e-SHRAM Registration దేశవ్యాప్తంగా కార్మికుల సంక్షేమం కోసం కొత్త సేవల్ని అందుబాటులో తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలో మోడీ సర్కారు ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. ముఖ్యంగా రైతులకు, ఉపాధి సంక్షేమ పథకాలు, మరియు ఇతరత్రా పథకాలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కేంద్రం ప్రవేశపెట్టిన బృహత్తర పథకాలలో ఈ-శ్రమ్ ఒకటి. ఈ స్కీం కింద అసంఘటిత రంగాల కార్మికులకు లబ్ది చేకూరనుంది. ఈ పోర్టల్ లో నమోదు చేసుకున్నవారికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయి. ఈ పథకం వల్ల రూ.2 లక్షల ఉచిత ప్రమాద బీమా కూడా లభిస్తుంది. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.2 లక్షలు కుటుంబ సభ్యులకు వస్తాయి. ఒకవేళ ప్రమాదంలో అంగవైకల్యం సంభవిస్తే రూ.లక్ష అందిస్తారు. దీని కోసం మీరు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
What Is e-SHRAM ? ‘ఈ- శ్రమ్’ వెబ్ పోర్టల్ లో ఇప్పటివరకు దాదాపు నాలుగు కోట్లకు పైగా కార్మికులు తమ వివరాలు నమోదు చేసుకున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ నుంచి ఎక్కువగా రిజిస్ట్రేషన్లు వస్తున్నట్లు కేంద్రం ఒక సందర్భంలో తెలిపింది. ముఖ్యంగా వ్యవసాయం, నిర్మాణ రంగాల నుంచి అత్యధిక సంఖ్యలో కార్మికులు ఈ శ్రమ్ లోనమోదయ్యారని తెలిపింది. మాన్యుఫ్యాక్చరింగ్, ఇంటి పనులు, వీధి విక్రయాలు, రవాణా తదితర రంగాలకు చెందిన కార్మికుల నుంచి భారీ ఎత్తున స్పందన వస్తోందని, వలస కార్మికులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నారని వెల్లడించింది. మొత్తం రిజిస్ట్రేషన్లలో దాదాపు 50 శాతం మహిళలు ఉండటం విశేషమని పేర్కొంది.
ఈ శ్రమ్ పథకాన్ని ఇలా పొందండి.. How To Login e-SHRAM Web Portal
గూగుల్ లో ఈ శ్రమ్ అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేసి సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. తర్వాత ఆధార్ ని లింక్ చేసిన మొబైల్ నంబర్ తో ఓటీపీ ద్వారా వెబ్ పోర్టల్ ని లాగిన్ అవ్వాలి. అనంతరం ఆధార్ నంబర్ ని నమోదు చేసి ప్రక్రియ కొనసాగించాలి. వివరాలు నమోదు చేశాక మీరు ఈ-శ్రమ్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక దీని కోసం మీరు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పని లేదు. ఈ శ్రమ్ లో పేర్లను నమోదు చేసుకున్న కార్మికులకు ఒక ప్రత్యేకమైన 12 అంకెల సంఖ్య గల కొత్త ఈ-శ్రమ్ కార్డు జారీ చేస్తారు. ఈ-శ్రమ్ కార్డు దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది. e-SHRAM