ఈ నెల పంటచీడపీడల యాజమాన్యంమన వ్యవసాయంవ్యవసాయ పంటలు

మామిడి పూత దశలో చీడల నివారణ మరియు సూక్ష్మ పోషక లోపాల నివారణ

0

మామిడిలో పూత, పిందె సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు.. - Eruvaaka

భారత దేశంలో పండ్ల ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉంది. పండ్ల తోటల్లో మామిడి పంట ప్రధానమైనది. ప్రస్తుతం భారతదేశంలో మామిడి 2,339 మిలియన్ హెక్టార్లో 29,336 మిలియన్ టన్నుల ఉత్పత్తిలో సాగు చేయబడుతున్నది. ప్రధానంగా మామిడి పండించు రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్, బీహార్, ఒరిస్సా మరియు కర్ణాటక. తెలంగాణలో 34 వేల హెక్టార్లో 11.47 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిలో సాగు చేయబడుతున్నది. మన నాగరకర్నూల్ జిల్లాలో 27,561 హెక్టార్లో 9.2 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిలో సాగు చేయబడుతున్నది. మామిడిని పండ్లు రారాజుగా పరిగణించబడుతుంది. అద్భుతమైన రుచి మరియు ఆకర్షణీయమైన సువాసనతో పాటు ఇందులో విటమిన్ ఎ &సి పుష్కలంగా ఉంటుంది.

మామిడిలో చిన్న పిందెలు ఏర్పడే దశలో, తామర పురుగు, పిండి పురుగులు, మచ్చ తెగులు మరియు బూడిద తెగులు ఆశించి పంటను నష్టపరుస్తాయి. ఈ దశలో పిందె రాలుడు సమస్య అధికంగా ఉంటుంది. ఈ సమస్యలన్నిటిని నివారించుటకు పిందకట్టే దశలో పీప్రోనిల్ 2 మి. లీ/లీటర్ లేదా ఇమిడాక్లోఫ్రిడ్ 0.3 మి.లీ/లీ. లేదా ధాయోమిథాక్సామ్ 0.3 గ్రా/లీ మరియు హెక్సాకొనాజోల్ 2 మి.లీ/లీ నేటికి కలిపి పిచికారి చేయాలి.

మామిడిలో పూత సకాలంలో రావడానికి సూచనలు - Eruvaaka

సూక్ష్మ పోషక లోపాలు:- మామిడిలో వివిధ రకాల సూక్ష్మ పోషక లోపాల వల్ల పిందె మరియు పూతరాలడం గమనించవచ్చు. అలాగే కాయలు సరిగ్గా పెరగవు. కాయలు నాణ్యత, రుచి ఉండదు. ప్రస్తుతం మామిడి పూత దశలో ఉంది. ఈ తరుణంలో సూక్ష్మ పోషక లోపాలను నివారించడానికి చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు గురించి తెలుసుకుందాం.

జింకు లోపం:- సాధారణంగా చౌడు నెలల్లో ఎక్కువగా కనిపిస్తుంది. జింకు లోపం ఉన్న నేలల్లో మొక్కలు పెరుగుదల క్షీణించి, పాలిపోయి చనిపోతాయి. పెరుగుదల దశలో జింకు లోపం ఉన్న యెడల ఆకులు చిన్నవిగా మారి సన్నబడి, పైకి లేదా క్రిందికి ముడుచుకొని పోతాయి. కనువుల మధ్య దూరం తగ్గిపోయి, ఆకులు గులాబీ రేకుల వలె గుబురుగా తయారవుతాయి. మొక్కల పెరుగుదల క్షీణించి, కాయలు పెరుగుదల, నాణ్యత మరియు దిగుబడి తగ్గిపోతుంది.

కాయలు కోసిన వెంటనే జూన్ – జూలై మాసాల్లో 15 రోజులు వ్యవధుల్లో రెండుసార్లు లీటరు నీటికి 5 గ్రా జింక్ సల్ఫేట్ తో పాటు 10గ్రా యూరియాను మరియు 0.1 మి.లీ/ స్టిక్కర్/ వైటర్ (ఇనడోట్రాన్ లేదా ట్రైటాన్) కలిపి పిచికారి చేయటం వలన జింకు లోపాన్ని నివారించవచ్చు.

మామిడి చెట్లను ఆశించే పూత పురుగులను అరికట్టే పద్ధతులు..

బోరాన్ లోపం:- బోరాన్ లోపం గల చెట్ల ఆకులు , ఆకుకొనలు నొక్కుకు పోయినట్లుయి, పెలుసుగా తయారవుతాయి. కాయ దశలో  పగుళ్లు రావడం సర్వసాధారణంగా కనపడే లక్షణం. బోరాన్ లోప నివారణకు ప్రతి మొక్కకు 100గ్రా బోరాక్స్ భూమిలో వేయాలి లేదా 0.1 నుండి 0.2 శాతం బోరాక్స్ లేదా బోరికామ్లం కొత్త చిగురు వచ్చినప్పుడు ఒకటి లేదా రెండు సార్లు పిచికారి చేయాలి.

ఇనుపధాతు లోపం:- ఇనుపధాతు లోపం గల చెట్ల ఆకులు పచ్చదనం కోల్పోయి తెల్లగా పాలిపోతాయి. ఆకుల సైజు తగ్గిపోయి తీవ్రమైన లోపం ఉన్న యెడల మొక్కల ఆకుల పై నుండి క్రింద ఎండిపోతాయి. ఇనుపధాతు లోపం సున్నపురాయి ఉన్న నెలలో సాధారణంగా కనబడుతుంది. దీని నివారణకు 2.3గ్రా అన్నభేది + 1గ్రా నిమ్మ ఉప్పు లేదా ఒక బద్ద నిమ్మకాయ రసం లీటర్ నీటిలో కలిపి 15 రోజులు వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.

పిందపండు బారటాన్ని నివారించడానికి 19-19-19 ఏ 10 గ్రా/లీ నీటికీ  మరియు ప్లానోఫిక్స్ అనే హార్మోన్ మందును 1 మి.లీ/4.5లీ నీటికి కలిపి పిచికారి చేయాలి. సూక్ష్మ పోషక నివారణకు ముందు జాగ్రత్తగా ఒక మొక్కకి 50-100 కేజీల పశువుల ఎరువు మరియు 100 గ్రాముల జింక్ సల్ఫేట్ 100 గ్రాముల ఫెర్రవ్ సల్ఫేట్ ఉపయోగించడం వల్ల మామిడిలో సూక్ష్మ పోషకాలలోపాలను అధిగమించి అధిక దిగుబడులను పొందవచ్చు.

Leave Your Comments

రాబోయే నూతన రకాలతో వరి సాగు లో 50 శాతం యూరియా వాడకం తగ్గే అవకాశం

Previous article

పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం కూరగాయ పంటల్లో నివారణ చర్యలు మరియు జాగ్రత్తలు

Next article

You may also like