రైతులు

Doubling of Farmers Income: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయుటకు చేపట్టాల్సిన వ్యూహాత్మక చర్యలు.!

3
Doubling of Farmers Income
Doubling of Farmers Income

Doubling of Farmers Income: గ్రామస్థాయిలో రైతులు వేరువేరు వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా వివిధ పంటల సాగుతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా (పశువులు, కోళ్లు, గొర్రెలు, మేకలు, తేనె టీగలు, పట్టుపురుగులు) ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. నేల రకం, నీటిలభ్యతను బట్టి వ్యవసాయ పరిస్థితులు ఉంటాయి. వ్యవస్థాపక పరిస్థితిని బట్టి పంటల సరళి, పంటల యాజమాన్య పద్ధతులు మారతాయి ప్రస్తుతం ఎక్కువ మంది కవులు రైతులు వ్యవసాయం చేయడం వలన పంట వేసే ముందు చేయాల్సిన పనులు చేయలేకపోవడం వలన (పంటల అవశేషాల యాజమాన్యం, వేసవి లోతు దుక్కులు, భూసార పరీక్షలు, పశువుల ఎరువు తోలడం పచ్చిరొట్ట పైర్ల సాగు లాంటివి) భూసారం తగ్గటం, కలుపు చీడపీడల సమస్యలు అధికం అవ్వడం వలన సాగు ఖర్చులు పెరిగి వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు.

2015-2022 వరకు రైతులకు వాస్తవిక ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి రైతుల ఆదాయంతో 10.41 శాతం వార్షిక వృద్ధి అవసరం అందువలన రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాల్సిన అవసరం చాలా ఉంది. వ్యవసాయ రంగంలో ఉన్న ప్రధాన వనరులు ఉపయోగించి అంటే వివిధ పంటల ఉత్పాదకత పెరుగుదల, పంట విస్తీర్ణం పెంచడం మరియు అధిక విలువ గల పంటలను విస్తరించడం వలన రైతుల ఆదాయాన్ని పెంచవచ్చు.

దేశంలోని మొత్తం భౌగోళిక ప్రాంతాల్లో వ్యవసాయేతర అవసరాల కోసం భూమిని వాడడం వలన భూసాగులో మరింత విస్తీర్ణం సాధ్యపడదు. దీనివలన 2004`2005 వ్యవసాయ భూమిని, వ్యవసాయేతర అవసరాలకు మళ్ళించడంతో పది లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి తగ్గింది. అందువలన వ్యవసాయంలో ఉన్న భూమితో ఉత్పత్తిని పెంచడానికి యూనిట్‌ ఉత్పత్తికి ఉత్పాదకతలో మెరుగుదల రావాలి.

దేశంలో వ్యవసాయ ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంపొందించే అత్యంత శక్తివంతమైన ఉపరకరణాలు నీటిపారుదల మరియు సాంకేతిక అభివృద్ధులను మెరుగుపరచడం ద్వారా ఇది సాధ్యం అవుతుంది. భారతదేశం ప్రధాన పంటలను ఖరీఫ్‌ మరియు రబీ కాలంలో రైతులు అదే భూమిలో సంవత్సరానికి రెండు పంటలను పండిరచవచ్చు. నీటిపారుదల మరియు నూతన సాంకేతిక పరిజ్ఞాన లభ్యతతో ప్రధాన ఖరీఫ్‌ మరియు ప్రధాన రబీ కాలాల తర్వాత స్వల్పకాల పరిమితి పంటలను సాగు చేయడం ద్వారా అధిక దిగుబడును పొందడం సాధ్యమవుతుంది.

భూమి వినియోగ గణాంకాల ప్రకారం రెండో పంటను నికర విత్తన ప్రాంతంలో 38.9% మాత్రమే వినియోగిస్తున్నారు. ఇది దేశంలో 60 శాతం కంటే ఎక్కువ వ్యవసాయ భూములను ఉత్పత్తి చేయడంలో ఉపయోగించలేదని సూచిస్తుంది. అందుబాటులో ఉన్న వ్యవసాయ భూమిని అన్ని కాలాలలో సక్రమంగా వినియోగించుకుంటే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.
అధిక విలువలను ఇచ్చే పంటలను ఎంపిక చేసుకుని సాగు చేయడం వలన రైతుల ఆదాయాన్ని మెరుగుపరచేందుకు గొప్ప అవకాశం ఉంది.

కూరగాయలు, పండ్లు, నీరా పంటలు, పూలు, మసాలా దినుసులు, పప్పులు, చెరకు మరియు పత్తి పంటలను సాగు చేయడం వలన ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాలైన వ్యవసాయ రంగంలో మొత్తం 64% రైతులు పాల్గొంటున్నారు మరియు మొత్తం గ్రామీణ నికర ఉత్పత్తిలో 39% వాటాను అందిస్తున్నారు. ఎక్కువ మంది రైతులు నిరుద్యోగం వలన వ్యవసాయంలో పాల్గొంటున్నారని వ్యవసాయం మరియు వ్యవసాయతర రంగాలకు మధ్య కార్మికుల ఉత్పాదకతలో పెద్ద వ్యత్యాసాన్ని కూడా వెల్లడిస్తుంది. దీని కారణం రైతులకు, వ్యవసాయ అనుబంధ వ్యాపార రంగాలలో అవగాహన లేకపోవడం వ్యవసాయ అనుబంధ వ్యాపార రంగాలలో రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహణ వలన కూడా రైతులు ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.

వ్యవసాయం నుండి రైతులు సంపాదించిన ఆదాయం ప్రస్తుత ధరలపై ఆధారపడి ఉంటుంది. ద్రవ్యోల్భణం కారణంగా ప్రస్తుత ధరలు పూర్తిగా పెరగవచ్చు. అందువల్ల స్వచ్ఛమైన ద్రవ్యోల్భణ కోసం సర్దుబాటు చేయబడిన స్థాయి మరియు మార్పు యొక్క నిజమైన కొలత ఒకటి అవసరం. మార్కెట్‌ ధరలను నియంత్రించడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.

Also Read: పిచ్చి కుక్క కరిస్తే ఏం చేయాలి?

Doubling of Farmers Income

Doubling of Farmers Income

రైతుల ఆదాయాన్ని పెంచుకోనడానికి కొన్ని సూచనలు :

. ఉత్పాదకతను పెంచడం ఉన్న భూమిని సమర్థవంతంగా వినియోగించుకోవాలి (జన్యుపరంగా వివిధ పంటల విత్తనాల అభివృద్ధి, అధిక దిగుబడినిచ్చి, చీడపీడలను తట్టుకొని మార్కెట్లో ఎక్కువ ధర వచ్చే రకాలను రూపొందించుట ఎగుమతికి అనుకూలమైన రకాలైన అభివృద్ధి చేయాలి)

. సాగు విస్తీర్ణం పెంచలేము కాబట్టి ఉన్న సాగు విస్తీర్ణంలో అధిగదిబడులను ఇచ్చే రకాలను జన్యుపరంగా అభివృద్ధి చేయాలి.

. రైతులకు కావలసిన నాణ్యమైన విత్తనాలను, ఎరువులను, పురుగు మందులను సరైన సమయాల్లో సరైన ధరలకు అందించి వాటిని సమర్ధవంతంగా ఉపయోగించుకునేటట్లు చూడాలి.

. పంట కోత నష్టాలను తగ్గించుకొని, సాగు ఖర్చు తగ్గించుకొని ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చు.

. వ్యవసాయంలో విలువ ఆధారిత ఉత్పత్తులను పెంచుకోవాలి.

. రైతులకు గిట్టుబాటు ధర రావడానికి మార్కెట్లో సంస్కరణలు తీసుకుని రావడం గ్రామస్థాయిలో వ్యవసాయ పంటలకు నిలువ గోదాములు ఏర్పాటు చేయడం మార్కెట్‌ వ్యవస్థలను పటిష్టం చేయడం.

. నియంత్రిత పంటల సాగు చేపట్టడం వలన రైతుల ఆదాయం పెంచుకోవాలి.

. రైతులు పంటభీమాను తప్పకుండా చేసుకోవాలి. పంటల భీమా చేయడానికి సులభతరం చేయాలి.

. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలపై దృష్టి పెట్టాలి.

. భూసార పరీక్షల కార్డుల పంపిణీ భూసార ఆధారిత ఎరువుల వాడకం ద్వారా ఖర్చు తగ్గించుకోవాలి.

. నాణ్యమైన మూల విత్తనాలను రైతులకు అందించి, గ్రామీణ విత్తనోత్పత్తి పథకం ద్వారా నాణ్యమైన విత్తన లభ్యత పెంచడం సొంత విత్తనం వాడుకోవడం వలన ఖర్చు తగ్గించుకొని ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చు.

. సమగ్ర పంటల యాజమాన్యం చేపట్టడం (సమగ్ర రక్షణ, సమగ్ర పోషక యాజమాన్యం, నీటి యాజమాన్యం, కలుపు యాజమాన్యం నీటి వినియోగ సామర్ధ్యాన్ని పెంచాలి).

. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం సేంద్రియ ఉత్పత్తుల రిజిస్ట్రేషన్‌ సులభతరం చేసి సేంద్రియ ఉత్పత్తుల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలి.

. సమస్యాత్మక భూములను బాగు చేసి పంటలు ఉత్పాదకతను పెంచుకోవాలి.

. సహజవనులను అభివృద్ధి చేయడం, కరువు పరిస్థితులను అధిగమించడానికి నీటి నిల్వకు నీటి కుంటలు మరియు సూక్ష్మసేద్యం, బిందు సేద్యం చేపట్టడం.

. వాతావరణ ఆధారిత పంటల సరళి రూపకల్పన మరియు కరువును జయించుటకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రూపొందించాలి.

. అంతర పంటలను (వేరుశనగ G కంది) (కందిGకొర్ర )వివిధ వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా వేసుకొని రైతుల ఆదాయాన్ని పెంచుకోవాలి.

. పంటల కీలక దశలలో నీటిని అందించడం వలన అధిక దిగులు పొందవచ్చు.

. మిశ్రమ వ్యవసాయం (వ్యవసాయంతో పాటు ఇతర అనుబంధ రంగాలు) చేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చు.

. వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా సాగు ఖర్చు తగ్గించుకొని ఆదాయాన్ని పెంచుకోవచ్చు (పంట వేసినప్పటి నుండి కోత వరకు)

. వ్యవసాయ వ్యాపార రంగాలైన పుట్టగొడుగులు, తేనెటీగలు, అజోల్లా, జీవన ఎరువులు, వర్మీ కంపోస్ట్‌, వేప ఆధారిత ఉత్పత్తులు మరియు చిరుధాన్యాల ఉత్పత్తుల ద్వారా రైతులు ఆదాయాన్ని పెంచుకోవచ్చు.

. ఉద్యాన పంటలలో అంతర పంటలుగా వ్యవసాయ పంటలను వేయడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చు.

. ఔషధ మొక్కలైనా తులసి, అశ్వగంధ, అలోవీరా ఇతర ఔషధ విలువలు కలిగిన మొక్కలను పెంచడం ద్వారా రైతుల ఆదాయాన్ని పొందవచ్చు.

. వృక్షజాతి మొక్కలైన టేకు, వేప, గంధం, ఎర్రచందనం, వెదురు సంబంధిత మొక్కల పెంపకం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చు.

. వ్యవసాయంలో సాగు ఖర్చు తగ్గించుకోవడానికి వేద పద్ధతిలో వరి, జీరోటిల్లేజ్‌, మొక్కజొన్న, జొన్న ఇతర కూరగాయ మొక్కలను సాగు చేసి ఆదాయాన్ని పెంచుకోవచ్చు.

. సహజ విపత్తులను ఎదుర్కొనేందుకు సరైన ప్రణాళిక రూపొందించాలి.

. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను, ఇతరు రైతు సంఘాలను బలపరిచి వారి ద్వారా వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేసి రైతులలో సేంద్రియ వ్యవసాయాన్ని, తృణధాన్యాల సాగును ప్రోత్సహించాలి.

. వాణిజ్య పంటలైన చెరకు, తమలపాకు, కూరగాయల సాగు మరియు సుగంధ ద్రవ్య పంటలైన పసుపు, అల్లం, ధనియాలు, వెల్లుల్లి, వాము మరియు సోంపు లాంటివి సాగు చేసి ఆదాయాన్ని పెంచుకోవచ్చు. సహజ రంగు తీత పంటలైన జాఫ్రాను సాగు చేసి ఆదాయాన్ని పెంచుకోవాలి.

. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తగిన సమాచారాన్ని వివిధ మాధ్యమాల ద్వారా విస్తరణ కార్యక్రమాలను విస్తృత పరచడం వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయనికి సంబంధించిన ఇతర అధికారులు సరైన శిక్షణా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి రైతులలో ఉత్సాహాన్ని కలుగజేసి రైతుల సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచి రైతుల అభివృద్ధికి తోడ్పడేలా చేయాలి.

. ప్రస్తుతం తరుగుతున్న భూగర్భ జలాలు, పంటల అవశేషాలను కాల్చడం, సేంద్రీయ కర్భనం తగ్గడం, అసమతుల్యత పోషకాల వినియోగం, కార్మికుల కొరత, వేతనాల పెరుగుదల, ఇంధన ధరల పెరుగుదల, సహజ వనరులు నేల, నీరు, గాలి కలుషితం మరియు అధిక వినియోగం అనేది వ్యవసాయ ఉత్పాదకతపై ప్రభావం చూపుతాయి.

. వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేసే కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రాలు చాలా కీలకపాత్ర పోషించాలి.

. పిఎం`కిసాన్‌ వంటి సామాజిక భద్రత వంటి పథకాలు సన్న చిన్న కారు రైతుల అభివృద్ధికి సహాయపడతాయి.

. వ్యవసాయ రంగంలో పరిశోధనా మరియు విస్తరణలు పెట్టుబడి పెంచాలి. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో చాలా తక్కువ. వ్యవసాయ పరిశోధనలు పెట్టుబడులను వ్యూహపరచిన చేయాల్సిన అవసరం ఉంది.

. వాతావరణ ఆధారిత మెరుగైన సాంకేతి పరిజ్ఞానాన్ని రూపొందించడం మరియు వ్యాప్తి చేయడం చురుగ్గా చేయాలి.

. వాతావరణ మార్పులు, సహజమనులు క్షీణత వంటివి ఉద్భవిస్తున్న సవాళ్లు, పోషక ఆహార లోపాల నివారణకు భిన్నమైన విధానం మరియు ఉన్నత పరిశోధన అవసరం.

. ఆధునిక సాధనాలు, మౌళిక సదుపాయాలు మరియు నైపుణ్యాలు పెంచుకొని రైతుల ఆదాయాన్ని పెంచడంలో దోహదపడాలి.

. వ్యవసాయంలో నూతన అంశాలైన రక్షిత వ్యవసాయం ఖచ్చితమైన వ్యవసాయం పరిరక్షణ, వ్యవసాయ పరిజ్ఞానం వలన నిర్దిష్ట ఉత్పత్తిని పెంచడం, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం, ఇన్పుట్‌ వినియోగ సామర్ధ్యాన్ని మెరుగుపరచడం వలన రైతుల ఆదాయాన్ని పెంచవచ్చు.

. బయోపెర్టిఫికేషన్‌ (పంటల రకాలు ఎక్కువ శాతం విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కొవ్వులు ఉండేటట్లు చేయడం) ద్వారా కావలసిన పోషకాలను అవసరమైనవి అందించాలి.

. వ్యవసాయ రుణ వ్యవస్థను బలోపేతం చేయడం.

. బహుళ సంస్థాగత పరిశోధనా, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం మరియు అభివృద్ధి చేయడం తగిన పరిశోధన మౌలిక సదుపాయాలు ఏర్పరచుకొని రైతుల అభివృద్ధికి వారి ఆదాయాన్ని పెంచుకోవడానికి దోహదపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Also Read: కూరగాయల సాగులో నారుమడుల యాజమాన్యం.!

Leave Your Comments

Dog Bite Precautions: పిచ్చి కుక్క కరిస్తే ఏం చేయాలి?

Previous article

Tasks for Fruit Orchards: పండ్ల తోటల్లో చేపట్టవలసిన పనులు, సూచనలు.!

Next article

You may also like