Mango Fruit Covers: విశాఖపట్నం జిల్లాలో మామిడి 31,437 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. కానీ రైతు సోదరులు ఆశించిన విధంగా నాణ్యమైన పండ్లు మరియు దిగుబడులను సాధించలేకపోతున్నారు. ఎందుకంటే మామిడిలో కాయ అభివృద్ధి చెందే దశలో ఎక్కువగా నష్టపరుస్తుంది. దీనిలో ముఖ్యమైనది పండు ఈగ.

Mango
ఈ పండుఈగ పిల్ల పురుగులు గుజ్జును తిని పండ్లను కుళ్ళిపోయి రాలిపోయేలా చేస్తాయి. ఈ పురుగు ఆశించడం వల్ల కాయలు తినడానికి గాని, గుజ్జు రసం తీయడానికి గాని పనికిరాక ఎగుమతులకు కూడా ఉపయోగపడకుండా పోతాయి.
Also Read: ఫంగస్ నుండి మొక్కలను రక్షించడానికి ఈ స్ప్రేలను పిచికారీ చేయండి
కాబట్టి ఈ సమస్యను అధిగమించడానికి మామిడితోటలో కాయలు నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు ఈ బ్రౌన్ కవర్స్ తొడగాలి. మరలా ఆ కవర్సును 65 నుండి 75 రోజుల తర్వాత తీసివేయాలి. అప్పటికీ ఆ కాయలు ఎటువంటి మచ్చలు లేకుండా మరియు నిగనిగలాడే పసుపు రంగులో ఉంటాయి. ఎందుకంటే ఈ బ్రౌన్ కవర్స్ లోపల నల్లటి కోటింగ్ ఉండటం ద్వారా ఇది సూర్యరశ్మిని బాగా శోషించు కొనడం ద్వారా కాయ రంగు పసుపు రంగులోకి మారుతుంది.

Mango Fruit Protection Bags
అంతేకాకుండా మామిడికాయ పక్వత చెందటానికి హీట్ యూనిట్ 585 గంటలు అవసరం. కాబట్టి హీట్ యూనిట్ మాంగో బ్రౌన్ కవర్స్ ద్వారా లభిస్తాయి. కాబట్టి కాయ రంగు మరియు నాణ్యత పెరిగి ఈ మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. ఈ రకం పండ్లు ఇతర దేశాలకు కూడా ఎక్కువగా దిగుమతి కూడా చేసుకోవచ్చు. వీటి ధర మార్కెట్లో కిలోకి రూ. 80 నుండి 100 వరకు పలుకుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ మ్యాంగో ఫ్రూట్ కవర్ (టెక్నాలజీ) సాంకేతికత పరిజ్ఞానం వాడుకోవాలి. మరియు ఒక్కొక్క ఫ్రూట్ మ్యాంగో కవర్ 1.50 నుండి 2.00 రూపాయల వరకు ఉంటుంది.
సంప్రదించవలసిన వివరాలు 8639066690 కృషి విజ్ఞాన కేంద్రం, కొండెపూడి.
డా. ఎన్. సత్తిబాబు, డా. ఎన్. రాజ్‌కుమార్,
డా. వి. గౌరి మరియు డా. డి. ఉమామహేశ్వరరావు,
కృషి విజ్ఞాన కేంద్రం, కొండెపూడి.
Also Read: ఇంటి మొక్కల్లో స్టింక్ బగ్స్ – నివారణ చర్యలు
Leave Your Comments