Farmer Success Story: వ్యవసాయ నేపథ్యానికి చెందిన సలీమ్ అందరిలాగానే రసాయన వ్యవసాయం చేస్తూ వస్తున్నాడు. సేంద్రియం గురించి తెలుసుకుని తన రసాయనిక వ్యవసాయాన్ని సేంద్రియంలోకి మార్చుతున్నాడు. సలీం మొత్తం 6 ఎకరాల భూమిని సాగు చేస్తున్నాడు. అందులో మామిడి, బొప్పాయి, జామ, మల్లె మొదలగు పంటలు సాగు చేస్తున్నాడు.
లైనుకి లైనుకి మరియు మొక్కకు మొక్కకు 18 అడుగులు దూరం పాటించి 4 ఎకరాలలో మామిడి మొక్కలు 2016 వ సంవత్సరం సెప్టెంబరు మాసంలో నాటించినాడు. ఇందులో బంగినపల్లి, కేసరి, హిమాయత్, రసాలు, దశేరి, జద్దు, కొత్తపల్లి కొబ్బరి మొదలగు రకాల మామిడి మొక్కలను నాటించినాడు. వీటన్నింటిని 2018వ సంవత్సరం నవంబరు వరకు రసాయనములతో సాగు చేసి అప్పటి నుండి రసాయనాలు మానివేసి సేంద్రియ పద్ధతులు పాటిస్తున్నాడు. అందుకుగాను ఒక నాటు ఆవుని కూడా పోషిస్తూ ఆవు వ్యర్థాలైన పేడ మరియు మూత్రాలను తన సాగుకొరకు ఉపయోగిస్తున్నాడు. 2019వ సంవత్సరం జనవరి మాసంలో మామిడి మొక్కల లైనులో 6 అడుగుల దూరంలో బొప్పాయి మొక్కలను నాటించినాడు. బొప్పాయి మొక్కలు ఒక్కొక్కటి 15/-ల చొప్పున రైల్వే కోడూరు నుంచి తెప్పించాడు. మామిడి ఈ సంవత్సరమే దిగుబడి మొదలయ్యింది. బొప్పాయిలో ఇప్పుడిప్పుడే పిందెలు వస్తున్నవి.
Also Read: Bamboo Farmer Success Story: ఎదురు లేని లాభం వెదురు సాగుతో సాధ్యం.!
గాలులు తట్టుకునే మామిడి రకం: సాధారణంగా మామిడి రైతులను విపరీతంగా నష్టపరిచే విషయం గాలులకు మామిడి కాయలు రాలటం. కొన్ని రకాలలో చిన్న చిన్న గాలులకే చెట్టుకున్న మల్లె పంటను సా కాయలు రాలిపోతుంటాయి. కాని టోమి అట్కిన్ రకం మామిడి చిన్న ప్రస్తుతానికి మల్లె ప గాలులకు తట్టుకొని నిలుస్తుంది. ఇది ప్రతి సంవత్సరం కాపుని ఇస్తుంది. ఈ రకంలో పీచు ఎక్కువగా ఉంటుంది. తీపి తక్కువగా ఉంటుంది మరియు నిల్వ సామర్థ్యం చాలా ఎక్కువ. కాయ పండే వరకు చెట్టుకే ఉండి రాలే అవకాశాలు తక్కువగా ఉంటవి. పక్వానికి వచ్చిన కాయలు చెట్టు నుంచి కోసి గడ్డిలో ఉంచితే ఎలాంటి హార్మోన్లు అందించకుండానే టోమిఅట్కిన్ రకం కాయలు పండుతవి అని ఈ రకం మామిడి మొక్క విశేషాలను సలీమ్ తెలియజేశారు.
2 ఎకరాలలో జామ పంటను సాగు చేస్తున్నాడు. లైనుకి లైనుకి మరియు మొక్క మొక్కకి 6 అడుగుల దూరం పాటించి అల్హాబాద్ సఫేదా మొక్కలను మామిడి మొక్కలు నాటే సమయములోనే నాటించాడు. జామ మొక్కలు పెట్టిన సంవత్సరం తరువాత దిగుబడి మొదలయ్యింది. జామ, మామిడి, బొప్పాయి పంటల సాగుకు క్రమం తప్పకుండా నెలకు ఒక్కొక్క చెట్టుకు 5 లీటర్ల చొప్పున జీవామృతాన్ని డ్రిప్పుద్వారా అందిస్తున్నాడు. అవసరాన్ని బట్టి నీమాస్త్రం పిచికారి చేయడంతో పాటు క్రమం తప్పకుండా ఫిష్తోమినోయాసిడ్, ఎగ్జామినోయాసిడ్లను పిచికారి చేస్తూ వస్తున్నాడు. పశువుల ఎరువుకి వేస్ట్ డికంపోజరు, ట్రైకోడెర్మావిరిడె మొదలగునవి కలిపి బాగా కుళ్ళిన తరువాత మామిడి, జామ మొదలగు వాటికి ఒక్కొక్క మొక్కకు 25 నుంచి 30 కిలోల చొప్పున ప్రతి సంవత్సరం మొక్కల పాదులలో అందిస్తున్నాడు. ఈ పంటలతో పాటు కొంత ప్రాంతంలో ఆవుకి మేత పండించడంతో కొంత ప్రాంతంలో మల్లె పంటను సాగు చేస్తున్నాడు. ప్రస్తుతానికి మల్లె పంటను రసాయన పద్దతిలో సాగు చేస్తున్నాడు.
Also Read: Farmer Success Story: సంప్రదాయ పంటల కంటే హార్టికల్చర్ పంటల ద్వారా ఎక్కువ లాభాలు
Must Watch:
-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171