PM Modi Asks Farmers to Participate in a Mega Natural Farming జీరో బడ్జెట్ ఫార్మింగ్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు చేపట్టాయి. డబ్బు అదా చేస్తూ అధిక దిగుబడిని పొందేవిధంగా ప్రభుత్వాలు అవగాహన సదస్సులు కూడా ఎర్పాటు చేస్తున్నాయి. డిసెంబర్ 16న సహజ వ్యవసాయం కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఈ మెగా కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయంలో మెళుకువలు గురించి జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు.అందుకు ప్రధాని నరేంద్ర మోడీ రైతులందర్నీ స్వయంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సేంద్రియ వ్యవసాయంపై అవగాహన పెంచుకోవాలని ప్రధాని సూచించారు. Mega Natural Farming
Zero Budget Farming జీరో-బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అనేది సాంప్రదాయ వ్యవసాయ విధానం. ఈ విధానం ద్వారా రైతులు అధిక డబ్బు వెచ్చించి రసాయన ఎరువులతో పంటలు పండించాల్సిన అవసరం లేదు. కిరణజన్య సంయోగక్రియ కోసం పంటలకు అవసరమైన 98 శాతం పోషకాలు కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్, నీరు మరియు సౌరశక్తి ప్రకృతి నుండి మనకు ఉచితంగా లభిస్తున్నాయి. కాగా.. ఇప్పటివరకు, 38.09 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 43.38 లక్షల మంది రైతులు సేంద్రీయ/సహజ పద్దతిలో సాగు చేస్తున్నారు. 2022-23 మరియు 2025-26 మధ్య వివిధ పథకాల కింద 7.3 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. PM Modi invites farmers
కాగా.. డిసెంబర్ 16న జరగాబోయే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాల్గొనాల్సి ఉంది. 2020-21లో రికార్డు స్థాయిలో రసాయన ఎరువుల వినియోగం మరియు గ్లోబల్ ధరల పెరుగుదల తర్వాత సబ్సిడీలో గణనీయమైన పెరుగుదల నేపథ్యంలో ఈ సదస్సు ప్రాముఖ్యతను సంతరించుకుంది. డిసెంబర్ 16న ఉదయం 11 గంటలకు సహజ వ్యవసాయంపై జరిగే సదస్సులో ప్రధాని పాల్గొని ప్రసంగిస్తారని, దూరదర్శన్‌లో లేదా సమీపంలోని కిసాన్ (కృషి) విజ్ఞాన కేంద్రంలో ప్రత్యక్షంగా వీక్షించాల్సిందిగా కేంద్ర వ్యవసాయ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ ట్వీట్ చేశారు. PM Narendra Modi