Soil Testing Importance: పైరుకి కావలసిన అన్ని రకాల పోషకాలు కొంత పరిమాణములో నేలలో సహజంగానే ఉంటాయి ఇది తయారై పైర్లకులభ్యం కావడం అనేది నేల భౌతిక రసాయనిక లక్షణాలు సూక్ష్మజీవుల చర్య వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది వీటిలో ఎంతో తేడాలు ఉంటే అవకాశం ఉంది. ఇవి ఎంత వరకు లభ్యమౌతునయో వేయదలిచిన పైరుకు ఎంత తక్కువ పడుతుందో నిర్దారించి ఎరువులు వాడాలి. పోషకాల సమతుల్యత పాటించడానికి రసాయనిక ఎరువులు సక్రమ వినియోగానికి భూసార పరీక్షల ఆవశ్యకత ఎంతైనా ఉంది. రైతు నేల యొక్క పోషక సామర్థ్యాన్ని తెలుసుకోవడం వలన ఏ నెలలో ఏ పంట వేస్తే బాగా పెరిగి మంచి దిగుబడులు వస్తాయో తెలుసుకోవచ్చు. వేసిన పంటకు నెలలో తగు నిష్పత్తిలో పోషకాలు లేనప్పుడు భూసార పరీక్షల ద్వారా తక్కువగా ఉన్న పోషకాలను మాత్రమే నెలకు అందించడం వలన మంచి దిగుబడులు సాధించ డమే కాక నేలకు అందించే పోషకాలు కూడా బాగా తగ్గుతుంది.
భూసారపరీక్షల్లో వివిధ దశలు:
- ప్రామాణిక మట్టి నమూనా సేకరణ
- పరీక్షలు ప్రయోగశాలలో పరీక్షలు
- ఫలితాల ఆధారంగా ఎరువుల సిఫారసులు సమస్యాత్మక నేలలు తగు సూచనలు
Also Read: Jhora Fish Farming: జోరా టెక్నిక్‌తో చేపల పెంపకం
ప్రామాణిక మట్టి నమూనా సేకరణ:
- మట్టి నమూనా భూమి విస్తీర్ణం బట్టి వాళ్ల ను బట్టి రంగును బట్టి సేకరించాల్సి ఉంటుంది ఒకటి నుండి ఐదు ఎకరాల భూమిని ప్రామాణికంగా తీసుకొని 10 నుండి 15 చోట్ల మట్టి నమూనాలు సేకరించాలి పొలంలో త్రిభుజాకారంలో 15 నుండి 20 సెంటీమీటర్ల వరకు తీసి పై నుండి కింది వరకు ఒక ఒక ఒక పక్కగా సేకరించాలి. ఆ విధంగా 10 నుండి 15 చోట్ల నుండి సేకరించిన మట్టిని చతుర్ భాగా పద్ధతిలో ఒక కిలో వచ్చే వరకు చేయాలి.
మట్టి నమూనాలను సేకరించడం లో మెళుకువలు:
- చెట్ల కింద, గట్ల పక్కన,కంచెలు దగ్గర, కాలిబాటల్లో నమూనాలు తియ్యకూడదు పశువుల ఎరువు,వర్మికంపోస్ట్నిలవయాఉన్న చోట నమూనాలు తియ్యకూడదు. చౌడు భూముల్లో నమూనాలు విడిగా తీయాలి.
- రసాయనిక ఎరువులు వేసిన 45 రోజుల లోపు నమూనాలు తియ్యకూడదు.
- నీరు నిల్వ ఉండే పల్లపు ప్రదేశం లో మట్టిని సేకరించరాదు.
- ఇప్పుడే పల్లపు స్థలంలో మట్టిని సేకరించి రాదు.
- పండ్ల తోటలు వేయవలసిన పొలంలో సుమారు 3 నుండి 5 అడుగుల లోతు వరకు ప్రత్యేకంగా ప్రతి అడుగు 1,2,3 అని గుర్తు పెట్టి పంపాలి.
- నమూనా తీసేటప్పుడు నేలపై ఉన్న ఆకులుఆలమలు,చెత్తాచెదారం,తేసివేయాలి గాని పై మట్టిని తొలగించి రాదు.
- చౌడు భూముల్లో 0 నుండి 15 సెంటీమీటర్లు 15 నుంచి 30 సెంటీమీటర్ల లోతు లో 2 నమూనాలు తీయాలి.
- మెట్ట ఆరుతడి సేద్యంలో పైరు పెరుగుతున్న సమయంలో నమూనా తీయవలసిన అప్పుడు వరుసల మధ్య నుండి నమూనా సేకరించాలి.
భూసార పరీక్షా కేంద్రం ద్వారా నేల రంగు స్వబావం వంటి భౌతిక లక్షణాలు కాక ఉదజని సూచిక,లవణ పరిమాణం, సేంద్రియ కర్బనం, లభ్యం నిర్ధారిస్తారు. సమస్యాత్మక భూముల్లో సున్నం,జిప్సం వేయాలిసన పరిమాణాన్నినిర్ణయిస్తారు. అవసరానికి అనుగుణంగా కూడా తెలుపుతారు.
ఆధునిక వ్యవసాయంలో భూసార పరిరక్షణ దృశ్య తొలకరిలో వేసవి దుక్కులు, నేల స్వభావం, లక్షణాలు కనుగొనేందుకు భూసార పరీక్షల ఆవశ్యకత ఎంతైనా ఉంది. తద్వారా సరైన ఎరువులు యాజమాన్యం పాటించి నాణ్యమైన అధిక దిగుబడిని సాధించేందుకు అవకాశం ఉంటుంది.
డా .పి. అమర జ్యోతి, డా.బి. మౌనిక, జి. నవీన్ కుమార్, డా .డి.చిన్నం నాయుడు
కృషి విజ్ణాన కేంద్రం, ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా.
Also Read: Summer Deep Ploughs Benefits: వేసవి దుక్కులు-ప్రాముఖ్యత