Long Special Cultivator: రైతులు వరి పంట పండించడానికి నాగలితో సుమారు రెండు నుంచి మూడు సార్లు దున్ను కోవాల్సి ఉంటుంది. పొలాన్ని మంచిగా దున్నితేనే మట్టి వదులుగా అవుతుంది. పొలం నీటిని పీల్చుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. రైతులు వరి పంటని వేసుకోవడానికి పొలాన్ని ట్రాక్టర్ కి కేజ్ వీల్స్ వేసుకొని, నాగలితో దున్నుతారు. సాధారణంగా నాగలి 6 అడుగుల పొడువు ఉంటుంది. ఈ నాగలితో దున్నడం ద్వారా పొలం అంచులు దున్నడం సరిగా రాదు. మళ్ళీ రైతులు చేతులతో పొలం అంచులో ఉన్న గడ్డిని తీయాల్సి వస్తుంది. ఈ సమస్యకి పరిష్కారంగా నగర్ కర్నూల్ జిల్లా రైతులు కొత్త నాగలిని వారి సొంతంగా తయారు చేసుకున్నారు.
ఈ కొత్త నాగలి 9-10 అడుగుల పొడవు ఉంటుంది. ట్రాక్టర్ కేజ్ వీల్స్ ఉన్నంత పొడవుగా ఈ నాగలి ఉంటుంది. ఇంత పొడవు ఉండటం వల్ల పొలం అంచుల వరకు సులువుగా దున్నుకోవచ్చు. రైతులకి మళ్ళీ పని ఉండదు పొలం అంచులు తీసుకోవడానికి. ఈ నాగలి వల్ల రైతులకి సమాయంతో పాటు ఖర్చు కూడా తగ్గుతుంది.
Also Read: Anjeer fruit Drying Process: అంజీర పండ్లని పాలీ హౌస్లో ఎలా ఆరపెట్టుకోవాలి.!
ఈ నాగలిని మనకి దగరలో ఉండే వెల్డడింగ్ వాళ్ళతో తయారు చేసుకోవచ్చు. ఈ నాగలిని నాగర్ కర్నూల్ జిల్లాలో దాదాపు 5-6 సంవత్సరాల నుంచి రైతులు వాడుతున్నారు. ఈ నాగలి వాడటం ద్వారా వరి పంట పండించుకునే రైతులకి పొలాన్ని మొదటి సారి దున్నడం చాలా సులువుగా మారింది.
ఈ నాగలి పొడువు కేజ్ వీల్స్ పొదువుకు సమానంగా ఉండటం ద్వారా పొలం దున్నే సమయంలో ఇంజిన్ రివర్స్ అయే ప్రమాదాలు కూడా తగ్గాయి. ఇంజిన్ రివర్స్ అవ్వడం ద్వారా చాలా మంది ప్రాణాలు పోవడం చూస్తున్నాము. ఈ నాగలి వాడటం వాళ్ళ ఈ ఇంజిన్ రివర్స్ అవ్వడం జరగదు కాబ్బటి రైతులు ఎక్కువగా ఈ నాగలిని వాడటానికి ఇష్టపడుతున్నారు.
Also Read: Sugarcane Knots: చెరుకు గడలే విత్తనాలుగా వాడుకోవడం ఎలా..?