Backyard Curry Leaves Farming: కరివేపాకు తినే సమయంలో పక్కకు పారేసిన కూరల్లో మాత్రం తప్పకుండా వేస్తారు..రెండు రెబ్బలు వేస్తే చాలు. ఆ కూరకు వచ్చే సువాసన వేరు. అందుకే సాంబార్ మొదలుకొని బిర్యానీ వరకు అన్నింట కరివేపాకు ఉండాల్సిందే. కరివేపాకు ఒక్క వాణిజ్య సుగంధ భరితమైన పంట. ప్రస్తుతం మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా దీనికి మంచి డిమాండ్ ఉంది. ఈ మొక్కలు ఒకసారి పెంచితే చాలు. చాలా సంవత్సరాల పాటు దిగుబడులు అందిస్తాయి. మార్కెట్ కు వెళ్ళినప్పుడు ఏ కూరగాయ కొన్న, కొనుకున్న కరివేపాకు మాత్రం ఖచ్చితంగా కొంటారు. అందుకే మార్కెట్లో కరివేపాకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఈ డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని కరివేపాకు సాగు చేస్తు మంచి లాభాలు గడిస్తున్నారు గుంటూరు జిల్లాకు చెందిన పలువురు రైతులు
కొత్తిమీర పుదీనా తో సమానంగా కరివేపాకు రేటు
వేసే పంట ఏదైనా దానిని అమ్ముకోవడానికి కష్టపడకుండా, అమ్మితే రైతన్నకు నాలుగు రూపాయలు మిగలాలి. అటువంటి పంటలు రైతులు సాగు చేయాలి. సంప్రదాయంగా పండే వరి, పత్తి వంటి పంటలు పండించిన ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చిన అమ్ముకోవడానికి అవస్థలు పడాల్సి వస్తోంది. వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగుచేసిన పంటలను అమ్ముకోవడానికి కష్టపడే బదులు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంటలను అతి తక్కువ పెట్టుబడితో సాగుచేసుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు వ్యవసాయ నిపుణులు. అతి తక్కువ పెట్టుబడి తో సాగుచేసే పంటలలో కరివేపాకు ఒకటి.. నిజానికి ఇంటి పెరట్లో పెంచుకునే కరివేపాకును ప్రత్యేకంగా సాగు చేసుకోవడం కొత్తగానే అనిపించినా, పట్టణాలన్నీ కాంక్రీట్ వనాలుగా మారిపోతున్న ఈరోజుల్లో కరివేపాకును పెంచే వారి కంటే కొన్నివాళ్లే ఎక్కువైపోయారు. దీంతో కొత్తిమీర పుదీనాతో సమానంగా కరివేపాకు కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని కరివేపాకును ఒక్క పంటగా సాగుచేస్తు మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.
Also Read: Spine Gourd Pickles: పచ్చళ్ల తయారీకి ఉపయోగిస్తున్న ఆకాకరకాయ.!
ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలకు, గల్ప్ దేశాలకు ఎగుమతి
మార్కెట్లో మిగతా కూరగాయలతో పోలిస్తే కరివేపాకుకు ధర కొంచెం తక్కువే అయినా ప్రతి ఒక్కరు కొనేది కావడంతో మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే కరివేపాకును సాగు చేస్తున్న గుంటూరు రైతులు చుట్టుప్రక్కల మార్కెట్లలోని వ్యాపారులకే కాదు. ఉత్తర భారత దేశంలోని రాష్ట్రాలకు, గల్ప్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. వాణిజ్య సరళిలో ఈ పంటను సాగుచేసి లాభాలను అర్జిస్తున్నారు. ఏడాదిలో మూడుసార్లు చేతికి వచ్చే పంట కావడంతో పాటు శ్రమ కూడా తక్కువగా ఉంటటంతో రైతులు ఈసాగు వైపు మళ్లుతున్నారు.. విత్తనం నాటిన తర్వాత ఎనిమిది నెలలకు పంట చేతికి వస్తుంది..ఒక్కసారి సాగు మొదలుపెడితే 40 ఏళ్లపాటు దిగుబడి పొందవచ్చని రైతులు అంటున్నారు.. చేతికి వచ్చిన పంటను అమ్ముకోవడం కూడా సులభతరమే… ఎకరానికి లక్ష నుంచి లక్షన్నర ఆదాయం వస్తుందని రైతులు అంటున్నారు
కరివేపాకు తోటలో అంతర పంటలు
కరివేపాకులో చీడ పీడలు ఎక్కువగానే ఉంటాయి. వాటి కోసం సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.. ముఖ్యంగా వర్షాకాలంలో కొమ్మలు కట్ చేసి వదిలేయడం వల్ల తిరిగి ఆరోగ్యకరమైన ఆకులు వచ్చే అవకాశాలున్నాయి. కరివేపాకు తోటలో పప్పు ధాన్యాలు, ఆకుకూరల్ని అంతర పంటలుగా సాగుచేసి అదనపు ఆదాయం పొందవచ్చు..కరివేపాకును మొట్ట ప్రాంతాల్లో కూడా వేయవచ్చు, అధిక నీటిని అది తట్టుకోలేదు.
Also Read: Curry leaves Cultivation: కరివేపాకు సాగుతో రైతులకి బారి లాభాలు ఎలా సంపాదిస్తున్నారు.. ?