ICAR IARI Technician Admit Card 2022: ICAR-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ టెక్నీషియన్ పోస్టుల కోసం పోటీ పరీక్షను నిర్వహించబోతోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ చివరి తేదీ నిన్న 20 జనవరి 2022తో ముగిసింది. అర్హత కలిగిన సాంకేతిక నిపుణుల కోసం అధికార యంత్రాంగం త్వరలో అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేస్తుందని భావిస్తున్నారు. కాగా.. ఈ పోస్టుల సంఖ్య 641 మరియు పరీక్ష కంప్యూటర్ ఆధారితంగా ఉంటుంది. వివరాలలోకి వెళితే..
ICAR – ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 641 టెక్నీషియన్ పోస్టుల కోసం పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌లను నేడు విడుదల చేయనుంది. 2022 జనవరి 25 నుండి ఫిబ్రవరి 05 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. ఇకపోతే ICAR-IARI రిక్రూట్మెంట్ డ్రైవ్ 2022 కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ తమ అడ్మిట్ కార్డ్‌లను అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Also Read: టాప్ 20 అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఇవే..
ICAR IARI అడ్మిట్ కార్డ్ 2022ని డౌన్లోడ్ చేయడం ఎలా?
* IARI అధికారిక వెబ్సైట్ అంటే iari.res.inకి లాగిన్ అవ్వండి.
* హోమ్ పేజీలో రిక్రూట్మెంట్ సెల్‌కి వెళ్లండి.
* హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ICAR IARI అడ్మిట్ కార్డ్ 2022 లింక్‌పై క్లిక్ చేయండి.
* కొత్త పేజిలోకి వెళ్లిన తర్వాత పేజీలో అందుబాటులో ఉన్న లింక్‌లో మీ లాగిన్ ఆధారాలను అందించాలి.
* మీరు మీ స్క్రీన్‌పై మీ ICAR IARI అడ్మిట్ కార్డ్ వివరాలు పొందుతారు.
మీకు ఎపుడైనా కార్డు అవసరం పడుతుంది అనుకుంటే ICAR IARI అడ్మిట్ కార్డ్ 2022ని డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకునే అవకాశం ఉంది.
* అభ్యర్థులు ICAR IARI అడ్మిట్ కార్డ్ 2022లోని అన్ని వివరాలలు సక్రమంగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకుంటే మరీ మంచిది. అందులో ఏదైనా వ్యత్యాసం ఉన్నట్లయితే దానిని వెంటనే పరీక్ష నిర్వహణ సంస్థకు తెలియజేయలి.
ICAR- IARI టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2022పరీక్షా వివరాలు:
కంప్యూటర్ ఆధారిత పరీక్షలో ఆబ్జెక్టివ్ టైప్ 100 ప్రశ్నలు 4 మల్టిపుల్ చాయిస్ సమాధానాలను కలిగి ఉంటాయి, వీటిలో అభ్యర్థి ఒక సరైన సమాధానాన్ని మాత్రమే ఎంచుకోవాలి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుందని మరియు ప్రతి తప్పు సమాధానానికి ¼ (0.25) మార్కు తగ్గించబడుతుందని అభ్యర్థులు గమనించాలి.
ICAR-IARI టెక్నీషియన్ల రిక్రూట్మెంట్ కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 641 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది.
ఎంపికైన అభ్యర్థులు ఒక సంవత్సరం ఉద్యోగంలో శిక్షణ పొందవలసి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు సంబంధిత సంస్థలు దీనిని అందిస్తాయి. ఒక సంవత్సరం శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత సంబంధిత ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఈ మేరకు సర్టిఫికేట్ అందిస్తారు.
ICAR-IARI రిక్రూట్మెంట్ 2022 ఖాళీల వివరాలు
జనరల్ – 286
SC- 93
ST- 68
OBC- 133
EWS- 61
Also Read: రైతుల కోసం మొబైల్ యాప్స్