వార్తలు

Farmers Success Stories: వ్యవసాయ వాతావరణ సేవలు – రైతుల విజయగాథలు

1
Weather Information Apps
Weather Information Apps
Farmers Success Stories: కృషి విజ్ఞాన కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం నందు 2020 సంవత్సరం నుంచి భారత వాతావరణ విభాగం, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి మరియు ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తముగా జిల్లా వ్యవసాయ వాతావరణ విభాగం నెలకొల్పడం జరిగింది.
armers Success Stories

armers Success Stories

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరియు జిల్లాలో గల ఐదు వ్యవసాయ సబ్‌ డివిజన్‌లకు ప్రతి మంగళ, శుక్రవారాల్లో రాబోయే 3 లేక 4 రోజులకు ముందస్తు వాతావరణ అంచనా వేసి, ఆయా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు మరియు సూచనలకు సంబంధించిన బులిటెన్‌ను రిజిస్టర్‌ చేసుకున్న  రైతుల మొబైల్‌ నెంబర్‌ కి వాట్సాప్‌ ద్వారా మరియు లఘు సందేశాల ద్వారా పంపించడం జరుగుతుంది. ఈ వాతావరణ ఆధారిత సలహాలు సూచనలను  వారి వ్యవసాయ కార్యక్రమ ప్రణాళికలో వినియోగించి లబ్ధి పొందిన రైతుల విజయ గాధలు…..
నా పేరు ధర్మరాజుల నాగభూషణం, హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీ, చుంచుపల్లి మండలం, కొత్తగూడెం జిల్లా, నాకు నాలుగు ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. నేను నాలుగు ఎకరాలు వరి పంట పండిస్తాను. నేను వాతావరణ విభాగం వారు అందించే సలహాలు సూచనల ఆధారంగా పురుగు మందుల పిచికారీ, నీరు పెట్టడం మరియు పంట కోత చేయడం జరిగింది తద్వారా నాకు ఎకరాకి నాలుగు వేల రూపాయల వరకు లబ్ధి చేకూరింది కావున రాగల రోజులలో కూడా ఈ సేవలను వినియోగించి వ్యవసాయ పనులు చేపడతాను అని తెలియజేస్తున్నాను.

Also Read:  వెల్లుల్లి హార్వెస్టింగ్ మెషిన్ ద్వారా డబ్బు మరియు సమయాన్ని ఆదా చేస్తుంది

నా పేరు జరుపుల మురళి,  చిట్టి రామవరం గ్రామం, కొత్తగూడెం మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేను సమగ్ర వ్యవసాయం చేస్తున్నాను. నేను కోళ్ల పెంపకంతో పాటుగా కూరగాయలు మరియు వ్యవసాయ పంటలు పండిస్తాను. అదేవిధంగా ఆరుతడి పంటలకు నీరు పెట్టడం, టమాటా, చిక్కుడు, మిరప, వంగ, దోస వంటి కూరగాయ పంటలను  కోసి సకాలములో మార్కెట్‌ కి తరలిస్తాను. వాతావరణ సేవలు ముందుగా తెలుసుకొని వ్యవసాయ పనులు చేపట్టుట వలన నాకు ఎకరాకి ఐదు నుంచి ఆరు వేల రూపాయల లబ్ధి చేకూరింది. కావున నా తోటి రైతులు కూడా ఈ సూచనలను పాటించాలని కోరుతున్నాను.
నా పేరు మూడ్‌ దేవుల, రామవరం గ్రామం, చుంచుపల్లి మండలం, కొత్తగూడెం జిల్లా. నేను వరి, జొన్న, మొక్కజొన్న, నువ్వులు పంటి  పంటలు వర్షాధారముగా పండిస్తుంటాను. వ్యవసాయ  వాతావరణ విభాగం వారు అందించే వాతావరణ సూచన ఆధారంగా పంటలను విత్తుకోవడం, అంతరసేధ్యం, ఎరువులు వేయుట, పురుగు మందుల పిచికారీ, పంట కోత, కల్లాలలో  పంటలను ఆరబెట్టడం వంటి పనులు చేస్తున్నాను,  తద్వారా నాకు, నాతోటి రైతుల కంటే అధిక దిగుబడులు వస్తున్నాయి, కావున ప్రతిఒక్కరూ ఈ సూచనలను పాటించవచ్చు.
నా పేరు తుంపూరు శివ, నిమ్మలగూడెం గ్రామం, కొత్తగూడెం జిల్లా నేను ట్రెల్లిస్‌ పద్ధతిలో టమాట మరియు జంట వరుసల పద్ధతిలో మిరప తోట పండిస్తున్నాను. నేను కృషి విజ్ఞాన కేంద్రం వారు పంపించే వాతావరణ సలహాలను అనుసరించి ఈ సంవత్సరం మిరప మీద వచ్చిన కొత్త రకం తామర పురుగుల నివారణకు సమగ్ర నివారణ చర్యలు సకాలములో చేపట్టాను, ముందస్తు వర్షసూచన అనుసరించి పురుగు మందులు పిచికారీ చేసేసాను తద్వారా మాకు ఎకరాకు 6`8 వేల లబ్ధి చేకూరింది. ఇందు మూలంగా వారికి నా ప్రత్యేక ధన్యవాధములు తెలుపుకుంటున్నాను.
కృషి విజ్ఞాన కేంద్రంలోని వ్యవసాయ వాతావరణ విభాగం వారు భద్రాద్రి జిల్లా రైతులకు డివిజన్‌ల వారిగా (అశ్వరావుపేట, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, ఇల్లందు) అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు సూచనలు బులెటిన్‌లను ఆంగ్ల మరియు ప్రాంతీయ భాషల్లో పొందడానికి రైతులు 9133051365 మరియు 9966814470 సంప్రదించి మొబైల్‌ నెంబర్‌ రిజిస్టర్‌ చేసుకుని, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం పంటను కాపాడుకుంటూ మంచి దిగుబడులు పొందగలరు.
యస్‌. వింద్య, ఎమ్‌. సుమన్‌, డా. వి. లక్ష్మీనారాయణమ్మ, డా. ఆర్‌. శ్రీనివాసరావు, డా. ఆర్‌. విశ్వతేజ్‌ మరియు బి. శివ, కృషి విజ్ఞాన కేంద్రం, భద్రాద్రి కొత్తగూడెం, ఫోన్‌ : 91330 51365
Leave Your Comments

Pruning Grapes: ద్రాక్షలో కత్తిరింపులతో లాభాలు

Previous article

Hydroponic Farming: హైడ్రోపోనిక్‌గా పెరగడానికి 3 అధిక-విలువైన కూరగాయల మొక్కలు

Next article

You may also like