Niti Aayog Woman Farmer: చీపురుపల్లి గ్రామం, విజయ నగరం జిల్లాకు చెందిన శ్రీమతి. బెల్లాన శ్రీదేవి గారు నిన్న (సోమవారం) నీతి ఆయోగ్ (Niti Aayog) ప్రకటించిన సహజ వ్యవసాయం ఉత్తమ రైతు జాబితాలో నిలిచారు. ఈమె పాటించిన పద్దతులు, పండించిన పంటలకు గాను వీరి పేరు సహజ వ్యవసాయ ఉత్తమ రైతుల కింద నీటి ఆయోగ్ ప్రచురించింది. వీరు విజయనగరం ఎం.పీ బెల్లాన చంద్రశేఖర్ గారి సతీమణి, చీపురుపల్లి ఉపసర్పంచ్ కావడంతో విజయనగరం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Niti Aayog Woman Farmer -Bellana Sridevi
బెల్లాన శ్రీ దేవీ గారు అవలంబించిన పద్ధతులు:
రబీ సీజన్‌లో 9 రకాల దేశీ వరి సాగు చేశారు. వరి సాగుకు ముందు నవధాన్యాన్ని పచ్చి ఎరువుగా వాడారు. కలుపు మొక్కల నిర్వహణ కోసం వ్యవసాయ యాంత్రీకరణను స్వీకరించారు. ద్రవ జీవామృతం, ఘనైవామృతం మరియు కషాయాలు వంటి సహజ ఇన్‌పుట్‌లను సిద్ధం చేశారుశ్రీ దేవీ గారు.
Also Read: Woman Farmer Success Story: ఇంట్లో ‘మినీ ఫారెస్ట్’
డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ సర్వీసెస్ ద్వారా ఇన్‌పుట్ డీలర్‌లకు శిక్షణ కూడా ఇచ్చారు. సహజ ఇన్‌పుట్‌ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఇన్‌పుట్ డీలర్స్ (DAESI) ప్రోగ్రామ్, వ్యవసాయ శాఖ యొక్క ఫార్మర్ ఫీల్డ్ స్కూల్ (FFS) శిక్షణలలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ (APCNF)పై శిక్షణ ఇచ్చారు.
ప్రయోజనాలు మరియు విజయాలు:
* సాగు ఖర్చు తగ్గింది.
* తెగుళ్లు మరియు వ్యాధుల వ్యాప్తి నిర్వహించబడుతుంది.
* రైతులను ప్రోత్సహించి వర్షాకాలం ముందు డ్రై పద్దతిలో విత్తేటట్లు ప్రోత్సహించారు. PMDS, APCNF పద్దతులతో పాటు రసాయన రహిత ఆరోగ్యకరమైన ఆహారం పండించిన ఫలితంగా అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ (ARS) ద్వారా ఉత్తమ మహిళా రైతుగా శ్రీదేవి గారు నిలిచారు.
Also Read: Women Farmers: మహిళా రైతులు సులభంగా ఉపయోగించుకునేలా వ్యవసాయ యంత్రాలు