30 Lakh Farmers Benefitted Claims of Crop Loss నష్టపోయిన రైతుల్ని ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన PMFBY పథకానికి విశేష స్పందన వస్తుంది. ఈ పథకం ద్వారా తమ కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నాయని అంటున్నారు రైతన్నలు. ప్రతి సంవత్సరం వరదలు, తుఫానులు, వడగళ్లు, భారీ వర్షాలు, కరువు కారణంగా పంటలు నాశనమవుతాయి. ఇలా పంట దెబ్బతింటే ఈ పథకంలో చేరిన వారు పరిహారం పొందొచ్చు. నష్టపోయిన పంటకు బీమా డబ్బులు పొందొచ్చు. అందుకే అన్నదాతలకు ఊరట కలిగించే ఈ స్కీమ్ వల్ల తమకు భరోసా దొరుకుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేసినప్పటికీ కొన్ని భీమా సంస్థలు రైతుల్ని మోసం చేస్తూ చెల్లింపులు చేయట్లేదన్న వాదన ప్రముఖంగా వినిపిస్తుంది.
Maharastra Crop Loss ఇటీవల కాలంలో అకాల వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా తీవ్ర పంట నష్టం వాటిల్లింది. ఆరుగాలం పండించిన పంట నీటమునిగి రైతన్నలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అయితే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ఉన్నందున నష్టపోయిన రైతులు ప్రభుత్వం నుండి నష్టపరిహారాన్ని పొందే అవకాశం ఉంది. కానీ మహారాష్ట్రలో పంట నష్టం విషయాన్నీ భీమా కంపెనీల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో రైతులు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు వ్యవసాయ కార్యాలయం రంగంలోకి దిగి పంట నష్టాన్ని అంచనా వేసి వెంటనే చెల్లింపులు చేపట్టాలని ప్రభుత్వం సూచించింది. దీంతో సదరు కంపెనీలు వెంటనే స్పందించాయి.
30 Lakh Farmers Benefitted ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) అమలు చేస్తున్న బీమా కంపెనీలు మహారాష్ట్రలో పంట నష్టానికి సంబంధించిన క్లెయిమ్‌లను చెల్లించడం ప్రారంభించాయి. ఈ వారం చివరి నాటికి రాష్ట్రంలోని 29.92 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.1,770 కోట్లు బదిలీ చేసినట్లు పేర్కొంది. మిగిలిన మొత్తాన్ని వచ్చే 7 రోజుల్లో బదిలీ చేస్తామని వ్యవసాయ కమిషనర్ ధీరజ్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు పంట నష్టం కోసం మొత్తం 47.61 లక్షల క్లెయిమ్‌లను స్వీకరించింది. అయితే మొత్తం క్లెయిమ్‌లు రూ. 2,750 కోట్లు గా తేలింది. అకాల వర్షం కారణంగా చాలా జిల్లాల్లో రైతులు పూర్తిగా పంట నష్టపోయారని నివేదించినందున రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి దాదాసాహెబ్ భూసే త్వరితగతిన చెల్లింపుకు హామీ ఇచ్చారు. PMFBY Scheme