CM KCR Comments On Rythubandhu వరి పంట వేసిన రైతులకు రైతుబంధు ఆపాలని వ్యవసాయ అధికారాల సూచనలను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తిరస్కరించారు. ఈ మేరకు రైతుబంధు, దళితబంధు పథకాలపై సీఎం సంబంధిత అధికారులతో చర్చించిన నేపథ్యంలో సీఎం కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వ్యవసాయ శాఖ అధికారులు సీఎంతో భేటీ అయిన విషయం తెలిసిందే. కేంద్రం వడ్లు సేకరించమని చెప్పిన నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలవైపు ప్రోత్సహించాలని అధికారులు సీఎం కు తెలిపారు. అయినా వడ్లు వేస్తే ఆ మొత్తాన్ని కొనుగోలు చేసే శక్తి రాష్ట్రానికి ఉండదని, ఈ నేపథ్యంలో యాసంగిలో వడ్లు వేయకుండా రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని అధికారులు అభిప్రాయపడ్డారు. కాగా రైతులు వరి వేస్తే వారికీ రావాల్సిన రైతుబంధుని నిలిపివేయాలని వారు సీఎంకు సూచించారు.
రైతుబంధు నిలిపివేయాలన్న అధికారుల మాటలను తిరస్కరించిన ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుబంధు విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని, రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ రైతుబంధు ఇస్తామని సీఎం చెప్పారు. ఈ విషయంలో విపక్ష పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దంటూ సీఎం సూచించారు. ఇక దళితబంధు విడతలవారీగా ప్రవేశపెడతామన్నారు. ముందుగా హుజారాబాద్ లో , ఆ తర్వాత విడతలవారీగా రాష్ట్రవ్యాప్తం చేస్తామన్నారు సీఎం కెసిఆర్. Rythubandhu Scheme For Farmers