

President Ram Nath Kovind: వ్యవసాయ ఎగుమతులు రూ.3 లక్షల కోట్లకు చేరుకున్నాయి: భారత రాష్ట్రపతి

Previous article

Economic Survey: వ్యవసాయ రంగంపై 2021-22 ఆర్ధిక సర్వే

Next article

You may also like