వార్తలు

Agricultural Calendar: సర్వశుభాలను సమకూర్చే శుభకృత్‌ నామ సంవత్సర వ్యవసాయ పంచాంగం

0
Ugadi
Ugadi
Agricultural Calendar: చాంద్రమాన తెలుగు షష్టి సంవత్సరాల వరుస క్రమంలో వచ్చే ఈ సంవత్సరం పేరు శుభకృత్‌ నామ సంవత్సరం ది 2:4:2022న శనివారం వసంత ఋతువుతో ప్రారంభమయ్యే ఈ రోజునే తెలుగు వారందరూ ఉగాది పర్వదినంగా జరుపుకుంటారు. ఇదే తెలుగువారికి తొలిపండగ అయితే శనివారంతో మొదలయ్యే ఈ సంవత్సరానికి అధిపతి శనేశ్వరుడు
Agricultural Calendar

Agricultural Calendar

1 ‘‘శని’’ రాజగుట వలన దేశ భవిష్యత్‌ అస్తవ్యస్తంగా నుండును. ఆర్థిక పరిస్థితి కుంటుబడును. ఉభయ తెలుగు రాష్ట్రాలలో అభివృద్ధి లోపిస్తుంది. స్త్రీల ఆధిపత్యం అధికమగును. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో పంటలు ఓ మోస్తరుగా పండును. సమయానుకూలంగా వర్షాలు కురియును. రైతుల శ్రమకు తగిన ఫలితం దక్కదు. నల్ల ధాన్యములు విరివిగా పండును. నల్లరేగడి భూములు అధిక ఫలముల నిచ్చును పాడి పరిశ్రమ కొంత మెరుగుపడును.
2 మంత్రి ‘‘గురువు’’ అగుటవలన ఉభయ తెలుగు రాష్ట్రాలనాయకులు చాకచక్యంగా ప్రభుత్వాలను బలోపేతం చేసుకుంటారు. న్యాయపరమైన పరిపాలన కొరకు కృషి చేస్తారు. పంటలు బాగా పండుతాయి. ప్రజల్లో ఆధ్యాత్మికత పెరుగును. శనగలు పప్పు ధాన్యములు బాగా ఫలించి రైతులకు ఆనందం కలిగించును. ప్రజలకు, రైతులకు రాజకీయపరమైన లబ్ధి దొరుకును.
3 సైన్యాధిపతి ‘‘బుధుడు’’ అగుటవలన సస్యానుకూలమైన వర్షములు కురియును. పాడి పంటలు బాగా పండును. రైతులకు ఆర్థిక వనరులు చేకూరి మంచి ఫలితాలను పొందుతారు. తెలుగు ఉభయ రాష్ట్రాల్లో వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. రక్షణ శాఖ బలోపేత మౌతుంది. దేశ రక్షణ కొరకు అనేకమైన చర్యలు తీసుకుంటారు. పచ్చనైన ధాన్యం ఫలించి రైతులకు ఆనందం కలిగిస్తుంది.
4 సస్యాధిపతి ‘‘రవి’’ అగుటవలన మెట్ట, యర్రని భూములు విరివిగా పండును. ఎర్ర ధాన్యములు గోధుమ, మిర్చి, కందులు, ఉలవలు, వేరుశెనగ ఇత్యాది పంటలు అమితముగా పండును. అడవి ప్రదేశాలలో గల భూములు అధిక ఫలమునిచ్చును. వ్యవసాయదారులకు రెండు పంటలు కలసి వచ్చును. కంద దుంప, నూనె గింజలు, పండ్లు, కూరగాయ ధరలు హెచ్చుతగ్గులుగా ఉండును. వేరు, వేరు దినుసుల ధరలు మధ్యస్థముగా ఉండును . వ్యాపారస్తులకు తగిన లాభాలు చేకూరును. రైతులకు గిట్టుబాటు ధరలు సమకూరును.
5 ధాన్యాధిపతి ‘‘శుక్రుడు’’ అవ్వడంవలన మెట్ట మాగాణి భూములు బాగుగా పండును. అన్ని రకముల ధాన్యములు విరివిగా పండి రైతులకు లాభాలు చేకూరును. పాడి ఆశ్రమ వృద్ధి చెందును పశుగ్రాసం కొరత ఉండదు. వెన్న నెయ్యి ఇతర ధాతు వస్తువులు సంవృద్ధి గా ఉండును. వ్యవసాయ రంగము నందు అనేకమైన కొత్త మార్పులు వచ్చును. వ్యవసాయ పరిశోధనలు హెచ్చగును. వడ్లు ఇతర ధాన్యములు పండ్లు, కూరగాయలు అధిక ఫలములనిచ్చును  పశుగ్రాసము కొరత ఉండదు పశువులకు కొత్త  వ్యాధులు సోకును. దేశంలో వింత వింత రోగాలు సంభవించును.
అర్ఘాధిపతి ‘‘బుధుడు’’ అవ్వడంవలన పంటలు విరివిగా పండి రైతులకు మేలు చేకూర్చును నిత్యావసర వస్తువుల ధరలు హెచ్చుతగ్గులు గా ఉండును. నెయ్యి, నూనె, బెల్లము, మిర్చి, ఉప్పు, వేరుశనగ, కాఫీ గింజల ధరలు ప్రజలకు అందుబాటులో ఉండును. నల్లరేగడి భూములు బాగుగా పండును. సస్యాను కూలమైన వర్షములు కురియును. వెండ, బంగారము మొదలగు లోహముల ధరలు సమాతరముగా ఉండును, పేపర్‌, నూలు,  సీసం మొదలగు వాటి ధరలు హెచ్చుతగ్గులుగా ఉండును. గృహ నిర్మాణ సామాగ్రి ధరలు నిలకడగా ఉండును. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగును ప్రజలు ప్రభుత్వ రుణముల నాశింతురు.
మేఘాధిపతి ‘‘బుధుడు’’ అవ్వడంవలన వర్షములు బాగాపడును. ఆకాశము మేఘావృతమై ఈదురు గాలులు సంభవించును. ఉరుములతో కూడిన వర్షములు కురియును. అక్కడక్కడ వడగండ్ల వర్షములు కురియును. బంగాళాఖాతంలో వాయుగుండములతో తుఫాను లేర్పడి అంటు రోగములు సంభవించును. ప్రజలకు కష్టనష్టములు కలిగి దేశంలో అనేక ఉపద్రవములు సంభవించును.
రసాధిపతి ‘‘కుజుడు’’ అవ్వడంవలన పంచదార, బెల్లం, తేనె, నెయ్యి, నూనె, నార, మత్తు పదార్థములు, మత్తు పానీయములు, నవధాన్యాలు,  నవరత్నములు, సీసము, ఖనిజములు, లక్క, బంగారము, పాలు, జీలకర్ర, సుగంధ ద్రవ్యముల ధరలు విపరీతంగా పెరుగును. ఎర్ర ధాన్యములు ఫలించును. ప్రజలు మత్తు పానీయములు అలవాటుపడురు. ప్రజయందు పట్టుదల జాతి వైషమ్యాలతో విరోధాలు సంభవించును. రోడ్లపై ప్రమాదాలు అధికమగును.
నీ రసాధిపతి ‘‘శని’’ అగుటవలన విష జంతువులు అధికమగును. వెండి, కంచు మొదలగులోహపు పాత్రల ధరలు పెరుగును. కిరసనాయిల్‌, పెట్రోల్‌, డీజిల్‌, చమురు ధరలు, ఉల్లి, వెల్లుల్లి, టమాటల ధరలు హెచ్చు తగ్గులుగా ఉండును. జంతు మాంసపు ధరలు నిలకడగా ఉండును. క్రిమి కీటకాల వలన విష జంతువుల వలన ప్రమాదా లేర్పడును దొంగల భయము కలుగును దేశంలో ప్రజలు భయాందోళనలు కలిగి ఉందురు.
పసుపాలకుడు బలరాముడుఅగుటవలన పాడి పరిశ్రమ లాభాలతో కొనసాగుతుంది పశుగ్రాసం కొరత ఉండదు.

Also Read:  బచ్చలికూర సాగు వివరాలు

మౌడ్యమి: 
శుక్ర మూఢమి16:9:2022 శుక్రవారం నుండి 1:12:2022 గురువారం వరకు ఉంటుంది.
ఈ సంవత్సరం గురుమూఢమి లేదు.
గ్రహణములు:
25:10:2022 మంగళవారంసూర్య గ్రహణం సంభవించును
8:11:2022 మంగళవారం చంద్రగ్రహణం సంభవించును
కర్తరి:
4:5:2022 బుధవారం నుండి 11:5:2022 బుధవారం వరకుచిన్న కర్తరి వుండి మరలా
11:5:2022 బుధవారం నుండి29:5:2023 ఆదివారం వరకు పెద్ద కర్తరి ఉండును
పుష్కరనిర్ణయం:
13:4:2022 బుధవారం నుండి 24:4:2022 వరకు ప్రణీత (ప్రాణహిత) నదీ పుష్కరములు వచ్చును.
సంవత్సరం1 కుంచ వర్షం కురియును 10 భాగములు సముద్రములయందు 8 భాగములు పర్వతముపై 2 భాగములు భూమి మీద వర్షించును.
ఆదాయం వ్యయములు పన్నెండు రాసులవారికి
నీతి న్యాయం సత్యం ధర్మం కృషి పట్టుదల ఓర్పు సహనం కలిగిన వారికి గ్రహదోషాలు అంటవు!
ఆచరించి చూడండి!
సర్వేజనా సుఖినో భవంతు
సమస్త సన్మంగళాని భవతు
కృషితో నాస్తి దుర్భిక్షం
                   ఆదాయం   వ్యయం   రాజ్య పూజ్యం     అవమానం
మేషం             14              14            3                 6
వృషభం            8               8             6                 6
మిధునం          11               5             2                 2
కర్కాటకం          5                5             5                 2
సింహం             8               14            1                 5
కన్యా               11                5             4                 5
తుల                 8                8             7                 5
వృశ్చికం           14              14             3                 1
ధనుస్సు            2                 8             6                 1
మకరం              5                 2             2                 4
కుంభం              5                 2             5                 4
మీనం                2                 8             1                 7
బ్రహ్మశ్రీ పెద్దోజు నాగేశ్వర సిద్ధాంతి, ఫోన్‌ : 9849628296
Leave Your Comments

Horticulture: బంగాళదుంపలు మరియు పండ్ల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌

Previous article

Summer Health Tips: కీర-కొత్తిమీర స్మూతీ ఆరోగ్య ప్రయోజనాలు

Next article

You may also like