Healthy Cooking Oil: మార్కెట్లో రకరకాల వంట నూనెలు అందుబాటులో ఉంటాయి. ఆవనూనె, అవిసనునె, ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, వేరుశెనగ నూనె, కొబ్బరి నూనె, కనోలా, నువ్వుల నూనె ఇలా రకరకాల నూనెలు ఉన్నాయి. మరి ఈ నూనె రకాలలో ఆరోగ్యానికి మంచి చేసేది ఏంటి, హాని కలిగించేది ఏంటి అన్న ప్రశ్న అందరిలోనూ ఉంటుంది. అయితే దీనికి సమాధానం అంత ఈజీ కాదనే చెప్పాలి.
నూనెలో ఉండే కొవ్వులొ శాచురేటెడ్, మోనో శాచురేటెడ్ పోలి అన్ సాచురేటెడ్ రకాలు ఉంటాయి. జీర్ణం కానీ కొవ్వు శరీరంలో పేరుకుపోతుంది. ఇలాంటి కొవ్వు గుండె జబ్బులు, రక్త పోటు తదితర రోగాలకు కారణం అవుతుంది. రోజుకు మగవారు 30 గ్రాములు, స్త్రీలు 20 గ్రాములు మించి నూనెను తినకూడదని వైద్యనిపుణులు చెప్తున్నారు. నూనెలో ఉండే కొవ్వు ఫాటీ ఆమ్లాల చైన్లను ఏర్పరుస్తుంది. ఈ కణాలు సంతృప్త కొవ్వులు, అసంతృప్త కొవ్వులు కణాలతో కలిసి శరీర అవసరాలను తీరుస్తాయి. అయితే ఫాటీ ఆమ్లాలు ఎక్కువైతే అవి నేరుగా కాలేయంలోకి వెళ్తాయి. అలా జరగడం వలన రక్తలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె ఆరోగ్యానికి మంచిదని, ఇది సూపర్ ఫుడ్ అని, దీని వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి అవకాశం ఉండదని ప్రధానం వినిపిస్తున్న మాట. కానీ ఇది పూర్ పాయిజన్ అని అంటున్నారు హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చి చెప్పారు. కొబ్బరి నూనె మన శరీరంలో గుండెపోటుకు దారి తీసే తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ LDL మొత్తాన్ని పెంచుతుంది.
Also Read: వేరుశెనగ లో పోషక విలువలెన్నో.!
ఆలివ్ నూనె :
ఆలివ్ నూనె అధికంగా వాడటం వలన గుండె జబ్బుల సమస్యలు 5 నుంచి 7 శాతం తగ్గుతుందని హార్వెర్డ్ యూనివర్సిటీ 24 ఏళ్ళ పాటు చేసిన ఓ సర్వేలో తేలింది. ఆలివ్ నూనెలోని మోనో శాచురేటెడ్ ఆమ్లాలే దీనికి కారణం. ఆలివ్ మొక్కల్లోని విటమిన్లు, ఖనిజాలు ఇతర సూక్ష్మ పోషకాలు నూనెలో కలుస్తాయి. సాధారణంగా ఆలివ్ పండ్ల గుజ్జు నుంచి ఆలివ్ నూనె తీస్తారు. కడుపులో ఉండే బ్యాక్తీరియాను ఇది తొలగిస్తుందని చెప్తున్నారు పరిశోధకులు. మధ్యధరా సముద్ర తీరంలో ప్రజలు ఆలివ్ నూనెను విరివిగా వాడుతారు. అందుకే ఆ ప్రాంతపు ఆహారాన్ని అత్యంత పోషక విలువలున్న ఆహారంగా చెప్తారు.
భారత్ లో ప్రజలు ఆవనూనె, వేరుశెనగ, సన్ ఫ్లవర్, అవిసె, నువ్వుల నూనె లాంటి రకరకాల నూనెలను వాడుతారు. అయితే ఏ రకం నూనె అయినా సరే ఒకసారి వాడిన తర్వాత మిగిలిన నూనెను మళ్ళి మళ్ళీ వేడి చేసి వాడటం మంచిది కాదు. ఇక నూనె ఏదైనా తక్కువ పరిమాణంలో తీసుకుంటేనే మంచిది.
Also Read: పొద్దుతిరుగుడు లో నీటి యాజమాన్యం